ELR: వట్లూరులోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు మార్చి 1, 8 తేదీలలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి తెలిపారు. మార్చి 1న 5వ తరగతి, ఇంటర్, ఐఐటీ, నీట్ అభ్యర్థులకు.. మార్చి 8న 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
SKLM: సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురంలో వంశధార నది తీరాన వెలసిన శ్రీ ఉమా కామేశ్వరస్వామి వారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు జి వాసు దేవశర్మ ప్రకటనలో తెలిపారు. అనంతరం మ.12 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించ బడుతుందని పేర్కొన్నారు. భక్తులు పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలన్నారు.
MDK: ఇటీవల ఓ భూ వ్యవహారంలో కోర్టు శిక్ష పడిన వారం రోజులకే మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ బదిలీ కావడం జిల్లాలో చర్చనీయాంశమైంది. రెండేళ్ల క్రితం మెదక్ కలెక్టర్‌గా ఆదిలాబాద్ నుంచి బదిలీపై వచ్చిన విషయం తెలిసిందే. కలెక్టర్‌గా అనేక అంశాల్లో తన మార్క్ చూయించారు. ఇటీవల చేగుంట మండలం బోనాలకు చెందిన భూ వ్యవహారంలో హైకోర్టు ఆరునెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు.
HYD: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీవ ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌ను సందర్శిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు జీఐ టెక్నాలజీతో రూపొందించిన 6 బస్సులను గవర్నర్ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి MGBSలో ప్రారంభిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
NRPT: మార్చి 14 న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని అనివార్య కారణాల వల్ల మార్చి 28 కి వాయిదా వేసినట్లు సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ తెలిపారు. గురువారం నారాయణపేట జిల్లా కోర్టులో పోలీస్, ఎక్సైజ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీ మార్గం ద్వారా కేసులు త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో బీసీ, ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులను నిరసిస్తూ జప్తినాచారంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ.. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో DSP నేత శ్రీకాంత్,గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ADB: ఆదిలాబాద్ రూరల్ ఎస్ఐ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో గురువారం రాణాదివ్వే నగర్ కాలనీలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్, సీట్బెల్ట్ ప్రాధాన్యతను వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు. ప్రమాదాల నివారణలో ప్రతి పౌరుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించి బాధ్యతగా వ్యవహరించాలని ఎస్ఐ కోరారు.
KNR: మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు పర్వం కొనసాగుతున్న వేళ.. పాతతరం విప్లవకారుడు దేవరకొండ సత్యనారాయణ అలియాస్ ‘బుక్క సత్తన్న’ ఆచూకీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం గూడూరుకి చెందిన సత్తన్న, తండ్రి మరణం తర్వాత తల్లితో HZB మండలం చెల్పూర్ చేరారు. ఈ క్రమంలో PDPLలో ITI చదివి, 1975లో అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారో తెలియలేదు.
AP: పారిశ్రామికవేత్తలకు 20 నెలల్లోనే రూ.2 వేల కోట్లకు పైగా ప్రోత్సాహకాలు విడుదల చేసినట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఇందులో SC, ST పారిశ్రామికవేత్తలకు రూ.270 కోట్లు ఇచ్చామన్నారు. ఎవరి జోక్యమూ లేకుండా నేరుగా పారిశ్రామికవేత్తల ఖాతాల్లోనే ప్రోత్సాహకాలు జమయ్యేలా చూస్తున్నామన్నారు. టెండర్లలోSC, STలకు 4 శాతం రిజర్వేషన్ వర్తిపజేస్తున్నామని పేర్కొన్నారు.
HYD: మెట్రోకు రుణాలు ఇచ్చేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFRC) సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోరైల్ సంస్థకు, ఐఆర్ఎఫ్ఆర్సీకి మధ్య ప్రాథమికంగా అవగాహన ఏర్పడినట్లు సమాచారం. ఐఆర్ఎఫ్‌సీ అందజేసే రుణాలకు వడ్డీరేటుపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో గుడుంబా విక్రయిస్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించిన ఎండీ.నూరమ్మ వద్ద సుమారు నాలుగు లీటర్ల గుడుంబా లభ్యమైంది. ఆమెను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.
ఉమ్మడి జిల్లా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాజ్కోట్ – మహబూబ్ నగర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సేవలను రైల్వే శాఖ మార్చి 2026 వరకు పొడిగించింది. రైలు నం.09575 (రాజ్కోట్-మహబూబ్ నగర్)ప్రతి సోమవారం, రైలు నం.09576 (మహబూబ్ నగర్-రాజ్కోట్) ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటాయి.మార్చి నెలలో ఎంపిక చేసిన తేదీల్లో ఈ సర్వీసులు నడుస్తాయని, ప్రయాణికులకు తెలిపారు.
KMM: భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన వారిలో అర్హులను గుర్తిస్తున్నామని, అసలైన బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బాధితులకు ఎక్కడ స్థలం ఉన్న ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. స్థలం లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని స్పష్టం చేశారు. భూదాన్ స్థలాన్ని మోసపూరితంగా అమ్మినవారు జైల్లో ఉంటారని తెలిపారు.
KRNL: ఉలిందకొండ పీఎస్ పరిధిలో 2016లో జరిగిన 8 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితుడు బోయ గిడ్డయ్య(60)కు కర్నూలు 1వ అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి పి.కమలా దేవి జీవిత ఖైదు గురువారం విధించారు. రూ.7,000 జరిమానా, చెల్లించకపోతే అదనంగా 2 నెలలు 15 రోజులు జైలు శిక్ష విధించారు. మరో నిందితుడిని సాక్ష్యాల లోపంతో విముక్తి చేశారు.
E.G: రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం సేవలు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కమిషనర్ VSK చక్రవర్తి తెలిపారు. గురువారం బిక్కవోలులోని ప్రసిద్ధ గోలింగేశ్వర, సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ గణపతి ఆలయాలను ఆయన సందర్శించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో SI రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.