• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘సిరిచెల్మ మల్లన్న జాతరకు ఏర్పాట్లు పూర్తి’

ADB: ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామంలో నెలకొన్న శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ అర్చకులు సోమశేఖర్, మహేష్ శనివారం తెలియజేశారు. 7రోజులపాటు కొనసాగుతున్న జాతరకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు వచ్చి మల్లన్నను దర్శించుకుంటారని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు త్రాగునీరు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

February 21, 2026 / 10:18 AM IST

టెక్నీషియన్‌లు లేక మూలన పడ్డ స్కానింగ్, X రే యంత్రాలు

ASF: తిర్యాణి ఆసుపత్రిలో స్కానింగ్, X రే యంత్రాలు ఉన్నా సిబ్బంది లేక అవి మూలపడ్డాయి. దీంతో గిరిజనులు, గర్భిణులు పరీక్షల కోసం 60KM దూరంలోని మంచిర్యాల లేదా ఆసిఫాబాద్ వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం లక్షలు వెచ్చించి యంత్రాలను సమకూర్చినా, నిర్వహణ కరువవ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి టెక్నీషియన్లను నియమించాలన్నారు.

February 21, 2026 / 10:18 AM IST

కొండపోచమ్మ కెనాల్ నుంచి హల్దీ వాగులోకి సాగునీరు విడుదల

SDPT: వివిధ గ్రామాల రైతుల కోరిక మేరకు గజ్వేల్ మాజీ MLA నర్సారెడ్డి కొండపోచమ్మ కెనాల్ నుంచి హల్దీ వాగులోకి సాగునీరు విడుదల చేశారు. వర్గల్ నవోదయ సమీపంలో జరిగిన కార్యక్రమంలో రైతుల సంక్షేమం కోరే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. రైతు రుణమాఫీ, భరోసా, మద్దతు ధర పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో AMC ఛైర్మన్ విజయ మోహన్, నాయకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 10:15 AM IST

జీరా వాటర్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీరా వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, బరువు తగ్గుతారు. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి, మెటబాలిజాన్ని పెంచుతుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్యలను తగ్గించడమే కాకుండా మధుమేహాన్ని నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తి పెంచడానికి తోడ్పడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చి, జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

February 21, 2026 / 10:15 AM IST

తిరోగమనంలో జన్నారం మండల అభివృద్ధి

MNCL: కవ్వాల్ అభయారణ్యం పరిరక్షణ కోసం బిగించిన ఆంక్షలతో జన్నారం అభివృద్ధికి దూరంగా ఉంది. కవ్వాల్ అభయారణ్యానికి జన్నారం ప్రధాన కేంద్రంగా ఉండగా.. కవ్వాల్ అభయారణ్యంతో పాటు వన్యప్రాణులు, పక్షుల రక్షణకు ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జన్నారం మండలంలో పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు వన్యప్రాణి చట్టం నిబంధనలు అడ్డువస్తున్నాయి.

February 21, 2026 / 10:13 AM IST

కాకునూర్ గ్రామంలో బండలాగుడు పోటీలు

RR: కాకునూర్‌లోని శ్రీ మహాలింగేశ్వర స్వామి సన్నిధిలో బండలాగుడు పోటీలు వైభవంగా నిర్వహించారు. ఈ పోటీలను షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. పోటీలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. రైతులు తమ ఎద్దులను రంగురంగుల వస్త్రాలు, గంటలతో అందంగా అలంకరించి పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది.

February 21, 2026 / 10:13 AM IST

దాడులు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు: షర్మిల

అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ నేతల దాడిని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం ఖండించారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలకు ఇక్కడ దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. దేశంలో ప్రశ్నించే హక్కును బీజేపీ కాలరాస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు.

February 21, 2026 / 10:12 AM IST

నాంపల్లి ల్యాబ్‌లో కాలిపోయిన 1,100 ఫైల్స్

TG: నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) అగ్నిప్రమాదం ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో సుమారు 1,100 ఫైల్స్ పూర్తిగా దగ్ధమైనట్లు నాగ్‌పూర్ ప్రత్యేక బృందం గుర్తించింది. ఈ కేసుల డేటాను రికవరీ చేసేందుకు నిపుణులు ప్రయత్నించినప్పటికీ, అది సాధ్యం కాదని తేల్చి చెప్పారు. కీలక ఆధారాలు ఉన్న ఫైల్స్ కాలిపోవడం ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాలుగా మారింది.

February 21, 2026 / 10:12 AM IST

ఉగాది గిఫ్ట్.. మరో DSC నోటిఫికేషన్..!

W.G: ఉగాది వేళ డీఎస్సీ ప్రకటన నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 900 పైచిలుకు పోస్టులు భర్తీ కాగా, తాజాగా మరో 200 ఖాళీల భర్తీకి అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీంతో ప.గో. అభ్యర్థులు తమ ప్రిపరేషన్ కు మరింత పదును పెడుతున్నారు.

February 21, 2026 / 10:11 AM IST

గంజాయి కేసు.. విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన.!

VZM: బొబ్బిలి (M) కోమటిపల్లిలో విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్న కేసులో 11మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఓ మైనర్ బాలుడు, 7గురు విద్యార్థులు ఉండటం కలకలం రేపింది. కాలేజ్ సమీపంలో గంజాయి విక్రయాలు జరగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి అమ్మకాలు విక్రయిస్తున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

February 21, 2026 / 10:11 AM IST

విభాగాల సమన్వయంపై ప్రత్యేక దృష్టి

అన్నమయ్య: రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన జనగణన-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ పాల్గొన్నారు. జనగణన ఏర్పాట్లపై కేంద్ర అధికారులు మార్గదర్శకాలు అందించగా, జిల్లా స్థాయిలో ముందస్తు సిద్ధతపై కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు విభాగాల సమన్వయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

February 21, 2026 / 10:11 AM IST

నిరుద్యోగ యువతకు శుభవార్త

నిరుద్యోగ యువతకు భారతీయ రైల్వే తరఫున RRB శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులకు 10, ITI/డిప్లొమా ఉత్తీర్ణులైనవారు అర్హులు కాగా.. వీటిల్లో 674 సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉండటం విశేషం. CBT 1 & 2, CBAT, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

February 21, 2026 / 10:09 AM IST

తండ్రిపై దాడి చేసి బంగారంతో పరార్

KRNL: ఆదోని(M) కపటి గ్రామంలో ఆస్తి తగాదాతో కొడుకు తన తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు SI మహేశ్ తెలిపారు. అనంతరం ఇంట్లోని ఐదు తులాల బంగారం, బుల్లెట్ బైక్‌తో పరారయ్యాడని చెప్పారు. గాయపడిన తండ్రిని కుటుంబ సభ్యులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

February 21, 2026 / 10:09 AM IST

దేవరపల్లిలో స్వచ్ఛ రథం ప్రారంభం

E.G: దేవరపల్లిలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాన్ని గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కంబాల సత్తిబాబు, టీడీపీ మండలం అధ్యక్షులు తంగేళ్ల మునీశ్వర రావు శనివారం ప్రారంభించారు. స్వచ్ఛ రథం ద్వారా ప్రజల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను స్వీకరించి వాటి విలువను తగ్గట్టుగా నిత్యవసర సరుకులు ఇవ్వడం జరుగుతుందన్నారు. దీనిని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 21, 2026 / 10:06 AM IST

SRR కళాశాలలో ఎంటర్ప్రైన్యూర్షిప్ డెవలప్మెంట్పై అవగాహన

KNR: కరీంనగర్‌లోని SRR ప్రభుత్వ కళాశాలలోని ఎంటర్ప్రైన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ (EDC) ఆధ్వర్యంలో ఎంటర్ప్రైన్యూర్షిప్ స్ఫూర్తిని పెంపొందించడంపై అవగాహన కార్య క్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కె. రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు ఉద్యోగ అవకాశాలకే పరిమితం కాకుండా స్వయం ఉపాధి దిశగా ఆలోచించాలని సూచించారు.

February 21, 2026 / 10:06 AM IST