KRNL: హలహర్వి మండలం బిలేహల్లో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. జనసేన నేత మల్లికార్జున ఆధ్వర్యంలో ఇవాళ రుద్రముణి స్వామి గుడి నుంచి గాదలింగప్ప ఇంటివరకు నిర్మాణం చేపట్టారు. ఏళ్లుగా బురద సమస్యతో ఇబ్బందులు పడ్డ గ్రామస్తులు, రోడ్డు మంజూరు కావడంతో ఆనందం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో రాకపోకలు సులభతరం అవుతాయని స్థానికులు భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చమురు శుద్ధి సంస్థలపై కేంద్రం ఎస్మా ప్రయోగించింది. గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. డొమెస్టిక్ గ్యాస్, ఎరువుల ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వనుంది. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా పెట్రోలియం శాఖ చర్యలు చేపట్టింది.
CTR: చల్లా బాబును పుంగనూరు నియోజకవర్గ TDP ఇంఛార్జ్ పదవి నుంచి తొలగించనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు అధిష్ఠానం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నా, త్రిసభ్య కమిటీ వేసి, పెద్దిరెడ్డిని సమర్థవంతంగా ఎదుర్కొనే నాయకుడి కోసం ప్రయత్నాలు చేయనున్నట్లు సమాచారం.
TPT: నాయుడుపేటలోని ZP బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక గుర్తింపు శిబిరం నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ALIMCO ద్వారా వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు వంటి సహాయ పరికరాలను అందించనున్నారని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
TG: భద్రాచలం సీతారామచంద్రస్వామి హుండీ ఆదాయం 38 రోజులకు రూ. 1,05,94,090 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు 80 గ్రాముల బంగారం, 650 గ్రాముల వెండి లభించాయి. 91 US డాలర్లు వచ్చినట్లు పేర్కొన్నారు.
MBNR: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా భూత్పూర్ మున్సిపాలిటీలో ఇవాళ పర్యటించారు. పట్టణంలోని పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఆమె, ప్రజల ఆరోగ్యం పరిసరాల పరిశుభ్రతపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు.
NLG: జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా విద్యా వ్యాప్తికి సావిత్రిబాయి పూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
కృష్ణా: యనమలకుదురు ఆలయంలో హుండీ కానుకల చోరీ జరిగింది. ఈ వ్యవహారంలో అర్చకులు గూడూరు రామలింగేశ్వర విద్యాసాగర్, బాలూరి పూర్ణచందర్రావు, ఆలయ సిబ్బంది కొండ్రాతి రోశయ్యలను పెనమలూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో అవనిగడ్డ జైలుకు తరలించారు. ఆలయ ఈవో పాత్రపై కూడా విచారణ జరుగుతోంది.
AP: ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. దైవాలరావూరు, పమిడిపాడులో విద్యార్థులకు ఆయన సైకిళ్లను పంపిణీ చేశారు. సైకిళ్ల పంపిణీలో దాతల సహకారం మరువలేనిదన్నారు. గత ప్రభుత్వంలో విద్యావ్యవస్థ అగమ్యగోచరంగా మారిందని మండిపడ్డారు.
NZB: ఖమ్మం వెలుగుమట్ల భూ నిర్వాసితుల పక్షాన నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి ఖమ్మం అంబేద్కర్ భవన్ వద్ద డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్‌తో కలిసి ఆమె దీక్షకు దిగారు. పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని హైదరాబాద్ వైపు తరలించారు.
BPT: అద్దంకిలోని బస్టాండ్ సెంటర్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుపై మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు మండల అధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. ఇరాన్‌పై దాడులను సాకుగా చూపి సిలిండర్ ధరలను పెంచడం సరికాదని అన్నారు. దీనివలన మధ్యతరగతి మహిళలు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆయన పేర్కొన్నారు.
SRCL: తంగళ్ళపల్లి మానేరు వంతెనపై బీజేపీ ఆధ్వర్యంలో రైతులు మంగళవారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమునేని శ్రీధర్ రావు మాట్లాడుతూ.. కాలేశ్వరం 11వ ప్యాకేజీ పనులు వెంటనే పూర్తి చేసి మండలంలోని రైతులకు నీళ్లు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. అధికారం రాకముందు అన్ని హామీలు ఇచ్చి ఇప్పుడు మండలంలోని రైతులను పట్టించుకోవడంలేదన్నారు.
SRD: మండల కేంద్రమైన కంగ్టి గిరిజన గురుకుల పాఠశాలలో సావిత్రిబాయి పూలే ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు దేవేందర్ మాట్లాడుతూ.. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారంటే అది సావిత్రిబాయి ఆనాడు వేసిన సాహసోపేతమైన పోరాటంతోనే సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సావిత్రిబాయి గురించి వివరించారు.
ప్రకాశం: పామూరు పట్టణంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రాలను ఎస్సై అనూక్ మంగళవారం పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉంటారని తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.
SDPT: భూంపల్లి మండల కేంద్రంలో సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే ఆడపిల్లల విద్య కోసం ఎంతో కృషి చేసిన మహానీయురాలని కొనియాడారు.