• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ముగిసిన వక్త పోటీలు

VZM: విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడమే ముఖ్య లక్ష్యంగా వక్త పోటీలను నిర్వహించినట్లు జనవిజ్ఞాన వేదిక జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎరుకొండ ఆనంద్, మిరియాల కృష్ణారావు తెలిపారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వక్త పోటీలను బుధవారం గురజాడ పాఠశాలలో నిర్వహించారు. అనంతరం విజేతలకు నగదు బహుమతి అందజేశారు.

February 25, 2026 / 06:17 PM IST

26 నుంచి విశాఖలో గవర్నర్ పర్యటన

VSP: ఒడిశా గవర్నర్ హరిబాబు 26 నుంచి మార్చి 5 వరకు విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఫిబ్రవరి 26న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్లో పుస్తకావిష్కరణ, అనంతరం నోవోటెల్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు. 27న బాలాజీ హైఫీల్డ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సంలో పాల్గొననున్నారు.

February 25, 2026 / 06:16 PM IST

నిర్లక్ష్యం కాటేసింది.. ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతి

SRPT: యజమాని నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వల్లభాపురం శివారులోని ఇటుక బట్టీలో మట్టి తొక్కుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్ పల్లపు రాజు(40) అక్కడికక్కడే మృతి చెందాడు. కండిషన్ లేని వాహనాన్ని నడపాలని యజమాని చల్లా నాగరాజు ఒత్తిడి చేయడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. ఈరోజు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

February 25, 2026 / 06:16 PM IST

ఆర్టీసీ కానిస్టేబుల్ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్

PLD: నాదెండ్ల(M) ఇర్లపాడుకు చెందిన మంజుభార్గవి ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా ఆర్టీసీ కానిస్టేబుల్ మేకల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సుబ్బనాయుడు పర్యవేక్షణలో నాదెండ్ల ఎస్ఐ ఈ కేసు దర్యాప్తు చేశారు. సోమవారం అదుపులోకి తీసుకున్న నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో బుధవారం పోలీసులు జైలుకు తరలించారు.

February 25, 2026 / 06:15 PM IST

SL vs NZ: మ్యాచ్‌కు వర్షం ముప్పు

కొలంబో వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని ఆక్యూవెదర్ పేర్కొంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దయితే, ఇరు జట్లు పాయింట్లను పంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు 2 మ్యాచ్‌ల్లో 2 పాయింట్లతో NZ.. 2 మ్యాచ్‌ల్లో ఒక పాయింట్‌తో SL, PAK ఉంటాయి. దీంతో సెమీస్ చేరాలంటే చివరి మ్యాచ్ గెలవడం వీటికి కీలకం కానుంది.

February 25, 2026 / 06:15 PM IST

పునర్విక చికిత్సకు రూ.50 లక్షలు: MP

NDL: వెల్దుర్తికి చెందిన చిన్నారి పునర్విక చికిత్స కోసం కేంద్ర ఆరోగ్యశాఖ రూ.50 లక్షల సాయం చేసిందని MP శబరి ఇవాళ తెలిపారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి సమస్యను తండ్రి తనదృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా NPRD పథకం నుంచి నిధులు విడుదలయ్యాయని అన్నారు. సహకరించిన కేంద్ర మంత్రి JP నడ్డాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

February 25, 2026 / 06:14 PM IST

పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై విచారణ వాయిదా

TG: కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నివేదికను రద్దు చేయాలంటూ కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్‌కే జోషి గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

February 25, 2026 / 06:13 PM IST

మంత్రితో దెందులూరు ఎమ్మెల్యే భేటీ

ELR: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని విజయవాడలోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు రైతాంగ, కోకో పంటల రైతుల అంశాలపై మంత్రితో చర్చించారు. ఈ కార్యక్రమంలో పెదపాడు మండల టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్ గుత్తా అనిల్ పాల్గొన్నారు.

February 25, 2026 / 06:13 PM IST

కంచికచర్ల మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

NTR: నందిగామలోని కంచికచర్ల మార్కెట్ యార్డ్‌లో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ ఛైర్మన్ కోగంటి బాబు బుధవారం ప్రారంభించారు. వీరులపాడు, కంచికచర్ల మండలాల్లో రైతులు అధికంగా శనగలు సాగు చేసినందున నష్టపోకుండా ఉండేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వ ఉద్దేశం రైతులకు మద్దతుగా నిలబడమే అని ఆయన అన్నారు.

February 25, 2026 / 06:12 PM IST

పట్రపల్లిలో అగ్ని ప్రమాదం.. రూ.1.5 లక్షల నష్టం

అన్నమయ్య: పుంగనూరు(మం) పట్రపల్లిలో నెల్లి, అల్లనేరేడు తోటలో అగ్ని ప్రమాదం జరిగింది. డ్రిప్ పైపులు, కేబులు దగ్ధమవగా సుమారు రూ.1.5 లక్షల నష్టం జరిగినట్లు పోలీసుల అంచనా. ధూమపానం ముక్కల వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు తెలిపారు. పుంగనూరు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. తోటకు సమీపంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో అప్రమత్తం చేశారు.

February 25, 2026 / 06:10 PM IST

మార్చి 8న గురుకుల విద్యాలయ ప్రవేశ పరీక్ష

SKLM: జిల్లా పరిధిలో మార్చి 2న జరగాల్సిన డాక్టర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయ ప్రవేశ పరీక్ష మార్చి 8కి వాయిదా పడిందని నందిగాం బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ బెలమర మంజుల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026-28 విద్యా సంవత్సరానికి 6, 7 ,8 ,9 10 తరగతుల విద్యార్థులకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. వివరాలకు 9177788124 సంప్రదించాలన్నారు

February 25, 2026 / 06:10 PM IST

‘అణిచివేత ఉన్నంత వరకు విప్లవంఉంటుంది’

KNR: పీఎం నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికార అహంకారంతో మావోయిస్టులను అంతం చేస్తామని హెచ్చరికలు చేయడం సరికాదని CPI సీనియర్ నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోయిస్టు సిద్ధాంతాన్ని అంతం చేయడం సాధ్యం కాదని ఆకలి, అణిచివేత ఉన్నంత వరకు విప్లవం ఉంటుందని పేర్కొన్నారు.

February 25, 2026 / 06:10 PM IST

పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశం

కర్నూలు: జిల్లా పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా పని చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాపర్టీ కేసులలో పోలీసులు బాగా పని చేయాలని సూచించారు.

February 25, 2026 / 06:09 PM IST

అనంతపురంలో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయండి: ఎమ్మెల్యే

ATP: అనంతపురం నగర పరిసరాల్లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేసి యువత, మహిళలకు ఉపాధి కల్పించాలని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అసెంబ్లీలో కోరారు. బుధవారం సభలో ఆయన మాట్లాడుతూ.. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు పెరగాలన్నారు. తక్కువ వేతనాలతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ పార్క్ ఎంతో దోహదపడుతుందని వివరించారు.

February 25, 2026 / 06:09 PM IST

నాగిరెడ్డిపేట ఏపీఎంగా వెంకటలక్ష్మీ బాధ్యతల స్వీకరణ

కామారెడ్డి జిల్లాలోనీ నాగిరెడ్డిపేట మండల సమాఖ్య ఏపీఎంగా వెంకటలక్ష్మీ బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. ఆమె రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేసి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎల్లారెడ్డి ఏపీఎం రామ్ నారాయణ గౌడ్ ఇన్‌ఛార్జ్‌గా పని చేశారు. మహిళా సంఘాల అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని వెంకటలక్ష్మీ తెలిపారు.

February 25, 2026 / 06:08 PM IST