W.G: నరసాపురం డీఎస్పీ శ్రీవేదను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 2018 బ్యాచ్‌కు చెందిన 25 మంది డీఎస్పీలను పోలీస్ కార్యాలయంకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ భారీ బదిలీల జాబితాలో నరసాపురం డీఎస్పీ శ్రీవేద పేరు కూడా ఉంది. డీఎస్పీగా శ్రీవేద అనేక సవాళ్లతో కూడిన కేసులను ఛేదించారు.