• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మాదిగ అమర వీరులకు నివాళులు

MDK: చేగుంటలో MRPS మండల అద్యక్షుడు కొలుపుల రామస్వామి మాదిగ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధన కోసం ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాల పాటు కొనసాగిన సామాజిక ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన దండోరా ముద్దుబిడ్డల త్యాగంతో వర్గీకరణ సాధించుకున్నామని చాటుదామన్నారు.

March 1, 2026 / 02:26 PM IST

“ఆదివాసి మహిళా రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి”

MHBD: ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుడుం దెబ్బ, ఆదివాసి మహిళా సంఘం ఆధ్వర్యంలో “ఆదివాసి మహిళ రాష్ట్ర” సదస్సును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాని విజయవంతం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాము పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడ మండల కేంద్రంలో తుడుం దెబ్బ నాయకులతో కలిసి  సదస్సు కరపత్రాలను, పోస్టర్లను ఆవిష్కరించారు.

March 1, 2026 / 02:24 PM IST

ఈ నెల 3న మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం మూసివేత

W.G: ఈ నెల 3వ తేదీన కేతుగ్రస్త చంద్ర గ్రహణం సందర్భంగా మావుళ్లమ్మ ఆలయాన్ని మూసివేసి, 4వ తేదీన తెరుస్తామని ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ తెలిపారు. 3వ తేదీ పౌర్ణమి జరిగే చండీ హోమం ఉదయం 6 గంటలకు మొదలై 9 గంటలకు ముగుస్తుందని అన్నారు. మూడో తేదీ ఉదయం 9 గంటలకు ఆలయం మూసి, 4వ తేదీ ఉదయం 8 గంటలకు అమ్మవారి మూలవిరాట్ దర్శనానికి అనుమతిస్తామని ఆయన పేర్కొన్నారు.

March 1, 2026 / 02:24 PM IST

కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన సంపత్

HNK: పరకాల మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొచ్చు మహేందర్ మాతృమూర్తి బొచ్చు ఐలమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు మడికొండ సంపత్ కుమార్ మృతురాలి ఇంటికి వెళ్లి.. ఆమె పార్దివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

March 1, 2026 / 02:23 PM IST

ప్రమాద బీమా చెక్కులు అందజేసిన మంత్రి

NDL: ప్రమాదవశాత్తు మరణించిన ఇద్దరు పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా కింద రూ.5 లక్షల చొప్పున చెక్కులను రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఇవాళ అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

March 1, 2026 / 02:22 PM IST

బొమ్మరెడ్డి గూడెంలో శ్రమదానం

SRD: చౌటకూర్ మండలం బొమ్మరెడ్డి గూడెంలో సర్పంచి జైపాల్ నాయక్ ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమంలో ఆదివారం నిర్వహించారు. ముంబాయ్ ఇన్ కామ్ టాక్స్ జాయింట్ డైరెక్టర్ సుధాకర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామస్థులతో కలిసి శ్రమదానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. శ్రమదానం వల్ల గ్రామాలు శుభ్రంగా ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

March 1, 2026 / 02:22 PM IST

‘సర్పంచులు అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలి’

MLG: వాజేడు, వెంకటాపురం మండలాల్లో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులను ఆదివారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సర్పంచులు గ్రామ అభివృద్ధి పనుల పై దృష్టి పెట్టి వేగంగా అభివృద్ధి చేయాలని, ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. 

March 1, 2026 / 02:22 PM IST

నెల్లూరు నగర అభివృద్ధికి కృషి చేయాలి: ఆనం

NLR: నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఆదివారం నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన మేయర్ సుజాతను అభినందిస్తూ, నెల్లూరు నగర అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు.

March 1, 2026 / 02:20 PM IST

మల్లె పువ్వులాంటి చిరంజీవి దోశ: రాధికా

వరలక్ష్మీ శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ‘సరస్వతి’ మూవీ మార్చి 6న విడుదల కానుంది. HYDలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాధికా శరత్‌కుమార్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లినప్పుడు ఆయన స్వయంగా వేసి పెట్టిన ‘చిరంజీవి దోశ’ గురించి ఆమె గుర్తు చేసుకుంది. ఆ దోశ మల్లెపువ్వులా మెత్తగా ఉందని, అలాంటి రుచిని తానెక్కడా చూడలేదని తెలిపింది.

March 1, 2026 / 02:20 PM IST

మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

WGL: రాయపర్తి మండలం కేంద్రంలో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్సీ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి ఐతరాజ్ మాదిగ మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారికి ఘనంగా నివాళులర్పించామని పేర్కొన్నారు. మార్చి 1న అమరవీరులను స్మరించుకోవడం జరుగుతోందన్నారు.

March 1, 2026 / 02:19 PM IST

పది విద్యార్థులకు ‘విజయీభవ’: హరీశ్ రావు

SDPT: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఇందిరా నగర్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ‘విజయీభవ’ ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవిత గతిని మార్చేది పదో తరగతేనని, మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఐప్యాడ్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. విద్యార్థులు పట్టుదలతో చదివి తల్లిదండ్రుల కలలు నిజం చేయాలని ఆయన దీవించారు.

March 1, 2026 / 02:19 PM IST

ఈనెల 3న అన్ని ఆలయాలు మూసివేత

RR: ఈనెల 3వ తేదీన చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో 4వ తేదీన హోలీ పండుగ జరుపుకోవాలని షాద్‌నగర్ పండితులు రవి శర్మ తెలిపారు. అదేవిధంగా 3న చంద్రగ్రహణం నేపథ్యంలో షాద్‌నగర్ నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలు మూసివేయడం జరుగుతుందని, 3న మధ్యాహ్నం 3:20 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6:47 నిమిషాల వరకు గ్రహణం ఉంటుందని వారు పేర్కొన్నారు.

March 1, 2026 / 02:18 PM IST

YSR కాలనీలో రోడ్డు పనులకు భూమిపూజ

కడప 2వ డివిజన్ వైఎస్సార్ కాలనీలో ఆదివారం నూతన రోడ్డు పనులకు ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి భూమిపూజ చేశారు. నగరంలో నాణ్యమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ కల్పనే తమ లక్ష్యమని వారు తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పనులను త్వరగా, నాణ్యంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

March 1, 2026 / 02:18 PM IST

పోలమాంబ ఆలయం మూసివేత

PPM: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి ఆలయాన్ని చంద్ర గ్రహణం సందర్బంగా మూసివేస్తున్నట్లు ఈవో శ్రీనివాస్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 6గంటలకు నిత్య పూజల్లో భాగంగా అమ్మవారికి భోగం నివేదించి, ఆలయం తలుపులు మూసి వేయడం జరుగుతుందన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. బుధవారం ఉదయం పోలమాంబ అమ్మవారి దర్శనం పునః ప్రారంభం జరుగుతుందన్నారు.

March 1, 2026 / 02:18 PM IST

విద్యార్థులకు ఐప్యాడ్ గిఫ్ట్ ఇస్తా: మాజీ మంత్రి

TG: సిద్ధిపేట అన్నింట్లో ఆదర్శంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ‘పదో తరగతి ఫలితాల్లో ఫస్ట్ రావలన్నదే నా తపన. మంచి మార్కులు సాధిస్తే ఐ ప్యాడ్ గిఫ్ట్‌గా ఇస్తా. రాష్ట్రమంతా వస్తున్న బాసర ట్రిపుల్ ఐటీ సీట్లు ఒక ఎత్తు.. మన సిద్దిపేట స్టూడెంట్స్‌కు వస్తున్న సీట్లు ఒకెత్తు. సొంత ఖర్చులతో ప్రత్యేక తరగతులకు స్నాక్స్ ఏర్పాటు చేయించాను’ అని పేర్కొన్నారు.

March 1, 2026 / 02:17 PM IST