E.G: నల్లజర్ల మండలం అయ్యవరంలో వాటర్ ప్లాంట్‌ను MLA మద్దిపాటి వెంకటరాజు ఆదివారం ప్రారంభించారు. ద్వారక తిరుమల వెళ్లే భక్తుల దాహం తీర్చేందుకు నల్లజర్ల సొసైటీ డైరెక్టర్ గుడిసె శివకృష్ణ సొంత నిధులతో దీనిని ఏర్పాటు చేశారు. 365 రోజులు సేవలందించే ఈ ప్లాంట్, ఈ వేసవిలో నడిచి వెళ్లే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా కొనియాడారు.
MDK: మున్సిపల్ ఎన్నికల్లో తనపై గొడ్డలితో హత్యాయత్నం జరిగిందని మెదక్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్ ఆరోపించారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనపై జరిగిన దాడి దృశ్యాలు వీడియోల్లో స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. వందలాది మందితో దాడులు చేసేందుకు సిద్దిపేట నుంచి కుట్ర పన్నారని తెలిపారు.
ATP: గుత్తి ఎస్సై అమీర్ ఖాన్ ఆధ్వర్యంలో పోలీసులు, విద్యార్థినులు ఆదివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ వద్ద నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ చేసినట్లు ఎస్సై అమీర్ ఖాన్ చెప్పారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.
NLG: నల్గొండ మండలం రాములబండలో జరుగుచున్న శ్రీ సీతా రామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. భక్తులతో కలిసి స్వామివారి రథాన్ని లాగారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు.
కోనసీమ: రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో మార్చి 31 వరకు సెక్షన్-30 అమలులో ఉంటుందని ఇంఛార్జ్ డీఎస్పీ టీఎస్ఆర్‌కే ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రామచంద్రపురం, ద్రాక్షారామం, పామర్రు పోలీస్ స్టేషన్ పరిధిలో ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఆయన హెచ్చరించారు. ముందస్తు అనుమతులు తప్పనిసరి అని పేర్కొన్నారు.
KMR: పరీక్షా కాలంలో మానసిక ఒత్తిడిని జయించాలని, విద్యార్థులెవ్వరూ నిరాశ చెందవద్దని జిల్లా మానసిక వైద్యాధికారి డా. రమణ సూచించారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే మరోసారి రాసుకోవచ్చన్నారు. జీవితం కోల్పోతే మళ్లీ తిరిగి రాదన్నారు. ఇంటర్, పదో తరగతి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఎటువంటి నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా పరీక్షలు బాగా రాయాలన్నారు.
KMR: పరీక్షా కాలంలో మానసిక ఒత్తిడిని జయించాలని, విద్యార్థులెవ్వరూ నిరాశ చెందవద్దని జిల్లా మానసిక వైద్యాధికారి డా. రమణ సూచించారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే మరోసారి రాసుకోవచ్చన్నారు. జీవితం కోల్పోతే మళ్లీ తిరిగి రాదన్నారు. ఇంటర్, పదో తరగతి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఎటువంటి నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా పరీక్షలు బాగా రాయాలన్నారు.
NLR: నెల్లూరు కలెక్టరేట్‌లో రేపు యథావిధిగా PGRS కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్‌సైట్ Meekosam.ap.gov.in నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీ స్థితి లేదా ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.
కోనసీమ: సుదీర్ఘ చరిత్రను, మహోన్నత సాహిత్య సంపదను, అద్భుతమైన సాంస్కృతిక వైభవాన్ని కలిగిన తెలుగు భాష తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకని, దేశ భాషలందు తెలుగు లెస్స అని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. అమలాపురం కిమ్స్ ప్రాంగణంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో రెండవ రోజు గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి త్రిపుర సీఎం మనీష్ షా కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుని దర్శనం అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలను, చిత్ర పటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
VKB: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరలేపారని బంట్వారం ఎస్సై విమల తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీ పాయింట్లను నగదుగా మారుస్తామంటూ వాట్సాప్ MMSల ద్వారా లింకులు పంపి, APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయించి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్నారని అన్నారు. ఇటువంటి ఫేక్ మెసేజ్‌లను నమ్మొద్దని చెప్పారు.
RR: మియాపూర్ ప్రగతి ఎంక్లేవ్‌లోని ఒక స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు రూపొందించిన సైన్స్ ఎగ్జిబిషన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన అట్టేపల్లి రామప్రభు విద్యార్థుల ప్రయోగాలు, వారి సృజనాత్మకతను చూసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రదర్శనను వీక్షించిన విద్యార్థుల తల్లిదండ్రులు, కాలనీ వాసులు విద్యార్థులను కొనియాడారు.
ATP: కళ్యాణదుర్గం సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం: పామూరు మండల సర్వసభ్య సమావేశం ఆదివారం ఎంపీపీ గంగసాని లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మండలంలో మౌలిక సమస్యలపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా సింగిల్ విండో ఛైర్మన్ ఉప్పలపాటి హరిబాబు మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సమావేశంలో పాల్గొన్న సభ్యులకు పిలుపునిచ్చారు.
TG: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉద్యమ జీవితాన్ని గడిపిన మల్లోజుల వేణుగోపాల్ జనజీవన స్రవంతిలో కలిసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన స్వస్థలం పెద్దపల్లికి వచ్చారు. సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కొనసాగిన ఆయన స్వగ్రామానికి వచ్చారు. దీంతో ఆయన బంధువులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు. వారితో ముచ్చిటిస్తూ.. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.