• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: కలెక్టర్

ADB: మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య, విద్యా, పోలీసు, అంగన్‌వాడీ రంగాల్లో మహిళలు అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు.

March 9, 2026 / 08:52 PM IST

రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన జీవీ

PLD: రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు అన్నారు. సోమవారం నూజెండ్ల మండలం పమిడిపాడు గ్రామంలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జీవీ పాల్గొన్నారు. రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన స్వయంగా పంపిణీ చేశారు.

March 9, 2026 / 08:51 PM IST

‘ఆసుపత్రిలో 24 గంటల సేవలు అందించాలి’

నారాయణపేట పాత ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల ఎమర్జెన్సీ సేవలు అందుబాటులోకి తేవాలని అహ్మద్ యూసఫ్ తాజ్ కోరారు. సోమవారం ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ ఫణిందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కొత్త ఆసుపత్రి దూరంగా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. పాత ఆసుపత్రిలో ఓపీతో పాటు అత్యవసర సేవలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

March 9, 2026 / 08:50 PM IST

నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుకు నిధులు మంజూరు

E.G: తాళ్లపూడి మండలం పైడిమెట్ట లిఫ్ట్ ఇరిగేషన్ మొదటి స్టేజ్ దగ్గర ఇటీవల జరిగిన షార్ట్ సర్క్యూట్ తో  ట్రాన్స్ ఫార్మర్ దగ్ధమైంది. ఈ మేరకు నూతన ట్రాన్సఫర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.9 లక్షల 75 వేల చెక్కును కమిటీ సభ్యులకు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ సుబ్బారాయ చౌదరి, రామకృష్ణ పాల్గొన్నారు.

March 9, 2026 / 08:50 PM IST

దళిత యువతకు ఉపాధి రుణాలు అందించాలి: యాదగిరి

SDPT: నంగునూరు మండలానికి చెందిన నిరుద్యోగ దళిత యువతకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసి ఉపాధి కల్పించాలని TPCC కార్యదర్శి దేవులపల్లి యాదగిరి కోరారు. సోమవారం హైదరాబాద్ కార్పొరేషన్ కార్యాలయంలో ఛైర్మన్ ప్రీతంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం దళితుల నిధులను ఇతర అవసరాలకు మళ్లించిందని ఆరోపించారు.

March 9, 2026 / 08:50 PM IST

డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల జాగ్రత్త: SI

GDWL: డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ ఎంత అవసరమో, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తత అంతకంటే ముఖ్యం అని గట్టు SI శేఖర్ గౌడ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గట్టు ప్రభుత్వ ఆసుపత్రి, విద్యాసంస్థల్లో మహిళలకు సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఆన్‌లైన్ ఫ్రెండ్‌షిప్ మోసాలు, సైబర్ స్టాకింగ్, ఫేక్ అకౌంట్ల వేధింపుల గురించి వివరించారు.

March 9, 2026 / 08:48 PM IST

ఫైళ్ల దగ్ధం కేసులో పెద్దిరెడ్డి అనుచరులకు చుక్కెదురు

AP: మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకు చుక్కెదురైంది. పెద్దిరెడ్డి పీఏ, ప్రధాన అనుచరుడికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఏ3, ఏ 4 నిందితులు వంకిరెడ్డి మాధవరెడ్డి, బల్లాపురం మునిరత్నం ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంను ఆశ్రయించారు. దర్యాప్తు పురోగతికి తాము అడ్డం రాలేమని ధర్మాసనం పేర్కొంది.

March 9, 2026 / 08:48 PM IST

ముమ్మరంగా వాహనాల తనిఖీలు

PPM: ఎల్విన్‌పేట చెక్‌పోస్ట్ వద్ద సోమవారం ఎస్‌ఐ శివప్రసాద్ తన సిబ్బందితో కలిసి వాహనాలపై ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమ రవాణాను అరికట్టే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలను పరిశీలించి, నిబంధనలు పాటించని వాహనదారులకు చలానాలు విధించారు.

March 9, 2026 / 08:48 PM IST

‘విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి’

SRD: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. హత్నూరలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాలికలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే నేరుగా పోలీసులను సంప్రదించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీధర్ రెడ్డి, ప్రిన్సిపల్ పాల్గొన్నారు.

March 9, 2026 / 08:47 PM IST

HPV వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు వద్దు: కలెక్టర్

ASF: రానున్న రోజుల్లో గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించేందుకు 9–14 ఏళ్ల బాలికలకు HPV వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ హరిత సూచించారు. సోమవారం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ ప్రారంభించారు. వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహలు వద్దని, 9–14 ఏళ్ల బాలికలు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.

March 9, 2026 / 08:47 PM IST

రేపు ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్

SDPT: సిద్దిపేట పట్టణంలోని కోటిలింగాల, శ్రీనగర్ కాలనీల పరిధిలోని 11 కేవీ ఫీడర్లో నిర్వహణ పనుల దృష్ట్యా మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఏడీఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మారుతి నగర్, నీలకంఠేశ్వర ఆలయం, సాయి నగర్, శ్రీనగర్, భారత్ నగర్, శివం టెంపుల్ ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు.

March 9, 2026 / 08:44 PM IST

‘ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి’

KNR: ప్రజలకు మెరుగైన, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వైద్యాధికారులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఉందని, గ్రామీణ స్థాయిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

March 9, 2026 / 08:44 PM IST

బస్సు టైరు కిందపడి మహిళ మృతి

NLG: మిర్యాలగూడ బస్టాండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దేవరకొండ వెళ్లే బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు టైరు కిందపడి ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలితో పాటు ఉన్న చిన్న బాబు కూడా ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 9, 2026 / 08:43 PM IST

మంచి మనసు చాటుకున్న ప్రతిమా ఫౌండేషన్ నిర్వాహకులు

MNCL: జన్నారం మండలంలోని బాదంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పలు సౌకర్యాలు కల్పించి ప్రతిమా ఫౌండేషన్, కరీంనగర్ నిర్వాహకులు మంచి మనసును చాటుకున్నారు. వాలా విజయ జగన్నాధ రావు జ్ఞాపకార్థం ప్రతిమ ఫౌండేషన్ కరీంనగర్ వారి సౌజన్యంతో బోయినపల్లి ఉషారాణి, బోయినపల్లి హరిణి, వాల అశోక్ రావు సోమవారం బాదంపల్లి జడ్పీ పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

March 9, 2026 / 08:43 PM IST

శాంతి భద్రతలు బాగుండాలి: రేవంత్

TG: రాష్ట్రమైనా.. దేశమైనా అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు బాగుండాలని CM రేవంత్ రెడ్డి అన్నారు. శాంతిభద్రతలు బాగున్న రాష్ట్రాలకే పెట్టుబడులు బాగా వస్తున్నాయన్నారు. దేశ జనాభాలో 2.5శాతం ఉన్న తెలంగాణ.. దేశ GDPకి 5శాతం వాటాను అందిస్తోందన్నారు. దేశ జీడీపీకి తెలంగాణ వాటా 10శాతానికి చేరాలనేది తమ ఆశయమన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ లక్ష్యాలు నిర్దేశించుకొని పని చేయాలని సూచించారు.

March 9, 2026 / 08:42 PM IST