GDWL: ఎర్రవల్లి మండలం యాక్తాపురం గ్రామంలో ఆదివారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పచ్చర్ల కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. లబ్ధిదారుడు ప్రత్యేకంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటేష్, పాల్గొన్నారు.
MBNR: హన్వాడ మండలం దొర్రితండా పాఠశాల 5వ తరగతి విద్యార్థి నిదీష్, ఏపీలోని ప్రతిష్ఠాత్మక కొరుకొండ సైనిక్ పాఠశాలకు ఎంపికయ్యాడు. ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి సీటు సాధించిన నిదీష్ విజయాన్ని గ్రామస్థులు, ఉపాధ్యాయులు హర్షంతో స్వాగతించారు. ఆయన విజయం తండాలోని ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు.
HNK: పట్టణ కేంద్రంలోని కుమార్ పల్లి మార్కెట్లో ఆదివారం సంచార ఆహార కల్తీ ప్రయోగశాల ఆధ్వర్యంలో పాలలో కల్తీ పై ‘టేస్ట్ చెక్’ నిర్వహించారు. పాల ప్యాకెట్ల పై వెన్న శాతం 6.0గా చూపిస్తున్నప్పటికీ వాస్తవంలో 5.5 శాతమే ఉండటం గమనించారు. నిల్వ కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నారని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బ్రహ్మాజీ ప్రజలకు వివరించారు.
సత్యసాయి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకుంటే ఉద్యమాలు చేస్తామని వైసీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉషశ్రీ చరణ్ హెచ్చరించారు. ఆదివారం కడపలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సీమకు నీళ్లు రాకుండా సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తికాకపోతే ప్రాంతం ఎడారిగా మారుతుందని తెలిపారు.
KNR: గన్నేరువరం మండలం పరిధిలోని పీచుపల్లి గ్రామ అభివృద్ధి కోసం రూ. 10 లక్షల నిధులను చెక్ రూపంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సర్పంచ్ రాజిరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కొండాపూర్ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, బీజేపీ మండల అధ్యక్షుడు నికేష్, మానస దేవి గుడి ఛైర్మన్ చంద్రారెడ్డి, కొంకటి గణేష్, దళిత నాయకులు, మండల, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ప్రకాశం: అర్ధవీడు మండలం మొహిద్దిన్ పురం గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. బండారు శివకుమారి అనే మహిళ మొక్కజొన్న తోటలోకి గడ్డి కోసం వెళ్లిన క్రమంలో అడవి పంది దాడి చేసింది. ఈ దాడిలో ఆ మహిళలకు తీవ్ర గాయాలు కాగా 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం గిద్దలూరు ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించారు.
GNTR: గుంటూరు నగరపాలక సంస్థ (GMC) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కమిషనర్ కె. మయూర్ అశోక్ ఓప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. నగర వాసులు తమ సమస్యలపై అర్జీలు సమర్పించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా వనపర్తికి చెందిన ముకుంద నాయుడు నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ చేతుల మీదుగా నియామక పత్రం ఇవాళ అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. బీసీ వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని, తనపై నమ్మకం ఉంచిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ రూపొందింది. మార్చి 26, 2026న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నార్త్ అమెరికా హక్కులను ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ దక్కించున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. అక్కడ మార్చి 25న ప్రీమియర్లు ప్రదర్శించనున్నట్లు వెల్లడిస్తూ పోస్టర్ షేర్ చేశారు.
NDL: గోసానిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతున్న లారీ డ్రైవర్ వడ్డె సురేష్‌ను డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి శివరాం ఇవాళ పరామర్శించారు. సురేష్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు.
SDPT: కోహెడ మండలం విజయనగర్ కాలనీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. బీజెపీ మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ సాదుల అమూల్యకు ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షల గ్రాంట్ అందజేశారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర నిధులు వినియోగిస్తామని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో విద్యార్థులకు సైకిళ్లు, బోర్లు వంటి పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు.
W.G: చంద్రగ్రహణం పురస్కరించుకుని భీమవరం గునుపూడిలోని శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారి ఆలయాన్ని ఈ నెల 3వ తేదీన మూసివేయనున్నట్లు అర్చకులు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ద్వారాలు మూసివేస్తారు. తిరిగి 4వ తేదీ (బుధవారం) ఉదయం 7 గంటలకు ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనాలు కల్పిస్తామని వివరించారు.
NRPT: నర్వ మండల కేంద్రంలోని ఓ స్కూల్ విద్యార్థులు “Save Nature, Secure Future” నినాదంతో భారీ సైకిల్ యాత్ర నిర్వహించారు. ప్రకృతిని కాపాడుకోవడమే మానవజాతి మనుగడకు మూలమని చాటిచెబుతూ.. యాత్ర పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేలా సాగింది. నర్వ నుంచి యాంకీ, పెద్దకడుముర్, గట్టు మీదుగా చంద్రగట్టు వరకు 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
W.G: భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లకు సీఐ నాగరాజు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. వారి ప్రస్తుత జీవన విధానం, వృత్తుల గురించి ఆరా తీశారు. గత నేర ప్రవృత్తిని వీడి, సత్ప్రవర్తనతో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని ఆయన హితవు పలికారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
W.G: 86 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన భీమవరం టౌన్ హాల్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కుని అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. ఆదివారం గొల్లవానితిప్ప రోడ్డులోని టౌన్ హాల్ నూతన ప్రాంగణంలో నిర్వహించిన 86వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్లబ్బులు పదిమందికి ఉపయోగపడేలా, సేవా దృక్పథంతో ఉండాలని అన్నారు.