• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఏటీడీవో కార్యాలయాలను తక్షణమే కలెక్టరేట్‌లోకి మార్చాలి’

ఖమ్మం జిల్లాలో ఉన్న గిరిజన అభివృద్ధి శాఖ (ఏటీడీవో) కార్యాలయాలను తక్షణమే కలెక్టరేట్‌ కార్యాలయంలోకి మార్చాలని PDSU జిల్లా అధ్యక్షులు గోకినపల్లి మస్తాన్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం ఆ శాఖ డిడి విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో 30 వసతిగృహాలు ఉండగా, ఏటీడీవోలు హాస్టళ్లను సందర్శించకుండా కేవలం కార్యాలయాలకే పరిమితమవుతున్నారని వివరించారు.

February 28, 2026 / 01:33 PM IST

గిరిజన భూములపై ఆక్రమణ ఆరోపణలు

BDK: అశ్వాపురం మండలం, ఆనందపురం గ్రామంలో గిరిజనులకు చెందిన 4 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని సర్పంచ్ ముర్రం సమ్మయ్య ఆరోపించారు. భూములపై ప్రశ్నించినందుకు తమపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఉన్నతాధికారులను కలిసి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

February 28, 2026 / 01:32 PM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పట్టణ కార్యదర్శి

HNK: పరకాల మున్సిపాలిటీ 20వ వార్డుకు చెందిన జీత్ కౌర్ ఇటీవల మరణించగా నేడు వారి కుటుంబ సభ్యులను బీజేపీ పరకాల పట్టణ కార్యదర్శి పాలకుర్తి తిరుపతి పరామర్శించి బియ్యం అందజేశారు. 20వ వార్డు పరిధిలోని ప్రజలకు అనునిత్యం అండగా ఉంటూ.. వారి సమస్యల పరిష్కారమే ప్రార్థన లక్ష్యంగా పనిచేస్తానని తిరుపతి తెలిపారు

February 28, 2026 / 01:32 PM IST

రోగులకు మెరుగైన వైద్య సేవలు: MRO

VKB: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తహశీల్దార్ వెంకటేశ్ ప్రసాద్ ఆదేశించారు. శనివారం పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో మర్యాదగా నడుచుకుంటూ వైద్య సేవలు అందించాలని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా సేవలందించాలని సూచించారు.

February 28, 2026 / 01:32 PM IST

జిల్లాలో 98.11 శాతం ఇంటర్ హాజరు

కామారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్ష ముగిసింది. మొత్తం 37 పరీక్షా కేంద్రాల్లో 7,840 మంది విద్యార్థులకు గాను 7,692 మంది హాజరయ్యారు. 148 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా, జిల్లాలో సగటు హాజరు శాతం 98.11గా నమోదైందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిఘా, మౌలిక వసతులు కల్పించారు.

February 28, 2026 / 01:31 PM IST

హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీనే మా లక్ష్యం: సీఎం

AP: హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీనే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బడ్జెట్‌లో రూ.19 వేల కోట్లు ప్రజారోగ్యం కోసం ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఎరువుల వినియోగం ఎక్కువ కావడంతో ఆహారం కలుషితమవుతోందని చెప్పారు. దీని వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతోందన్నారు. చిన్న తప్పు కూడా జరగకుండా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.

February 28, 2026 / 01:31 PM IST

‘ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్తగా ఆలోచించాలి’

KNR: జిల్లా కేంద్రంలోని SRR ప్రభుత్వ కళాశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని వృక్ష శాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పడాల మాట్లాడారు. మన దేశ శాస్త్రవేత్తలను గౌరవిస్తూ, మూఢనమ్మకాలను విడిచి శాస్త్రీయ దృక్పథంతో మెలుగుదామన్నారు. “వికసిత భారత్” కల సాకారం కావాలంటే ప్రతి విద్యార్థి ఒక చిన్న శాస్త్రవేత్తగా ఆలోచించాలని అన్నారు.

February 28, 2026 / 01:30 PM IST

వాజేడు MPDO కార్యాలయ సూపర్డెంట్ మృతి

MLG: వాజేడు MPDO కార్యాలయంలో సూపర్డెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీధర ఉమారాణి (52) అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యా సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె స్వగృహంలోనే కన్నుమూశారు. ఆమె మృతి పట్ల ఎంపీడీవో, సంబంధిత అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

February 28, 2026 / 01:30 PM IST

పౌర హక్కుల దినోత్సవం.. ప్రజల వద్దకే అధికారులు

SRPT: నేరేడుచర్ల మండలం వైకుంఠాపురం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల హక్కులకు భంగం కలగకుండా చూడటమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్తుల సమస్యలను వారి వద్దకే వెళ్లి తెలుసుకుని, తక్షణ పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ భవాని, అధికారులు పాల్గొన్నారు.

February 28, 2026 / 01:30 PM IST

కాజీపేట చౌరస్తాలో brs ఆధ్వర్యంలో ధర్నా

TG: వరంగల్ జిల్లా కాజీపేటలో ‘కొలువుల కోసం కొట్లాట’ పేరిట BRS ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

February 28, 2026 / 01:28 PM IST

ఇరాన్ వదిలేయండి: చైనా పౌరులకు హెచ్చరిక

ఇరాన్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా, ఇరాన్‌లో ఉన్న తమ పౌరులు వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని, ఎవరూ కొత్తగా ప్రయాణించవద్దని హెచ్చరించింది. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా తన సైనిక బలగాల మోహరింపును పెంచింది. ఇరాన్ అణు కార్యక్రమాలను నిలిపివేయాలని అమెరికా తీవ్రంగా ఒత్తిడి చేస్తోన్న విషయం తెలిసిందే.

February 28, 2026 / 01:28 PM IST

పెన్షన్ లబ్ధిదారుల సమస్యలు తెలుసుకున్న MLA

BPT: చీరాల నియోజకవర్గవ్యాప్తంగా శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వేటపాలెం, ఈపురుపాలెం ప్రాంతాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

February 28, 2026 / 01:27 PM IST

పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన

SKLM: కోటబొమ్మాలి మండలం పట్టు పురం పంచాయతీలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు పట్టు పురం బీటి రోడ్ నుంచి మణి నాగేశ్వరపురం వరకు రూ.1 కోటితో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టుపురంలో రూ. 28 లక్షలతో రక్షిత మంచినీటి పథకం నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణమూర్తి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 01:27 PM IST

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్

NRML: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో భాగంగా భైంసా పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను శనివారం జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించే భాగంలో తనిఖీ నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ తనిఖీలలో ప్లయింగ్ స్క్వాడ్ రవీందర్,డిఓ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 01:27 PM IST

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

SRCL: చందుర్తి మండలం సనుగుల ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సందర్భంగా ఇన్ ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు గుర్రం మల్లారెడ్డి మాట్లాడుతూ .. భారతీయ భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ 1928లో కనుగొన్న రామన్ ఎఫెక్ట్‌కు గౌరవంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు.

February 28, 2026 / 01:27 PM IST