• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అక్రమ బెల్టు షాపులపై దాడి.. మద్యం స్వాధీనం

WGL: సంగెం మండలం గవిచర్లలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్టు షాపులపై ఎస్సై వంశీకృష్ణ ఆధ్వర్యంలో గురువారం ఆకస్మిక దాడి నిర్వహించారు. పలు షాపుల్లో విక్రయిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని గుండ బ్రహ్మయ్య ఆలయంలో జాతర జరగనున్న నేపథ్యంలో మద్యం విక్రయాలను నిలిపివేయాలని హెచ్చరించినప్పటికీ వినకపోవడంతో దాడి చేపట్టినట్లు తెలిపారు.

March 19, 2026 / 07:06 PM IST

షర్మిల హద్దులు మీరి మాట్లాడారు: రాచమల్లు

AP: మాజీ సీఎం జగన్‌పై షర్మిల హద్దులు మీరి మాట్లాడారని మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ మండిపడ్డారు. షర్మిల, సునీత వైఎస్ కుటుంబ గౌరవాన్ని దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.236 కోట్లు విడతలవారీగా షర్మిలకు జగన్ ఇచ్చారని తెలిపారు. చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చడమే షర్మిల ఉద్దేశమని విమర్శించారు. ఎప్పటికైనా షర్మిల, సునీతను చంద్రబాబు మోసం చేస్తారని పేర్కొన్నారు.

March 19, 2026 / 07:06 PM IST

పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ

SRPT: ముస్లింల పవిత్ర పండగ రంజాన్‌ను పురస్కరించుకుని మఠంపల్లి(మం) పెదవీడులో గల కౌసర్, మదీన మస్జీద్‌ల ఆవరణలో రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అమరారపు వెంకటేశ్వర్లు, హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ కరీం పాల్గొన్నారు. పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను పంపిణీ చేయండం ఎంతో భాగ్యమన్నారు.

March 19, 2026 / 07:05 PM IST

‘పార్టీని బలోపేతం చేస్తే సస్పెండ్ చేస్తారా?’

ADB: సోనాల మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే సస్పెండ్ చేస్తారా? అని బత్తుల రమేష్ అన్నారు. ఇవాళ మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అహర్నిశలు కష్టపడి పార్టీని కాపాడుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్కొన్నారు.

March 19, 2026 / 07:05 PM IST

మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం

ప్రకాశం: సి.యస్.పురం మండలం మిట్టపాలెంలోని నారాయణ స్వామి దేవస్థానంలో ఉగాది పరాభవనామ సంవత్సరం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శివప్రసాదు శర్మని ఈవో శ్రీగిరిరాజు నర్సింహబాబు సత్కరించారు. సుబ్రమణ్యం పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత విష్ణుమూర్తి స్వామివారి గ్రామోత్సవం మాడవీధుల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

March 19, 2026 / 07:04 PM IST

గ్రామాభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే

SKLM: ఉగాది సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకూర్మం పంచాయతీ తండ్యాలపేట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలపై అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

March 19, 2026 / 07:04 PM IST

ప్రధానార్చకుడికి విశిష్టత పునస్కారం

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు గౌరీభట్ల నృసింహరామ శర్మ, ఉగాది పునస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశిష్ట పురస్కారం అందుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా ఈ పునస్కారాన్ని గురువారం అందుకున్నారు.

March 19, 2026 / 07:04 PM IST

కరియామాణిక స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు

CTR: నగరిలోని శ్రీ కరియామాణిక్య స్వామి ఆలయంలో ఉగాది పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పండితులు పంచాంగ శ్రవణం చేసి, నూతన సంవత్సర ఫలితాలను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

March 19, 2026 / 07:03 PM IST

అవార్డు అందుకోవడం సంతోషం: శివాజీ

హైదరాబాద్ హైటెక్స్‌ వేదికగా జరుగుతున్న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. నటుడు శివాజీ మాట్లాడుతూ.. గద్దర్ అవార్డు అందుకోవడం సంతోషకరమని పేర్కొన్నాడు. ప్రభుత్వాలు అవార్డులు ఇస్తే అందరికీ ప్రోత్సహకంగా ఉంటుందని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నాడు. మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నాడు.

March 19, 2026 / 07:03 PM IST

ఉగాది పచ్చడిని భక్తులకు అందించిన కోలా ఆనంద కుమార్

TPT: శ్రీకాళహస్తి గాలి గోపురం వద్ద ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఇంఛార్జ్ కోలా ఆనంద్ కుమార్ తన మిత్రబృందంతో కలిసి భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది పండుగ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకువస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని భక్తులకు సేవలందించారు.

March 19, 2026 / 07:02 PM IST

భూదాన్ భూముల వ్యవహారంలో ప్రధాన నిందితుడు అరెస్ట్

ఖమ్మం భూధాన్ భూముల్లో భారీమోసం వెలుగులోకి వచ్చింది. 38 మంది భూధాన్ బాధితుల నుంచి సుమారు 54.13 లక్షలు వసూలు చేసినట్లు ACP కార్యాలయంలో గురువారం ఫిర్యాదు నమోదైంది. ఒక్కొక్కరి నుంచి రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు వసూలు చేసి నకిలీ రసీదులు సృష్టించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు పోలబోయిన ముత్తయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

March 19, 2026 / 07:02 PM IST

వివో భవన నిర్మాణానికి భూమి పూజ

KNR: తిమ్మాపూర్ మండలంలోని మొగిలిపాలెం గ్రామంలో నూతన వివో భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. గ్రామ అభివృద్ధికి ఈ భవనం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

March 19, 2026 / 07:02 PM IST

చలివేంద్రం ప్రారంభించిన ఎస్సై

SRD: వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో దోహదపడతాయని కంగ్టి ఎస్సై దుర్గా రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని దెగులవాడి గ్రామంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక సర్పంచ్ పద్మావతి బసిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ప్రధాన కూడలిలో చలివేంద్రం ఉంటే రహదారిన వెళ్లే వాహనదారులు ఎండలో పనికి వెళ్ళిన వారికి దోహదపడుతుందన్నారు.

March 19, 2026 / 07:01 PM IST

OFFICIAL: ప్రభుత్వ విప్‌గా పెద్దపల్లి ఎమ్మెల్యే

PDPL: తెలంగాణ ప్రభుత్వ విప్‌గా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుండే ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యే సమాచారంతో సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అయింది. అనుకున్నట్టుగానే ప్రభుత్వం ఆయనను విప్‌గా నియమించింది. తనకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.

March 19, 2026 / 07:01 PM IST

తిరుమలలో ఉగాది ఆస్థాన వేడుకలు

TPT: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఆస్థానం నిర్వహించారు. సుప్రభాతం అనంతరం శుద్ధి చేసి శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయంలో ఊరేగింపుగా ప్రవేశించి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు సమర్పించారు. పంచాంగ శ్రవణం నిర్వహించారు. బంగారు వాకిలి వద్ద శాస్తోక్తంగా ఆస్థానం జరిగింది.

March 19, 2026 / 07:00 PM IST