• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీల వెల్లువ

కడప: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అధ్యక్షతన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి అందిన 102 ఫిర్యాదులపై ఎస్పీ వారితో నేరుగా సంభాషించారు. ఫిర్యాదులను చట్టపరిధిలో, నిర్దేశిత సమయంలోగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

February 23, 2026 / 04:11 PM IST

ప్రజా సమస్యలే ప్రథమ ప్రాధాన్యం

అన్నమయ్య: మదనపల్లిలో నిర్వహించిన‘PGRS’కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ బాధితుల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారుతో ముఖాముఖి మాట్లాడిన ఎస్పీ, సమస్యలను తక్షణమే సంబంధిత అధికారులకు బదిలీ చేసి నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల ఫిర్యాదులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

February 23, 2026 / 04:11 PM IST

‘కేరళ ఎన్నికలకు మూటలు పంపేందుకే సీఎం డ్రామా’

HYD: సీఎం రేవంత్ రెడ్డి దేవాదుల ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేరళ ఎన్నికలకు నిధులు సమకూర్చుకోవడానికి సీఎం దేవాదుల పనులను తెరపైకి తెచ్చారని, ఇది మైండ్ గేమ్ అని ఆయన మండిపడ్డారు. కేరళ ఎన్నికలకు రూ.1000 కోట్లు పంపడానికి ఈ డ్రామాలు ఆడుతున్నారన్నారు.

February 23, 2026 / 04:08 PM IST

ప్రేమ పెళ్లి… కుల బహిష్కరణ

TG: జగిత్యాల జిల్లాకు చెందిన సంగీత, బద్దీ పవన్ 2023లో ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. దీంతో వారిని పెద్దలు కులబహిష్కరణ చేశారు. ఊరిలో ఏ శుభకార్యాలకు రానివ్వకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా.. అధికారులు స్పందించలేదన్నారు.

February 23, 2026 / 04:07 PM IST

‘కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలి’

WNP: వీపనగండ్ల మండలంలోని సర్వే నెంబర్ 721లో 16 ఎకరాల 20 గుంటల భూమిని రాజకీయ నాయకులు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాలని వనపర్తి ప్రజావాణిలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి వినతి పత్రాన్ని అందజేశారు. అధికారులు చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.

February 23, 2026 / 04:06 PM IST

కుమ్మెర ఘటనపై డీజీపీకి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు

NGKL: కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష దాడి, శిశువు మృతి ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియస్ అయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేస్తూ.. నిందితుడైన సర్పంచిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు తక్షణమే రక్షణ కల్పించి, భారీ నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.

February 23, 2026 / 04:05 PM IST

పాన్ కార్డులో ఉండే అంకెల అర్థం తెలుసా..?

దేశంలో ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు అత్యంత కీలకం. ఇందులో ఉండే 10 అంకెల కోడ్‌లో మొదటి మూడు అక్షరాలు సిరీస్‌ను.. నాలుగో అక్షరం వ్యక్తి లేదా సంస్థను సూచిస్తే, ఐదో అక్షరం ఇంటి పేరును తెలియజేస్తుంది. పన్ను చెల్లింపులు, బ్యాంక్ పనులకు ఇది తప్పనిసరి. ఆర్థిక లావాదేవీల పారదర్శకతకు ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ఈ గుర్తింపు పత్రం చాలా ముఖ్యం.

February 23, 2026 / 04:05 PM IST

ఉత్తర్వులను రద్దు చేయాలని కలెక్టర్‌కు వినతి

NLG: జిల్లా డైట్ కాలేజీలో స్టాఫ్ ట్యూటర్‌గా జి.ప.పాఠశాల ఉపాధ్యాయుడికి ‘అపాయింట్‌మెంట్ బై ట్రాన్స్‌ఫర్’ ఇవ్వడాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (జీటీఏ) తప్పుబట్టింది. ప్రభుత్వ పోస్టుల్లో స్థానిక సంస్థల ఉపాధ్యాయులను నియమించడం చట్టవిరుద్ధమని తెలిపింది. కోర్టు తీర్పులు, సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఉన్న బదిలీని రద్దు చేయాలని కలెక్టర్‌కు ఇవాళ వినతి ఇచ్చారు.

February 23, 2026 / 04:04 PM IST

‘బెస్ట్ పైలట్’ అవార్డులు అందుకుంది వీరే..!

ADB: 102 అంబులెన్సు సేవల్లో అత్యుత్తమ ప్రతిభకనబరిచిన పైలట్లకు సోమవారం ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందిస్తూ ప్రాణాలను కాపాడుతున్న పైలట్లు హరి ఓం, ధన్ సింగ్ల సేవలను ప్రశంసించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని పీవో పేర్కొన్నారు.

February 23, 2026 / 04:01 PM IST

‘నూతన బస్టాండ్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలి’

KMM: ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలని కలెక్టర్‌ను ఎస్సీ, ఎస్టీ, బీసీ అంబేద్కర్ సేవా సంఘం ప్రతినిధులు కోరారు. ఖమ్మంలోని నూతన బస్టాండ్‌కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు.

February 23, 2026 / 04:01 PM IST

తోటవారిపాలెంలో ఎంపీ కృష్ణప్రసాద్ పర్యటన

BPT: చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఆయనకు స్థానిక ప్రజలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎంపీ పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

February 23, 2026 / 04:00 PM IST

‘పాములు-పర్యావరణ హితకారులు’

ప్రకాశం: పర్యావరణ పరిరక్షణలో పాములు కీలక పాత్ర పోషిస్తాయని, మార్కాపురం వన్యప్రాణి విభాగం స్నేక్ క్యాచర్ నిరంజన్ అన్నారు. తర్లుపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, పర్యావరణ విద్యలో భాగంగా ‘పాములు-పర్యావరణ హితకారులు’ అనే అంశంపై సోమవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాము కుట్టినప్పుడు భయపడకుండా తీసుకోవలసిన ప్రథమ చికిత్స గురించి వివరించారు.

February 23, 2026 / 04:00 PM IST

‘విద్యార్థుల సంక్షేమం కోసం పోరాడండి’

TPT: ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ఏపీ స్టూడెంట్స్ జేఏసీ నిరంతరం శ్రమించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఏపీ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమాద్రి యాదవ్‌కు సూచించారు. నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉండి వారి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

February 23, 2026 / 04:00 PM IST

ఎంపీపీ స్కూల్ ను సందర్శించిన ఎంపీడీవో

కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలోని మండల ప్రజా పరిషత్ స్కూల్ ను ఎంపీడీవో ఇమ్రాన్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. పాఠశాలలో హాజరు, మౌలిక వసతులు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యార్థి అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

February 23, 2026 / 04:00 PM IST

ఎస్బీఐ ఎదుట గోల్డ్ లోన్ బాధితుల ఆందోళన

MNCL: చెన్నూర్ పట్టణంలోని ఎస్బీఐ బ్రాంచ్ ఎదుట సోమవారం గోల్డ్ లోన్ బాధితులు ఆందోళన నిర్వహించారు. బ్యాంక్ అధికారుల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. గత ఏడు నెలల నుంచి తమ బంగారం తమకు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బాధితులకు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ బంగారం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 03:58 PM IST