AP: మాజీ సీఎం జగన్ ఇవాళ నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన నెల్లూరుకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం తిరుగు పయనమవుతారు.
TG: రాష్ట్రంలో 45 మంది IASలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ స్పెషల్ CSగా సంజయ్ కుమార్, ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీధర్, ఎండోమెంట్ కమిషనర్‌గా హనుమంతరావు, ఫైనాన్స్‌శాఖ సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్, హనుమకొండ కలెక్టర్‌గా చాహత్ బాజ్‌పాయ్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా అంకిత్ బదిలీ అయ్యారు.
VZM: బొబ్బిలి డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న జీ. భవ్యారెడ్డిని అమరావతిలోని DGP కార్యాలయానికి బదిలీ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. 2018 గ్రూప్-1 అధికారులపై వచ్చిన ఆరోపణలపై వాళ్ళందరిని ఆప్రధాన్యత కలిగిన పోస్టులలో ఉంచాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమెను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కడప జిల్లాలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్సీ అభ్యర్థులు ఓబులేసు, హర్షసాయి వర్ధన్‌లకు బుధవారం కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి UPSC ప్రిలిమ్స్ కోచింగ్ కోసం డిజిటల్ ట్యాబ్‌లను అందజేశారు. ఈ ట్యాబ్‌లలో UPSC స్టడీ మెటీరియల్ ముందుగానే ఇన్‌బిల్ట్ చేయబడి ఉంది. ఇది వారి సివిల్స్ ప్రిపరేషన్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
MBNR: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై గట్టి నిఘా పెట్టాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో విద్య పోలీసు ఎక్సైజ్ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హై స్కూల్ ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థుల కార్యకలాపాలపై పర్యవేక్షణ కొనసాగించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
EG: సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి సీతానగరం వరకు గురువారం తారురోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. గత 6,7 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పెద్దపెద్ద గోతులతో గుంతలమయంగా ఉండేదని స్కూల్ విద్యార్థులు, వ్యవసాయ కూలీలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకొనేవారమని స్థానికులు వాపోతున్నారు. ఈ రహదారి అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యే బలరామకృష్ణకి అభినందనలు తెలిపారు.
VKB: జిల్లాలో నేడు ఇంటర్ 2nd ఇయర్ పరీక్షకు 8,006 మంది విద్యార్థులు హాజరుకానునట్లు జిల్లా ఇంటర్ బోర్డు నోడల్ అధికారి తెలిపారు. గురువారం లాంగ్వేజ్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇందుకు 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు.
నాగర్‌కర్నూలు జిల్లా కుమ్మెరలోని మల్లన్న జాతరలో కుల వివక్షతో రజక సంఘం కుటుంబంపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని దొమ్మాట యువకులు అన్నారు. దౌల్తాబాద్ మండలం దొమ్మాటలో యువకులు పసికందు మృతికి నిరసనగా గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
NLR: నెల్లూరు నగరం ఆర్టీసీ డిపో పరిధిలోని బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం కోసం డయల్ యువర్ డీఎం గురువారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు ప్రజలు కాల్ చేసి సలహాలు ఇవ్వడంతో పాటు సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని DM వెంకటేశ్వర్లు సూచించారు. 9959225641 నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు.
AKP: పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్‌కు బదిలీ అయింది. ఆయనను తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేసి మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బుధవారం ఆదేశాలు భారీ చేశారు. ఈ మేరకు ఆయనను ప్రభుత్వం గుంటూరు జిల్లా మంగళగిరి హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
KNR: ప్రయోగాల ద్వారానే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే తత్వం పెరుగుతాయని ఏంఈవో రవీంద్రచారి అన్నారు. సైదాపూర్ మండలం వెన్కేపల్లి హైస్కూల్లో భౌతిక, జీవశాస్త్ర టీచర్స్‌కి ‘బెలూన్ కార్ ఛాలెంజ్’ పై అవగాహన కల్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. ప్రయోగాత్మక బోధనతో పిల్లలు సులభంగా నేర్చుకుంటారన్నారు.
KNRL: ఉమ్మడి జిల్లాలోని పత్తి కొండ RDO భరత్ నాయక్, ఆత్మకూరు RDO దేశిరెడ్డి నాగజ్యోతి బదిలీ అయ్యారు. వీరిని తక్షణమే రిలీవ్ చేయాలని, రిలీవ్ అయిన వెంటనే JADలో రిపోర్టు చేసుకోవాలని జీఓ ఆర్టీ నంబర్ 477ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ విడుదల చేశారు. వీరి స్థానంలో తాత్కాలికంగా ఇతరులను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
TG: వరంగల్ జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతుంది. చెన్నారావుపేట మండలం లింగగిరిగుట్టలలో ఎలుగుబంటి సంచారించడంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఎలుగుబంటి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
NGKL: జిల్లా పదర మండల కేంద్రానికి నేడు పలువురు ఎంపీలు మల్లురవి, అనిల్ కుమార్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, తలసాని శ్రీనివాస్ యాదవ్, నవీన్ యాదవ్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు పర్యటిస్తారని యాదవ సంఘం నేతలు తెలిపారు. గత నాలుగు రోజులుగా పదరలో నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు.
SKLM: మంగళగిరిలోని ఏపీ ఎయిర్ పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రవీణ్ ఆదిత్యని పలాస ఎమ్మెల్యే శిరీష బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పలాసలో నిర్మించునున్న ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిచ్చే అవకాశాలున్నాయని, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే ఆయనకు తెలిపారు.