ADB: గుడిహత్నూర్ మండలంలోని ముత్నూర్ గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హల్ నిర్మాణానికి ఇవాళ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమి పూజ చేశారు. ముత్నూర్ గ్రామస్తుల కోరికలను కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాదవ్ కరుణ భీంరావ్ నాయాక్. మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుమల్ ఉన్నారు.
ATP: కనేకల్లు మండల కేంద్రంలో స్వచ్ఛ రథాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శనివారం ప్రారంభిoచారు. పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల సరైన నిర్వహణ, ఆరోగ్యకరమైన జీవనశైలికి ఈ స్వచ్ఛ రథం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజల సహకారంతో కనేకల్లు మండలాన్ని మరింత శుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దుకుందాం అని ఆయన కోరారు.
సత్యసాయి: కదిరి మండలంలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వద్ద నిర్వహించిన ధ్వజారోహణం కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
ప్రకాశం: మద్దిపాడులో రూ. 5 కోట్ల వ్యాయామంతో నూతనంగా నిర్మిస్తున్నCC రోడ్లు, సైడ్ డ్రైనేజీ కాలువలను ఎమ్మెల్యే BN విజయ్ కుమార్ శనివారం పరిశీలించారు. అలాగే మద్దిపాడు – నందిపాడు గ్రామం వరకు జరుగుతున్న తారు రోడ్డు పనులను పరిశీలించారు. త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ DE కృష్ణ మోహన్, నాయకులు పాల్గొన్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఊహించని షాక్ తగిలింది. స్థలం విషయంలో ధోనీకి జార్ఖండ్ రాష్ట్ర గృహనిర్మాణ బోర్డు తాజాగా నోటీసులు జారీ చేసింది. రాంచీలోని హర్ము ప్రాంతంలో ఉన్న ఆయన నివాస స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ నోటీసులపై 15 రోజుల్లో స్పందించాలని ప్రభుత్వం గడువు ఇచ్చింది.
AP: రాబోయే రోజుల్లో 3.45 లక్షల మంది బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వ్యాక్సిన్ కోసం కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక్క డోసు ఇస్తే వీరికి క్యాన్సర్ నుంచి రక్షణ దొరుకుతుందన్నారు. ఆ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని స్పష్టం చేశారు. 14-15 ఏళ్ల వయసున్న బాలికలంతా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
HYD: కుమ్మెర మల్లన్న జాతర బాధితులు ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాలీ నిర్వహించారు. ధర్మాసమాజ్ పార్టీ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితులకు రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. నిన్న డీజీపీని కలిసి రెండు నెలల పాప చావుకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు.
MBNR: ప్రజలంతా ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని హన్వాడ మండల ఎస్సై వెంకటేష్ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎస్సై హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు మద్యం తాగి ఎట్టి పరిస్థితిలోనూ వాహనాలు నడపకూడదన్నారు. పోలీసులకు సహకరించాలన్నారు.
NZB: బోధన్ పట్టణంలోని శంకర్ నగర్ (22వ వార్డు)లో కౌన్సిలర్ మిద్దెల రామరాజు శనివారం పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించారు. మున్సిపల్ జవాన్ మహబూబ్‌తో కలిసి వార్డు అంతటా తిరుగుతూ పారిశుద్ధ్య నిర్వహణను పర్య వేక్షించారు. వార్డును ఆదర్శంగా, పరిశుభ్రంగా ఉంచడమే తమ లక్ష్యమని, ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని కోరారు.
నాని, సుజీత్ కాంబోలో వస్తున్న ‘బ్లడీ రోమియో’పై అంచనాలు పెరిగిపోయాయి. సుజీత్ తాజాగా ప్రభాస్, పవన్ కళ్యాణ్, నానిల ఫోటోను షేర్ చేయడంతో తన ‘సినిమాటిక్ యూనివర్స్’పై హింట్ ఇచ్చినట్లయింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గనుక ‘సాహో’, ‘OG’ సినిమాలతో లింక్ అయితే నాని కెరీర్‌లోనే భారీ హైప్ క్రియేట్ అవ్వడం ఖాయం. ఈ అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రచ్చ చేస్తున్నారు.
KDP: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మాధవి రెడ్డి పేర్కొన్నారు. శనివారం కడప నగరంలోని 31వ డివిజన్ పరిధిలో పాత మహిళా పోలీస్ స్టేషన్ సమీపంలో ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ చేశారు. లబ్ధిదారులకు పింఛన్లను అందజేసి, వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
RR: శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బీీవి.ఆర్ గార్డెన్ వద్ద నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతి అర్హుడికి ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసును కోర్టు కొట్టేసిన నేపథ్యంలో BRS అధినేత, మాజీ సీఎం KCR కీలక వ్యాఖ్యలు చేశారు. కవితకు న్యాయం జరిగిందని, BRS కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే ఎప్పుడైనా చివరికి న్యాయమే గెలుస్తుందన్నారు. లిక్కర్ కేసులో BJP కుట్ర పన్నిందని ఆరోపించారు. అలాగే, రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై KTRతో చర్చించినట్లు తెలుస్తోంది.
SDPT: చిన్నకోడూరు మండలంలోని మేడిపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. బోధనలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
KRNL: కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని ఎంపీ బస్తిపాటి నాగరాజు ఇవాళ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎంపీకి అధికారులు, అర్చకులు సంప్రదాయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ టీఏసీ సభ్యులు బత్తిన జీవన్ కుమార్, చంద్రశేఖర్ ఉన్నారు.