ఎన్టీఆర్: జగ్గయ్యపేట మండలం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు రూ. 10,10,281 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే శ్రీరామ రాజగోపాల్ తాతయ్య వారి నివాసంలో సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స చేయించుకోలేని పేదలకు సీఎం సహాయనిధి ఎంతో తోడ్పాటు అందిస్తుందని ఆయన అన్నారు.
KNR:హోళీ పండుగను పురస్కరించుకుని రేపు జమ్మికుంట మార్కెట్కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు. ప్రభుత్వ సెలవు కారణంగా మంగళవారం మార్కెట్ కార్యకలాపాలు నిలిపివేయబడతాయని, తిరిగి బుధవారం నుంచి యథావిధిగా మార్కెట్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కావున రైతులు, వ్యాపారస్తులు, కార్మికులు ఈ విషయాన్ని గమనించగలరు.
కోనసీమ: అంగన్‌వాడీలు ఛలో విజయవాడ విరమించాలని రావులపాలెం మండల TDP అధ్యక్షుడు కొప్పిశెట్టి ప్రసాద్ కోరారు. సోమవారం వెదిరేశ్వరంలో అంగన్‌వాడీలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేతనాల పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కేంద్రాల అప్‌గ్రేడ్, కొత్త సహాయకుల నియామకం చేపడుతుందని వివరించారు. ఈ పర్యటనలో పలువురు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.
WGL పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ 2 రోజుల విరామం అనంతరం సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.21వేలు ధర పలకగా… వండర్ హాట్(WH) మిర్చి రూ.34 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.19,050, దీపిక మిర్చి రూ.29,500 కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
ATP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అనారోగ్యంతో అనంతపురం సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సోమవారం ఉదయం ఐసీయూలో ఉన్న ఆయనను పరామర్శించారు. వైద్యులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హనుమంతరాయ చౌదరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
BHNG: భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలో భువనగిరి-చిట్యాల రహదారి ప్రక్కన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పంటపొలాలకు సరిగ్గా యూరియా సరఫరా చేయడం లేదంటూ బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని ప్రభుత్వాన్ని డీమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
NLR: నెల్లూరు రూరల్ పరిధిలోని ఆటోనగర్‌లో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్క్రాప్ నిల్వ ఉంచిన ప్లాస్టిక్ గోడౌన్‌లో మంటలు చెలరేగి, తాళాలు వేసి ఉండటంతో లోపల నుంచి భారీగా పొగ ఎగసిపడింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనతో స్థానిక వ్యాపారులు భయాందోళనకు గురయ్యారు.
ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్‌కు కనీసం 95 ఆక్టేన్ (RON) రేటింగ్ ఉండాలని కేంద్రం తప్పనిసరి చేసింది. 20% ఇథనాల్ బ్లెండింగ్ (E20) వల్ల ఇంధన నాణ్యత మెరుగుపడనుంది. ఇథనాల్ కలపడం వల్ల పెట్రోల్ ఆక్టేన్ స్థాయి 91-92 నుంచి 97-98 వరకు పెరుగుతుందని చమురు సంస్థలు తెలిపాయి. దీనివల్ల వాహన ఇంజన్ల పనితీరు మెరుగుపడటంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది.
CTR: చిత్తూరు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా స్థాయి అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత శాఖ అధికారులు ప్రజల నుంచి వస్తున్న ప్రతి ఫిర్యాదును పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
HYD: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతిని శాసనసభ భవనంలోని లాంజ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి శ్రీధర్ బాబు, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు.
కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలం మాలోత్ సంగ్యనాయక్ తండాలోని తుల్జా భవాని, దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని మార్చి 6, 7 తేదీలలో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠ, హోమాలు, ప్రత్యేక పూజలు ఉంటాయని పేర్కొన్నారు. కావున భక్తులు భారీగా తరలి రావాలని కోరారు.
TPT: సూళ్లూరుపేట హోలీ క్రాస్ జంక్షన్ సమీపంలో ఆదివారం సాయంత్రం జాతీయ రహదారిపై తడ ఎంపీడీవో చంద్రశేఖర్ ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ వైపు భాగం దెబ్బతిన్నప్పటికీ ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
WGL: వర్ధన్నపేట మండలంలోని కట్య్రాల గ్రామానికి చెందిన సతీష్ గుండె పోటుతో మృతి చెందాడు. గ్రామంలో టెంట్ సామాను తీసుకు వస్తుండగా ఒక్కసారిగా కుప్ప కూలడంతో స్థానికులు వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. బీజేపీలో గత కొన్నేళ్లుగా చురుగ్గా పని చేస్తూ సేవలు అందిస్తున్నారు.
ప్రకాశం: గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో దిగువ మెట్ట నుంచి నంద్యాల వైపు వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
RR: అందరూ ఆరోగ్యంగా జాగ్రత్తగా కాపాడుకోవాలని జిల్లా అదనపు న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. SDNR కోర్టు సముదాయంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్వాతిరెడ్డి వైద్యశిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు 6 మాసాలకు ఒకసారి తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.