• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బషీరాబాద్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం

NZB: కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్‌లో GP ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి వైద్యుడు డాక్టర్ టి.శ్రీనివాస్ 95 మందికి కంటి పరీక్ష చేశారు. వారిలో 17 మంది బాధితులకు కంటి ఆపరేషన్లు అవసరం ఉందని గుర్తించారు. నేత్ర పరీక్షలపై నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలని సర్పంచ్ బైకని జమున మహేశ్, ఉప సర్పంచ్ భూమేశ్ సూచించారు.

February 27, 2026 / 04:02 PM IST

మార్చి 5న భట్టి కుమారుడి పెళ్లి

TG: మార్చి 5న HYDలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్యవిక్రమాదిత్య వివాహం జరగనుంది. తన కుమారుడి వివాహానికి రావాలని ఇప్పటికే  భట్టి విక్రమార్క.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో సహా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు. ఈ క్రమంలో ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబును కలిసి ఆహ్వానపత్రికను అందించారు.

February 27, 2026 / 04:00 PM IST

‘మధ్యాహ్నం భోజనం లో మెనూ సక్రమంగా అమలు చేయాలి’

VZM: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్నం భోజనంలో మెనూ సక్రమంగా అమలు చేయాలని వేపాడ ఎంఈవో ఎన్ నాగభూషణరావు కోరారు. శుక్రవారం ఆయన చామలాపల్లి అగ్రహారం ఎంపీపీ పాఠశాలను వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. టీచర్స్ హ్యాండ్ బుక్, రికార్డులను తనిఖీ చేశారు. తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థులు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

February 27, 2026 / 04:00 PM IST

కనక దుర్గమ్మ సేవలో ఎమ్మెల్యే ఈశ్వరరావు

SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రి పై కొలువున్న శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

February 27, 2026 / 04:00 PM IST

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్కు 15 వినతులు

VSP: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరము 15 వినతులు వచ్చినట్టు జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకారరావు తెలిపారు. మధురవాడ జోన్‌కు 1, ఈస్ట్ జోన్ 5, సౌత్ జోన్ 2, నార్త్ జోన్ 4, పెందుర్తి జోన్ 3 వినతులు వచ్చాయి. వినతులను నిర్ణీత సమయంలో టౌన్ ప్లానింగు అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు.

February 27, 2026 / 04:00 PM IST

మిరియాలతో ఆరోగ్యం..!

మిరియాలు శ్వాసకోశ సంబంధిత సమస్యలకు అత్యుత్తమ మందు. మిరియాల పొడిని నెయ్యితో లేదా తేనెతో తీసుకుంటే మొండి దగ్గు, గొంతులో పేరుకుపోయిన కఫం కరిగిపోతాయి. ఇందులో ఉండే ‘పైపెరిన్’ అనే పదార్థం మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించేలా చేస్తుంది. మిరియాలు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. తలనొప్పి ఉన్నప్పుడు మిరియాల కషాయం తాగితే ఉపశమనం లభిస్తుంది.

February 27, 2026 / 04:00 PM IST

‘బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు’

ప్రకాశం: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని మార్కాపురం సీఐ సుబ్బారావు హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలో మద్యం సీసాలను స్థానిక ప్రజలతో కలిసి తొలగించారు. అలాగే జేసీబీతో పిచ్చికంప, పరిసరాలను శుభ్రం చేయించారు. పబ్లిక్ ఏరియాలో మద్యం సేవించడం వల్ల శాంతి భద్రతలకు ఆటంకం ఏర్పడుతుందని, అటువంటి పనులకు దూరంగా ఉండాలన్నారు.

February 27, 2026 / 03:57 PM IST

నేను ఆరోగ్యంగానే ఉన్నా: మాజీమంత్రి బొత్స

AP: తాను ఆరోగ్యంగానే ఉన్నానని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తన ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదన్న బొత్స.. రొటీన్ చెకప్‌లో భాగంగా ఆస్పత్రికి వచ్చినట్లు చెప్పారు. కాగా, బొత్స అస్వస్థకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఆయన స్పందించారు.

February 27, 2026 / 03:56 PM IST

శ్రమించినా దక్కని ఫలితం

ASF: పురిటి నొప్పులతో తీవ్రంగా బాధపడిన ఆవుకు 2 గంటలపైగా శ్రమించి పశు వైద్యులు మురళి ప్రసవం చేశారు. ఆసిఫాబాద్ మండలం మాణిక్ గుడాకి చెందిన రైతు కన్నెరాం ఆవు శుక్రవారం పురిటి నొప్పులతో బాధపడింది. పరిస్థితిని గమనించిన ఉప సర్పంచ్ అజయ్ పశువైద్య సిబ్బందికి సమాచారం అందించారు. 2 గంటలపైగా శ్రమించి దూడను వైద్యులు బయటకు తీయగా దూడ మృతి చెందిందని తెలిపారు.

February 27, 2026 / 03:55 PM IST

పంచాయతీ భవనాల నిర్మాణానికి భూమి పూజ

KMR: మహమ్మద్ నగర్ మండలం తెల్గాపూర్, హాసన్‌పల్లి గ్రామాల్లో శుక్రవారం గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. గాలిపూర్‌లో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.52 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

February 27, 2026 / 03:55 PM IST

జాతీయ రహదారిపై వాహనం బోల్తా

SDPT: నంగునూరు(మం) రాంపూర్ వద్ద సిద్దిపేట-వరంగల్ జాతీయ రహదారిపై శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. సిద్దిపేట నుంచి వరంగల్ వెళ్తున్న వాహనం ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. జనరేటర్ లోడుతో ఉన్న ఈ వాహన బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు.

February 27, 2026 / 03:53 PM IST

భారత్‌తో వన్డే సిరీస్ ఆస్ట్రేలియా కైవసం

ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 251 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 36.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ ప్లేయర్ జార్జియా వోల్ (101) సెంచరీతో అదరగొట్టగా, లిచ్‌ఫీల్డ్ (80) పరుగులతో రాణించింది. వరుసగా 2 విజయాలతో ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

February 27, 2026 / 03:53 PM IST

హాలీవుడ్ మూవీకి నో చెప్పిన దీపికా..?

స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఒక హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశాన్ని వదులుకున్నట్లు తెలుస్తోంది. ‘ది వైట్ లోటస్’ సీజన్-4లో కీలక పాత్రలో నటించే ఛాన్స్‌ను దీపిక వద్దనుకున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఆమె ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీపిక గతంలో ‘xXx: రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించింది.

February 27, 2026 / 03:53 PM IST

గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదేశాల మేరకు శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పలు శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది అర్జీలు స్వీకరించి వివరాలు నమోదు చేశారు.

February 27, 2026 / 03:52 PM IST

అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల తనిఖీ

KMR: రాజంపేట మండలం అరగొండలో ఎంపీడీవో బాలకృష్ణ అంగన్వాడీ కేంద్రంలోని మౌలిక వసతులు, ప్రైమరీ స్కూల్, ఉపాధి హామీ పనులను, ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం పరిశీలించారు. తనిఖీ చేసి అక్కడ స్టాక్ రిజిస్టర్లు, పిల్లలు, గర్భిణులు, బాలింతలు తినే మధ్యాహ్న భోజనాలను రుచి చూశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విక్రాంత్ రెడ్డి, ఉపసర్పంచ్ తుల రవి, ఏపీవో శృతి పాల్గొన్నారు.

February 27, 2026 / 03:52 PM IST