TG: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నాగర్‌కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న ఘటనపై ఓ సామాజిక కార్యకర్త జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం చేయాలని మర్రిగూడ మండలం కమ్మగూడెం గ్రామానికి చెందిన వినోద్ హిందుస్థానీ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్వాహకుల కుల దురహంకారం వల్లే జాతరలో ఈ విషాదం చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు.
SKLM: పలాస మండలం మహాదేవిపురంలో ఆదివారం ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్‌పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి మహిళ తమ సెల్‌ఫోన్‌లో నారి శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు.
AP: ఎంత కష్టపడితే అంత సంపాదించుకునే అవకాశం జీడీఎస్‌లో ఉందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మార్పును అందిపుచ్చుకోలేని ఏ సంస్థా మనుగడ సాధించలేదన్నారు. పార్సిల్, ఈ కామర్స్ విభాగంలో తపాలాశాఖ పోటీపడాలని ఆకాంక్షించారు.
HYD: కూకట్‌పల్లి మూసాపేట్ డివిజన్‌కు చెందిన కర్కనాగరాజుకు అత్యంత ప్రతిష్టాత్మికమైన వరల్డ్ అచివర్స్ అవార్డ్స్ 2026కు ఇటీవలే ఎంపికయారు. ఆదివారం న్యూఢిల్లీ జనక్ పూరి హోటల్ హయత్ సెంట్రిక్‌లో జరిగిన కార్యక్రమంలో భారత మాజీ క్రికెట్ ప్లేయర్ చేతన్ శర్మ చేతుల మీదుగా అవార్డ్‌ను అందుకున్నారు. సోషల్ సర్వీస్, ట్రేడ్ యూనియన్ లీడర్షిప్ కేటగియరీలో ఆయన ఎంపికయ్యారు.
MDCL: కీసర(మం) దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని బండ్లగూడ ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి ఆధ్వర్యంలో ఆదివారం సాంబశివరెడ్డితో పాటు ఆయన అనుచరులు, పలువురు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి ఘనస్వాగతం పలికారు. జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువత ముందుకు రావాలన్నారు.
కాశినాయన మండలం గంగనపల్లెకు చెందిన దిలీప్(24) అనే వ్యక్తిపై దుండగులు ఆదివారం పెట్రోల్ పోసి నిప్పంటించారు.గాయపడిన యువకుడిని స్థానికులు పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
RR: యూత్ కాలనీలో నిర్వహించిన ‘దవాత్-ఏ-ఇఫ్తార్’ కార్యక్రమంలో పీఏసీ ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి విందు ఆరగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ క్రమశిక్షణకు, మత సామరస్యానికి ప్రతీక అని, తెలంగాణలో “గంగా జమునా తెహజీబ్” సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
NLG: హుజూర్‌నగర్ మున్సిపాలిటీ 21వ వార్డులో చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. డ్రైనేజ్, వీధి దీపాలు, శానిటేషన్, వాటర్ సప్లై సమస్యలను పరిశీలించి ప్రజల అభ్యర్థనలు నమోదు చేశారు. అభివృద్ధి పనులు చేపడతామని, మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
BHNG: ఆలేరులో SFI మండల కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి రాజు మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకే ఈ పోటీలని తెలిపారు. పదో తరగతి విద్యార్థులు మానసిక ఒత్తిడి లేకుండా వార్షిక పరీక్షలు రాయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో UTF నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
MBNR: ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావంతో వెంకటాయపల్లి స్వతంత్ర సర్పంచ్ రామాంజనేయులు, ఉపసర్పంచ్ పింజరి మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి కండువా కప్పి వారిని ఆహ్వానించారు. అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని.. అందుకే ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ విఫలమైన అతడు.. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ సూర్య(10), వాషింగ్టన్ సుందర్(2) క్రీజులో ఉన్నారు.
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ విఫలమైన అతడు.. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ సూర్య(10), వాషింగ్టన్ సుందర్(2) క్రీజులో ఉన్నారు.
పడుకునే ముందు పుస్తకం చదివే అలవాటు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజంతా పడ్డ అలసటను, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది ఒక చక్కని మార్గం. మొబైల్ స్క్రీన్లకు దూరంగా ఉండి పుస్తకం చదవడం వల్ల మెదడు ప్రశాంతంగా మారుతుంది, తద్వారా నిద్ర నాణ్యత పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెంపొందించుకోవడానికి, సృజనాత్మకతను మెరుగుపరుచుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.
MDK: నిజాంపేట మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో రేపు జరిగే ప్రజావాణి కార్యక్రమానికి హాజరు అవుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. నిజాంపేట మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యక్షంగా హాజరుకానున్నారు. నేరుగా ప్రజల పిర్యాదులు స్వీకరించనున్నారు.
TG: రాష్ట్రంలో 2034 వరకు ప్రజలు కాంగ్రెస్‌నే ఆదరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఆరోగ్యం కాపాడుకోవాలన్న రేవంత్.. ఉదయం వాకింగ్, సాయంత్రం వ్యాయామం చేయాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలు ఇంకో పదేండ్లు ఆరోగ్యంగా ఉండాలి.. అందుకు పుస్తకాలు చదవాలి, ప్రవచనాలు వినాలని చెప్పారు.