NLG: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను హాలియా మున్సిపల్ ఛైర్మన్ చింతల చంద్రారెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సాగర్ ఎడమ కాలువ ప్రాంతంలో వైస్ ఛైర్మన్ రాజా రమేష్ యాదవ్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి పారిశుధ్య పనులు నిర్వహించారు.
W.G: విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలయ్యేలా చూడాలంటూ పెనుగొండ విద్యాశాఖ అధికారి పి.రామకృష్ణకు ఎస్ఎఫ్ఐ నాయకులు శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. మండలంలో కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్య హక్కు చట్టాన్ని నీరుగారుస్తున్నాయన్నారు. అలాంటి విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన లక్ష్యంతో కేంద్రం చేపట్టిన HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం చర్చకు దారితీస్తోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాక్సిన్‌ను అత్యంత సురక్షితమైందిగా గుర్తించింది. ప్రస్తుతం 100కుపైగా దేశాల్లో ఈ వ్యాక్సిన్‌ను విజయవంతంగా ఉపయోగిస్తున్నారు. ఇది గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే అత్యంత ప్రమాదకరమైన HPV వైరస్ రకాలను సమర్థవంతంగా అరికడుతుందట.
RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలంలోని పిల్లిగుండ్ల గ్రామ మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి ఇవాళ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియచెప్పాలని మాజీ సర్పంచ్‌కు హరీష్ రావు సూచించారు.
NDL: అవుకు మండలం రామాపురం గ్రామంలో ఇవాళ బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కలిసి పర్యటించారు. గ్రామ వైసీపీ నాయకుడు పేరం వెంకటసుబ్బారెడ్డి ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అనంతరం వారు మాజీ ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్‌ను ఘనంగా సన్మానించారు.
AP: బయట మార్కెట్‌లో దొరికే నెయ్యి కంటే ఇందాపూర్ నెయ్యి ధర ఎక్కువని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నెయ్యి వివాదాన్ని దేవుడే చూసుకుంటాడని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంగన్‌వాడీలకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
MBNR: చట్ట సభలలో మహిళలకు 33% రిజర్వేషన్ చట్టం 2029లో అమలులోకి రాబోతుందని ఎంపీ డీకే అరుణ స్పష్టంచేశారు. ఇవాళ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో HYDలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు జిల్లా ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంలో ప్రధాని మోడీ మహిళ సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు.
WNP: రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా కొనసాగుతున్నామని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కంటి పరీక్షలు నిర్వహించారు. టౌన్ ఎస్సై హరిప్రసాద్ మాట్లాడుతూ.. సురక్షిత ప్రయాణానికి స్పష్టమైన కంటి చూపు అత్యంత ముఖ్యమని ఆయన తెలిపారు.
T20 WC 2026 టైటిల్ కోసం ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ తుది పోరుకు అహ్మదాబాద్ వేదిక కావడం క్రికెట్ అభిమానులను కలవర పెడుతోంది. వన్డే వరల్డ్ కప్ 2023లో అజేయంగా రాణించిన రోహిత్ సేన ఇక్కడే ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్ ఓడింది. ICC టోర్నీల్లో వరుసగా 13 మ్యాచుల్లో గెలిచిన భారత్ విజయ పరంపరకు కూడా ఇక్కడే సౌతాఫ్రికా బ్రేక్ వేసింది.
T20 WC 2026 టైటిల్ కోసం ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ తుది పోరుకు అహ్మదాబాద్ వేదిక కావడం క్రికెట్ అభిమానులను కలవర పెడుతోంది. వన్డే వరల్డ్ కప్ 2023లో అజేయంగా రాణించిన రోహిత్ సేన ఫైనల్లో ఇక్కడే ఆసీస్ చేతిలో ఓడింది. ICC టోర్నీల్లో వరుసగా 13 మ్యాచుల్లో గెలిచిన భారత్ విజయ పరంపరకు కూడా ఇక్కడే సౌతాఫ్రికా బ్రేక్ వేసింది.
CTR: టెన్త్ పరీక్షల కోసం జిల్లాలో 129 కేంద్రాలలో అన్నీ ఏర్పాటు చేశామని DEO రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మొత్తం 23,095 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. బాలురు 12,105 మంది, బాలికలు 10,990 మంది ఉన్నారు. హాల్ టికెట్ చూపించి RTC బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. కాగా, మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి.
సత్యసాయి: కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు ఇవాళ ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ మాడ వీధుల్లో జరిగిన ఈ తిరువీధి ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
AP: శాసనమండలి ఛైర్మన్‌పై అవిశ్వాసం ఎందుకు అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అసలు సంఖ్యా బలం లేకుండా అవిశ్వాసం ఎలా పెడతారని నిలదీశారు. లడ్డూ అంశంలో తాము చెప్పాలనుకుంది సభలో చెప్పామని తెలిపారు. హెరిటేజ్, ఇందాపూర్ మధ్య సంబంధం ఉందని అన్నారు. ఇందాపూర్ ద్వారా నెయ్యి సప్లయ్ చేస్తున్నారని చెప్పారు.
SRD: కల్హేర్ మండలం మార్డి గ్రామంలోని హైస్కూల్లో విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. స్థానికంగా 6వ నుంచి టెన్త్ వరకు చదువుతున్న విద్యార్థులకు శివశక్తి ఆధ్వర్యంలో అందజేసినట్లు జిల్లా శివశక్తి ప్రధాన కార్యదర్శి శివాజీ శ్రీనివాస్ తెలిపారు. తోర్నాల్‌కు చెందిన శ్రీపాల్ సహాయంతో ప్రతి హైస్కూల్లో భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
MDK: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంచార్జ్ మంత్రి వివేక్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. సింగూరు ప్రాజెక్ట్ మరమ్మతుల వల్ల ఎక్కడా నీటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. నీటి ఎద్దడి ప్రాంతాల నివేదికలు ఇవ్వాలని, అందిన వెంటనే అదనపు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.