• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పేకాట కేసులో 12 మంది అరెస్ట్ ఎస్సై భగవాన్

ELR: ఉంగుటూరు మండలంలో వేరు వేరు చోట్ల పేకాట స్థావరాలపై దాడి చేశామని చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ శనివారం రాత్రి తెలిపారు. కాగుపాడు లో 8 మంది వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద రూ. 20,600లు నగదు, నాలుగు మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్న మన్నారు . నాచుగుంటలో నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకుని, రూ. 3100 నగదు, ఆరు మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు.

March 2, 2026 / 09:27 AM IST

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్‌లో పోస్టులు.. అప్లై చేశారా?

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(CELINDIA)లో 34 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. మేనేజర్, ఇంజినీర్ పోస్టులు ఉండగా.. 10, డిగ్రీ, BE/BTech, PG, MBA/PGP/PGDM ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000. SC/ST/PwBD/ESMలకు ఫీజు లేదు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.celindia.co.in

March 2, 2026 / 09:27 AM IST

పంటలు ధ్వంసం చేస్తున్న ఏనుగులు

PPM: కొమరాడ మండలం దలాయిపేట గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సోమవారం సంచరిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లోకి ప్రవేశించి వరి, అరటి, మొక్కజొన్న తదితర పంటలను ధ్వంసం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులను గ్రామాలకు దూరంగా తరలించాలని కోరుతున్నారు.

March 2, 2026 / 09:26 AM IST

ST కమిషన్ సభ్యుడి పర్యటనలో ప్రోటోకాల్ వివాదం

KMM: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ ఖమ్మం పర్యటనలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. రాజ్యాంగ పదవిలో ఉన్న తాను పర్యటనలో భాగంగా ఖమ్మం వస్తే తనను జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ రిసీవ్ చేసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని ఆయన ఓ ప్రకటనలో మీడియాకు తెలియజేశారు.

March 2, 2026 / 09:26 AM IST

సంస్కృతికి ప్రతిబింబం ఆమనగల్లు జాతర

NLG: ఆమనగల్లు గ్రామంలోని శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతర ఆనాటి సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తుందని డీఎస్పీ రాజశేఖరరాజు అన్నారు. ఆదివారం ఆయన జాతరను, క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలందరూ కులమతాలకు అతీతంగా జాతరను జరుపుకోవాలని కోరారు.

March 2, 2026 / 09:24 AM IST

నాగమల్లకుంట గ్రామంలో తాగునీటి సమస్య

NDL: బేతంచర్ల మండలంలోని నాగమల్లకుంట గ్రామంలో పైపులైన్ పగిలిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. పది రోజులుగా పైపులైన్ మరమ్మతులు చేపట్టకపోవడంతో గ్రామస్తులు తాగునీటి కోసం పంట పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పగిలిన పైపులైన్ ద్వారా నీరు వృథాగా పోతుండటంతో నీటి ఎద్దడి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 2, 2026 / 09:24 AM IST

కుశాల్ దాస్‌గుప్తకు “ప్రైడ్ ఆఫ్ కర్ణాటక” అవార్డు ప్రదానం

SS: పుట్టపర్తికి చెందిన కుశాల్ దాస్‌గుప్తకు ప్రతిష్టాత్మకమైన “ప్రైడ్ ఆఫ్ కర్ణాటక – మహాదేవపుర రత్న అవార్డు 2026” లభించింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి అరవింద్ లింబావళి చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. సామాజిక సేవ, ఫిల్మ్ మేకింగ్, వినూత్న విజువల్ డిజైన్ రంగాల్లో చేసిన కృషికి గాను ఈ అవార్డు దక్కింది.

March 2, 2026 / 09:24 AM IST

కుత్బుల్లాపూర్‌లో పెరుగుతున్న ఎండలు..!

MDCL: కుత్బుల్లాపూర్‌లో ఎండల తీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ గుర్తించింది. కుత్బుల్లాపూర్ ఆదర్శనగర్,ECC, గాయత్రి నగర్ వార్డు కార్యాలయం, మహదేవపురం ఏరియాల్లో సుమారుగా 34 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వెల్లడించింది. మార్చి చివరి నాటికీ సూర్య భగవానుడు మరింత భగభగమనే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

March 2, 2026 / 09:23 AM IST

HYD రోడ్లపై గంటకు 20KMPH దాటాట్లే.. జీవిత సమయం వృథా!

HYD నగరంలో వాహనాల సరాసరి వేగం 20KMPH దాటడం లేదని అర్బన్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ టెండ్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. వాహనాల సంఖ్య, ఇరుకైన రహదారులు, సిగ్నల్ సమన్వయం లోపం కారణాలుగా పేర్కొన్నారు. రోజూ ట్రాఫిక్‌లో గంటల తరబడి గడపాల్సి రావడంతో ప్రజల విలువైన సమయం వృథా అవుతోంది. ఇంధన వినియోగం పెరిగి కాలుష్యం తీవ్రతరం అవుతోందని పేర్కొంది.

March 2, 2026 / 09:22 AM IST

సూర్యసేనకు మాజీ క్రికెటర్ల అభినందనలు

విండీస్‌పై అద్భుత విజయంతో T20 WC సెమీస్‌కు అర్హత సాధించిన భారత్‌ను మాజీ క్రికెటర్లు అభినందించారు. ఈ విజయం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు సెమీస్ బెర్త్ ఖరారు చేసిందని, సంజూ కీలక ఇన్నింగ్స్ ఆడాడని అనీల్ కుంబ్లే పేర్కొన్నాడు. భారత్ ఒత్తిడిని హ్యాండిల్ చేస్తూ విజయం, సెమీస్‌కు అర్హత సాధించిందని.. మిషన్ ఇలాగే కొనసాగాలని VVS లక్ష్మణ్ ఆకాంక్షించాడు.

March 2, 2026 / 09:20 AM IST

పూజారి ఆత్మహత్యాయత్నం

KNR: శంకరపట్నం మండలం మొలంగూర్ పూజారి గంగాధర స్వామి ఆదివారం కుటుంబ కలహాలతో ఇంట్లో పురుగు మందు తాగాడు. కుటుంబసభ్యులు 108కి సమాచారం అందించడంతో ఈఎంటీ సతీష్ రెడ్డి ప్రథమ చికిత్స అందిస్తూ హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జమ్మికుంట ప్రైవేట్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

March 2, 2026 / 09:18 AM IST

గ్రహణం ఎఫేక్ట్.. ఆలయం మూసివేత..!

JGL: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల 3న (మంగళవారం) బీర్పూర్ శ్రీలక్ష్మీ నరసింహాస్వామి వారి ఆలయం మూసివేస్తున్నట్టు కార్య నిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 9 గం.లకు మూసివేసి సంప్రోక్షణ అనంతరం బుధవారం ఉదయం స్వామివారికి అభిషేకం తరువాత భక్తులకు దర్శనం కల్పిస్తామని, భక్తులు గమనించగలరని ఈఓ అన్నారు.

March 2, 2026 / 09:17 AM IST

తెనాలిలో ‘కార్డెన్ సెర్చ్ నిర్వహణ

GNTR: తెనాలి త్రీ టౌన్ పీఎస్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు భారీ తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ జనార్ధనరావు పర్యవేక్షణలో సీఐలు, ఎస్సైలు, సిబ్బంది 5 గంటల నుంచే కాలనీని చుట్టుముట్టి ప్రతి ఇంటిని సోదా చేశారు. అనుమానిత వ్యక్తులను విచారించి వారి వివరాలను సేకరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.

March 2, 2026 / 09:16 AM IST

ఈ నెల 4న ప్రారంభంకానున్న ముసలమ్మ జాతర

MHBD: కొత్తగూడ మండలంలోని గుంజేడు అడవుల్లో శ్రీ గుంజేడు ముసలమ్మ తల్లి జాతర ఈ నెల 4 నుంచి వైభవంగా ప్రారంభం కానుంది. పచ్చని అడవుల మధ్య వెలసిన ఈ వనదేవత ఆలయం గిరిజన సంస్కృతికి నిలువెత్తు చిహ్నం. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

March 2, 2026 / 09:15 AM IST

అద్భుతంగా ఆడారు: సచిన్

విండీస్‌పై కీలక పోరులో భారత ప్లేయర్లు అద్భుతంగా ఆడారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. దీంతో భారత్ సైమీస్‌కు అర్హత సాధించిందని, క్రీజులో సంజూ శాంసన్ పాతుకుపోయి ఆడుతుంటే చూడటానికి బాగుందని పేర్కొన్నాడు. అలాంటి ఇన్నింగ్స్‌లే మ్యాచ్ ఫలితాన్ని మారుస్తాయని చెప్పుకొచ్చాడు.

March 2, 2026 / 09:14 AM IST