• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పరీక్షకు ఎంత మంది గైర్హాజరు అంటే..!

WNP: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగుతున్నట్లు చీఫ్ సూపర్డెంట్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం తెలిపారు. తొలి రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు మొత్తం 385 మంది విద్యార్థులకు ఘనం 370 మంది హాజరైనట్లు తెలిపారు. మిగతా 15 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. జిల్లాలో అన్ని పరీక్ష కేంద్రాలు నిబంధనల ప్రకారం కొనసాగుతున్నాయి అన్నారు.

February 25, 2026 / 01:26 PM IST

సజావుగా జరిగిన ఇంగ్లీష్ పరీక్షలు

PPM: ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్షలు కొత్తవలస వాగ్దేవి కళాశాలలో బుధవారం సజావుగా జరిగింది. పరీక్షలకు 379 విద్యార్థులు కేటాయించగా, 15 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలకు ఎటువంటి చూసిరాతలకు పాల్పడకుండా ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటుచేశారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు.బయటవారు లోపలికి వెళ్లకుండా పోలీసు గస్తీని ముమ్మరం చేశారు.

February 25, 2026 / 01:26 PM IST

పరీక్షా కేంద్రాల్లో తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

KMR: కామారెడ్డి జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పర్య వేక్షణ, ప్రశ్నాపత్రాల భద్రతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

February 25, 2026 / 01:25 PM IST

జిల్లాలో 1772 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు

BHPL: జిల్లాలో మొదటి రోజు ఇంటర్ ఫస్టియర్ వార్షిక పరీక్షలు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 1,829 మంది విద్యార్థులకు గాను 1,772 మంది పరీక్షలు రాసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకన్న తెలిపారు. 96.88% హాజరు శాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు

February 25, 2026 / 01:25 PM IST

రెండు రోడ్లకు రూ. 98 లక్షలు మంజూరు

కృష్ణా: చల్లపల్లి మండలంలో రెండు ప్రధాన రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి హామీ పథకం నిధులతో నడకుదురు శివారు రాముడుపాలెం ప్రధాన రహదారి బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.49 లక్షలు, నాదెళ్లవారిపాలెం రోడ్డు నిర్మాణానికి రూ. 49 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

February 25, 2026 / 01:25 PM IST

పాల నాణ్యత, పశువుల ఆరోగ్యంపై సమీక్ష

అన్నమయ్య: రామసముద్రం మండలం తిరుమలరెడ్డిలోని అమూల్ డైరీని బుధవారం ఉదయం పశువైద్యాధికారి డాక్టర్ పావని సందర్శించారు. పాల సేకరణ విధానం, నాణ్యత ప్రమాణాలను పరిశీలించి, పాడి పశువుల ఆరోగ్యానికి సకాలంలో టీకాలు, పోషకాహారం అందించాలని రైతులకు సూచించారు. పాల ఉత్పత్తి పెంచి ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.

February 25, 2026 / 01:25 PM IST

ముమ్మరంగా డ్రైనేజీ పారిశుద్ధ్య పనులు

GDWL: అయిజ పట్టణంలోని 1వ వార్డులో బుధవారం డ్రైనేజీల ప్రక్షాళన, పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ చిన్న సురేశ్ ఆదేశాల మేరకు కౌన్సిలర్ తిరుమలేశ్, బీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది వార్డులో నిలిచిపోయిన మురుగు నీటిని తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.

February 25, 2026 / 01:22 PM IST

ఆక్వా రంగాన్ని ఆదుకోవాలి: ఎమ్మెల్యే

W.G: రాష్ట్రంలోని ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కోరారు. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే నిబంధనలు తొలగించి, రైతుందరికీ విద్యుత్ యూనిట్‌ను రూ.1.50కే అందించాలని డిమాండ్ చేశారు. ఎటువంటి షరతులు లేకుండా ఈ రాయితీని తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

February 25, 2026 / 01:22 PM IST

‘బాలలందరినీ బడిలో చేర్పిద్దాం’

MDK: బాలలందరికీ న్యాయం, బాలల ఉజ్వల భవిష్యత్తు కోసం బడిలో చేర్పిద్దామని చేగుంట తహసీల్దార్ శివప్రసాద్ పేర్కొన్నారు. విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రచార రథం ప్రారంభించారు. 2001లో స్థాపించబడి రెండు దశాబ్దాల పైబడి రాష్ట్రంలో అనేక జిల్లాల యందు బాలబాలికలు, స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకంగా పనిచేస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.

February 25, 2026 / 01:21 PM IST

‘ఏకాగ్రతతో చదివి ఉత్తీర్ణత సాధించాలి’

SDPT: హుస్నాబాద్ పట్టణంలోని ఇంటర్మీడియట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు, ప్రోత్సహించేందుకు హుస్నాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ దండి లక్ష్మి కొమురయ్య ఉచితంగా పెన్నులు అందించారు. సమయాన్ని వృథా చేయకుండా, ఏకాగ్రతతో చదివి, మంచి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు.

February 25, 2026 / 01:21 PM IST

నాగర్ కర్నూల్ చేరుకున్న కేటీఆర్

TG: నాగర్ కర్నూల్ జిల్లాలో మాజీమంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కుమ్మెర జాతర ఘటన బాధితుల దీక్షాస్థలికి ఆయన చేరుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే ఈ ఘటనలో మరణించిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కాగా, చిన్నారి మృతి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

February 25, 2026 / 01:20 PM IST

రేపు నగరం SVRM కాలేజీలో మెగా జాబ్ మేళా

BPT: మంత్రి అనగాని సత్యప్రసాద్ సహకారంతో గురువారం నగరం SVRM కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు బుధవారం కళాశాల సెక్రటరీ బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో 22 బహుళజాతి కంపెనీలు పాల్గొంటున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ముందుగా నమోదు చేసుకుని, సర్టిఫికెట్ జిరాక్స్‌లతో హాజరుకావాలని కోరారు.

February 25, 2026 / 01:20 PM IST

ఇసుక ఖనిజాలపై ప్రభుత్వం దృష్టి: మంత్రి కొల్లు

AP: తీర ప్రాంత ఇసుక ఖనిజాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శ్రీకాకుళం నుంచి మచిలీపట్నం వరకు పుష్కలంగా బీచ్ శాండ్ మినరల్ నిక్షేపాలు ఉన్నాయన్నారు. క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ రంగాలకు వనరులుగా బీచ్ శాండ్ మినరల్స్ వనరుగా మారనున్నాయని తెలిపారు. ఖనిజాల శాఖలో పారదర్శకత కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

February 25, 2026 / 01:20 PM IST

వీరబ్రహ్మేంద్రస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనలో రాయల

KMM: ఏదులాపురం మున్సిపాలిటీలోని వెంకటగిరిలో శ్రీ గోవింద మాంబ సమేత జగద్గురు మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శిఖర కలశ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ళ, భక్తులు పాల్గొన్నారు.

February 25, 2026 / 01:18 PM IST

సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన

SDPT: అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరిపల్లిలో లీడ్ బ్యాంకు సహకారంతో సైబర్ మోసాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై అవగాహన నిర్వహించారు. సర్పంచ్ నాగరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో TGB చిట్టాపూర్ బ్యాంకు మేనేజర్ అభినయ్ రెడ్డి మాట్లాడుతూ.. PMSBY, PMJJBY లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 25, 2026 / 01:18 PM IST