• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వైభవంగా చౌడేశ్వరీదేవి జ్యోతుల ఉత్సవం

ATP: తాడిపత్రి పట్టణంలోని జీవీపీ కాలనీలో ఉగాది పండుగను పురస్కరించుకుని శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారి జ్యోతుల ప్రదర్శన కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేకే పూజలు, పల్లకీ సేవ చేసి జ్యోతులను ఊరేగిస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకలో కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 20, 2026 / 09:35 AM IST

ఆస్తి పన్ను వసూలు వేగవంతం

NGKL: అచ్చంపేట మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్లలో వేగవంతం చేస్తున్నట్లు శుక్రవారం మున్సిపల్ మేనేజర్ రమేష్ నాయక్ తెలిపారు. 2025 -2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నూరు శాతం పన్నులు వసూలు చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పనులు రూ.40 లక్షల వరకు బకాయిలు ఉన్నాయన్నారు.

March 20, 2026 / 09:33 AM IST

సీఎం సహాయనిది చెక్కును అందజేసిన సర్పంచ్

KMM: నేలకొండపల్లి మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన భూక్య బిక్షాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా శుక్రవారం సీఎం సహాయ నిధి ద్వారా నగదు మంజూరు అయింది. ఈ నేపథ్యం లో ఆ చెక్కును గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రవీణ్ చేతుల మీదుగా లబ్ధిదారుడికి అందజేశారు.

March 20, 2026 / 09:32 AM IST

బొర్రా గుహల రహదారి ప్రమాదకరం

ASR: బొర్రా గుహల ప్రధాన రహదారి కోతకు గురై ప్రమాదకరంగా మారింది. కల్వర్టుల లేమితో ములియగుడ నుంచి బొర్రా గుహల వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర రహదారి శిథిలావస్థకు చేరుకుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పలు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

March 20, 2026 / 09:32 AM IST

మరికల్‌లో ఉగాది పంచాంగ శ్రవణం

NRPT: మరికల్ మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉగాది సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. పరాభవ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆశించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దసరా కట్ట వద్ద కాషాయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.

March 20, 2026 / 09:32 AM IST

‘ఈద్-ఉల్-ఫితర్ వేడుకలకు బాసర సన్నద్ధం’

NRML: నెల రోజుల కఠోర ఉపవాసం ముగిసిన తరువాత జరగనున్న ఈద్-ఉల్-ఫితర్ పండుగ కోసం బాసర మండల కేంద్రం పూర్తి సన్నద్ధతలో ఉంది. మస్జిద్ అబూబకర్ కమిటీకి చెందిన 30 మంది యువకులు మైదానాన్ని రంగురంగుల అలంకరణలతో, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. శుక్రవారం జరిగే ప్రత్యేక నమాజ్ కోసం ప్రత్యేక టెంట్లు, మినీ స్పీకర్లు వంటి సౌకర్యాలను నిర్వాహకులు పూర్తి చేశారు.

March 20, 2026 / 09:30 AM IST

కుక్కల దాడులతో గాయపడుతున్న ప్రజలు

MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో కుక్కల దాడులతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జన్నారం మండలంతోపాటు వివిధ గ్రామాలలో ఇటీవల ప్రజలపై కుక్కల దాడులు పెరిగాయి. గడిచిన మూడు నెలల్లో 12 మందిపై దాడి చేసి గాయపరిచాయి. అయితే కుక్కలను నియంత్రించే అధికారం పంచాయతీ అధికారులకు లేకపోవడంతో తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

March 20, 2026 / 09:28 AM IST

కొమ్మాలలో నర్సంపేట పాలకమండలి సభ్యుల పూజలు

WGL: ఉగాది పండుగను పురస్కరించుకొని నర్సంపేట మున్సిపాలిటీ పాలకమండల సభ్యులు గురువారం కుటుంబ సమేతంగా గీసుగొండ మండలంలోని కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా మున్సిపల్ ఛైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ- రామానంద్లు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

March 20, 2026 / 09:27 AM IST

పూర్ణచంద్రరావు భౌతికకాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

కృష్ణా: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ఏపీ బ్యూరో రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు మృతి పట్ల ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ పడమటిలంకలోని స్వగృహంలో పూర్ణ భౌతిక కాయానికి ఎమ్మెల్యే రాము శుక్రవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. పూర్ణచంద్రరావు మృతి విచారకరమని అన్నారు.

March 20, 2026 / 09:27 AM IST

మరిపెడలో కారు ఆటో ఢీకొని వ్యక్తి మృతి

MHBD: మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం శివారు సీతారాం తండా స్టేజీ వద్ద ఇవాళ ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఆరుగురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ రామసాని వెంకన్న (55) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆటోలో కురివి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

March 20, 2026 / 09:26 AM IST

రైతు మేళకు తరలిన రైతులు

MDK: రామాయంపేట మండలానికి చెందిన పలువురు రైతులు శుక్రవారం సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్వహిస్తున్న రైతు మేళా కార్యక్రమానికి బయలుదేరారు. రామాయంపేట వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పలు రైతులను ప్రత్యేక వాహనంలో నర్మెట రైతు మేళకు అధికారులు తరలించారు. వ్యవసాయ పరికరాల ప్రదర్శన, శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమంలో వీరు పాల్గొంటారని తెలిపారు.

March 20, 2026 / 09:26 AM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి

తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేశ ప్రజల క్షేమం, రైతుల శ్రేయస్సు కోసం ప్రార్థించినట్లు తెలిపారు. ఉగాది సందర్భంగా వేంకటేశుని ఆశీస్సుల కోసం వచ్చానన్నారు. ప్రపంచమంతా యుద్ధభూమిలో ఉంటే భారత్ సేఫ్ జోన్‌లో ఉందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆధ్యాత్మికత, శాంతి, అభివృద్ధి నడుస్తోందన్నారు.

March 20, 2026 / 09:26 AM IST

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 795 పాయింట్లు లాభపడి 75,156.58 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 251 పాయింట్ల లాభంతో 23,289.05 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.92.92గా ఉంది.

March 20, 2026 / 09:25 AM IST

అందరికీ ఆదర్శంగా ఎంపీ స్వగ్రామం

SDPT: అక్బర్ పేట-భూంపల్లి మండలంలోని ఎంపీ రఘునందన్ రావు స్వగ్రామం బొప్పాపూర్ కీలక నిర్ణయాలతో ఆదర్శంగా నిలుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఇప్పటికే మద్యపాన నిషేధ గ్రామంగా కొనసాగుతుంది. కాగా ఉగాది రోజు నుంచి గ్రామంలో బహిరంగ మలవిసర్జన నిషేధమని తీసుకున్న కీలక నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.

March 20, 2026 / 09:23 AM IST

పాఠశాలలో జిల్లా పర్యవేక్షణ ప్యానెల్ బృందం తనిఖీ

SRPT: మునగాల మండలం బరాఖత్ గూడెం ప్రాథమిక పాఠశాలను ఈరోజు జిల్లా పర్యవేక్షణ ప్యానెల్ బృందం తనిఖీ చేసింది. ప్రార్థన సమయానికే చేరుకున్న బృందం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పరిశీలించింది. అనంతరం తరగతి గదిలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 20, 2026 / 09:23 AM IST