AP: తూ.గో.జిల్లా దేవరపల్లిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. నిందితుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. నిందితుడు గోపాలపురం మండలం గోపవరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
PDPL: రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన మల్యాల రాధమ్మ మృతి అనంతరం కుటుంబ సభ్యులు నేత్రదానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీకాలనీ ఆధ్వర్యంలో సదాశయ ఫౌండేషన్ సహకారంతో ల్యాబ్ టెక్నీషియన్ ప్రదీప్ నేత్రాలను సేకరించారు. కుమారులు శ్రీనివాస్, గణపతి, రాంశంకర్, కృష్ణమూర్తి తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులు అభినందించారు.
ములుగు జిల్లా కేంద్రంలోని దేవాదుల ప్రాజెక్టును ఆదివారం CM రేవంత్ రెడ్డి పరిశీలించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్, దేవాదుల పంప్ హౌస్ వద్ద ఏర్పాట్లను అదనపు కలెక్టర్ మహేందర్ జీ, RDO వెంకటేష్ పరిశీలించారు. భద్రత ఏర్పాట్లను BHPL SP సంకీర్త్ గౌడ్, ఏటూరునాగారం ASP మనన్ భట్ పరవేక్షిస్తున్నారు.
TG: SLBC సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. చివరి చూపు చూసే అవకాశం లేకుండా కార్మికుల కుటుంబాలకు మానసిక క్షోభకు గురి చేసిందన్నారు. మృతదేహాల వెలికితీతలో కానీ సొరంగం పనుల్లో కానీ ఎటువంటి పురోగతి లేకపోవడం రేవంత్ నిర్లక్ష్యానికి, చేతకానితనానికి నిదర్శనమన్నారు.
AP: మాతృభాషా వికాసమే మానవ జాతి ప్రకాశమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు కవుల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అస్తిత్వానికి మాతృభాష సుస్థిరమైన కోట అని తాను బలంగా విశ్వసిస్తానని తెలిపారు. సంస్కృతి, విలువలు, సంప్రదాయాలు అన్నీ భాషతోనే ముడిపడి ఉన్నాయన్నారు.
టీ20 ప్రపంచకప్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. గత ఏడాది కాలంగా అదిరిపోయే ఆరంభాలతో జట్టును ఆదుకున్న అభిషేక్, ఇప్పుడు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. అతడి ఫామ్ లేమి జట్టు బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రేపు సౌతాఫ్రికాతో జరగే సూపర్-8 పోరులోనైనా అభిషేక్ జట్టుకు శుభారంభం అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఏలూరు జిల్లా కోర్టు మానిటరింగ్ పోలీసు సిబ్బందితో ఏఎస్పీ సూర్యచంద్రరావు శనివారం సమీక్ష నిర్వహించారు. మానిటరింగ్ సెల్ ఏర్పాటు తర్వాత 47 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని, అందులో 25 మందికి జీవిత ఖైదు ఖరారైందని ఆయన వెల్లడించారు. ఇదే ఉత్సాహంతో విధులు నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని సిబ్బందిని కోరారు. ఈ సమావేశంలో కోర్టు మానిటరింగ్ సీఐ పాల్గొన్నారు.
అన్నమయ్య: రాయచోటి వైఎస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ ప్రయోజనాలను విస్మరించారని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ఆపివేయడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సరిగా అమలుకావడం లేదని, ఎన్నికల హామీలు నెరవేర్చడం లేదని ఆరోపించారు.
NDL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తాను ఎమ్మెల్యే భూ మా అఖిలప్రియ ఆహ్వానించారు. శనివారం ఆయన కార్యాలయంలో ఆయను మర్యాద పూర్వకంగా కలిసి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు తప్పక రావాలని కోరారు. ఈ సందర్బంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విశిష్టతను ఆయన వివరించారు.
SRD: ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతతతో పాటు జీవితానికి దిశానిర్దేశం ఇస్తాయని మాజీ ఎమ్మెల్యే జైపాల్ రెడ్డి అన్నారు. శనివారం నాగలిగిద్ద మండలం ఔదత్ పూర్‌లోని శ్రీ ఎల్లా లింగేశ్వర స్వామి క్షేత్రాన్ని సందర్శించారు. ఇక్కడ జాతర మహోత్సవాల్లో మచ్చేందర్ నాథ్ మహారాజ్‌ను కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.
TG: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే పంపించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక లాజిస్టిక్స్ సేవలను TGSRTC ఎండీ నాగిరెడ్డి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. రూ.151 చెల్లించి రాములోరి తలంబ్రాలు పొందే అవకాశం కల్పించారు. ఈనెల 23 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
TG: యూత్ కాంగ్రెస్ సభ్యులు తమ అల్ప రాజకీయ నాటకాల కోసం ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను వేదికగా ఎంచుకోవడం అత్యంత విచారకరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి అంతర్జాతీయ వేదికలను నిరసనల కోసం ఉపయోగించడంతో ప్రపంచ దేశాల ముందు మన దేశం ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే, ఎక్కడ ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు.
SDPT: ప్రభుత్వ పథకాలకు రాయతీలు లభించాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి సరూప రాణి అన్నారు. జిల్లా పరిధిలోని రైతులు తమ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా, మీసేవ కేంద్రాలకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అలా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే పంట బీమా, సబ్సిడీలు అందుతాయన్నారు.
TG: సిద్దిపేట జిల్లా జబ్బాపూర్‌లో ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో ప్రైమరీ స్కూల్‌కు యజమాని తాళం వేసిన ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. విద్యాశాఖ నిర్వహణ మరెవ్వరి వల్ల కాదని, అందుకే తన వద్దే పెట్టుకున్నానని పదే పదే చెప్పే రేవంత్ రెడ్డి.. ఈ సంఘటనను చూసి సిగ్గుపడాలని మండిపడ్డారు.
AP: జీఎస్టీ ఎగవేతపై కేంద్ర ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టారు. విశాఖలో రూ.81.25 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించిన కేసులో చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రూ.11.54 కోట్ల జీఎస్టీ ఐటీసీని అక్రమంగా వాడిన కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నకిలీ బిల్లులతో ప్రభుత్వ ఖజానాకు రూ.11.54 కోట్ల నష్టం కలిగించినట్లు గుర్తించారు.