• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇంటర్ ఇంగ్లీష్ పరీక్షకు 385 మంది గైర్హాజరు

ఏలూరు జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. గురువారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 15,972 హాజరయ్యారని చెప్పారు. 385 మంది వివిధ కారణాలతో గైర్హాజరు అయ్యారని వివరించారు. జనరల్ విద్యార్థులు 14,128, ఒకేషనల్ విద్యార్థులు 1,844 మంది పరీక్ష రాశారని వెల్లడించారు.

February 26, 2026 / 04:05 PM IST

గోదావరి పుష్కరాలకు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

JGL: గోదావరి మహా పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. 2027 సంవత్సరంలో జూన్ 26-జూలై 7వరకు జరిగే పుష్కరాల దృష్ట్యా ఘాట్ నిర్మాణం, రోడ్లు, లైటింగ్, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లు, ఆలయాల అభివృద్ధిపై ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.

February 26, 2026 / 04:05 PM IST

పనులు పూర్తి చేసి త్రాగునీరు అందించాలి: ఛైర్మన్

MNCL: బెల్లంపల్లి పట్టణంలో జరుగుతున్న గోదావరి పైప్ లైన్ పనులను మున్సిపల్ ఛైర్మన్ దావా స్వాతి-రమేష్ బాబు గురువారం పరిశీలించారు. వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు సమస్య తలెత్తకుండా పైప్ లైన్ పనులు తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు తొందరగా పూర్తి చేసి ప్రజలకు త్రాగునీరు అందించాలని సూచించారు.

February 26, 2026 / 04:05 PM IST

ఇంటర్ పరీక్షలో 98% హాజరు నమోదు

PDPL: జిల్లా వ్యాప్తంగా ఇవాళ జరిగిన ఇంటర్ రెండో సంవత్సరం తెలుగు/ ఉర్దూ/ హిందీ పరీక్షలో 98% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి కల్పన తెలిపారు. మొత్తం 4815 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా 4731 మంది హాజరయ్యారని, 74 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. అన్ని కేంద్రాలలో పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఆమె వెల్లడించారు.

February 26, 2026 / 04:05 PM IST

సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ మండల కమిటీ ఎన్నిక

SRPT: తుంగతుర్తిలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఉపేందర్, కార్యదర్శిగా కరుణాకర్, కోశాధికారిగా కేదారి ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా సోమయ్య, సంజీవ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యవర్గం సీనియర్ సిటిజన్ల సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం కృషి చేస్తుందన్నారు.

February 26, 2026 / 04:04 PM IST

పట్టణ సమస్యలు పరిష్కరించాలని వినతి

ASF: కాగజ్‌నగర్ పట్టణంలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ వైస్ ఛైర్మన్ అనిత, BRS కౌన్సిలర్లు కలిసి జాయింట్ కలెక్టర్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ లోపాలు, తాగునీటి సరఫరా అంశాలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హమీ ఇచ్చారు.

February 26, 2026 / 04:02 PM IST

కౌన్సిలర్లుగా ఐదుగురు ప్రమాణస్వీకారం

KNR: హుజూరాబాద్ మున్సిపాలిటీలో ఇటీవల ఎన్నికైన బీజేపీ కౌన్సిలర్లు గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. అధికారుల సమక్షంలో సుమలత (10 వార్డు), అనూష (20 వార్డు),పంజాల మనోజ్ గౌడ్ (21 వార్డు), హరిదాసు లక్ష్మి దుర్గ (23 వార్డు), ప్రశాంతి (25 వార్డు) ప్రమాణస్వీకారం చేశారు. వీరిని మున్సిపల్ ఛైర్ పర్సన్ సుహాసిని, వైస్ ఛైర్ పర్సన్ అంజలి అభినందించారు.

February 26, 2026 / 04:02 PM IST

‘జిల్లాను అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యం’

ADB: జిల్లాలోని హట్టిఘాట్ పంప్ హౌస్, చనాకా-కోరాట బ్యారేజ్ ప్రాంతాల వద్ద ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

February 26, 2026 / 04:02 PM IST

రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లిన కారు

TG: జనగామ జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్ రిజర్వాయర్‌లోకి కారు దూసుకెళ్లింది. కారు డ్రైవర్ భూక్యా పవన్ అనే వ్యక్తి గల్లంతయ్యారు. కారు నుంచి స్పల్ప గాయాలతో చరణ్ అనే వ్యక్తి బయటపడ్డాడు. అతడిని స్థానికులు కాపాడారు. చిల్పూర్ మండలం దేశాయితండా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

February 26, 2026 / 04:01 PM IST

ఛైర్మన్‌తో వైసీపీ ఎమ్మెల్సీల భేటీ

AP: శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజుతో ఇద్దరు ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, రాజశేఖర్ సమావేశమయ్యారు. రాజీనామా ఎందుకు చేస్తున్నారని వారిని ఛైర్మన్ అడిగారు. దీనికి బదులుగా వారు స్వచ్ఛందంగానే రాజీనామా చేశామని వెల్లడించారు. వెంటనే ఆమోదించాలని ఛైర్మన్‌ను కోరారు. కాగా, ఇరువురు ఎమ్మెల్సీలు ఇచ్చి చాలా కాలం అయిన నేపథ్యంలో ఛైర్మన్ వారితో భేటీ అయ్యారు.

February 26, 2026 / 04:00 PM IST

సీనియర్ అసిస్టెంట్ విశ్వరత్నంకు ఉద్యోగోన్నతి

నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్. విశ్వరత్నంకు ఉద్యోగోన్నతిపై సూపరింటెండెంట్‌గా బాధ్యతలను కేటాయిస్తూ కమిషనర్ నందన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్‌లో కమిషనర్ నుంచి విశ్వరత్నం గురువారం ఉత్తర్వులు అందుకున్నారు. విధులలో ఉత్తమ ప్రతిభ కనబరచాలన్నారు.

February 26, 2026 / 04:00 PM IST

రేపు ఒంగోలులో జాబ్ మేళా

ప్రకాశం: ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 27న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పద్మ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గురువారం ఆమె మాట్లాడుతూ.. టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరు కావచ్చన్నారు. ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, రూ. 37,500 వరకు వేతనం పొందే జాబ్స్ ఉన్నట్లు ఆమె తెలిపారు.

February 26, 2026 / 03:59 PM IST

దొరేపల్లి రైతుల సమావేశం

NRPT: మద్దూరు మండలం దొరేపల్లి గ్రామంలోని దామ్లా నాయక్ తాండ గ్రామపంచాయితీలో భూసంపత్తి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ అధికారులు నిర్వహించిన సమావేశంలో రైతులకు పంటలో అధిక దిగుబడి కోసం పంట మార్పిడి విధానం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.

February 26, 2026 / 03:59 PM IST

పరిశ్రమలకు క్లీన్ ఎనర్జీ కీలకం: అనగాని

AP: పరిశ్రమలకు క్లీన్ ఎనర్జీ కీలకమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజు ద్వారా అసైన్డ్ భూములు కేటాయిస్తామని వెల్లడించారు. ఎకరాకు ఏడాదికి రూ.31 వేలకు లీజుకి ఇస్తామని పేర్కొన్నారు. రూ.10 లక్షల కోట్ల ఎనర్జీ ప్రాజెక్టులు వస్తాయని తెలిపారు. 7.5 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు.

February 26, 2026 / 03:59 PM IST

విజయ్‌-రష్మిక పెళ్లి.. ట్రెండింగ్‌లోకి ‘కొడవ వెడ్డింగ్‌’

విజయ్, రష్మికల వివాహ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం తెలుగు సంప్రదాయంలో ఒక్కటైన ఈ జంట, సాయంత్రం కర్ణాటకలోని ‘కొడవ’ పద్ధతిలో మరోసారి పెళ్లి చేసుకోనున్నారు. మంగళస్నానంతో వేడుక మొదలవుతుంది. కొడవ సంప్రదాయం ప్రకారం వధువు తన పైటను వెనుక నుంచి ముందుకు వేస్తుంది. ఈ వేడుకలో డ్రమ్ బీట్స్, వారియర్ నృత్యాలు, గన్ సెల్యూట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

February 26, 2026 / 03:59 PM IST