AP: త్వరలోనే మొబైల్‌లోకి ఏఐ డాక్టర్ రాబోతున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘ఆరోగ్యంపై మీకు సలహాలు, సూచనలు ఇవ్వబోతున్నారు. మీ హెల్త్ రికార్డ్ అంతా డిజిటలైజ్ చేయబోతున్నాం. రౌడీయిజం పరాకాష్టకు చేరిన పరిస్థితులు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ నేను కుంగిపోలేదు.. ప్రజల కోసం పోరాడాను’ అని పేర్కొన్నారు.
RR: జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని పామెన శివారులో ఉన్న ఓ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు రూపొందించిన వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రయోగాలు, సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. పునరుత్పాదక శక్తి వనరులు, పర్యావరణ పరిరక్షణ, స్మార్ట్ సిటీ నమూనాలు, సైన్స్ ఆధారిత ఆవిష్కరణలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
E.G: నిడదవోలు మండలంలోని సమిశ్రగూడెం గ్రామంలో శనివారం లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దుర్గేశ్ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. పింఛన్ దారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూటమి ప్రభుత్వం సేవలను అందిస్తోందన్నారు. ఈ నెలలో నిడదవోలు మండలం పరిధిలో సుమారుగా మొత్తం రూ.4,46,20,000 అందజేస్తున్నామని తెలిపారు.
MBNR: బాలానగర్ మండలం నందారంలో నిర్మిస్తున్న మల్లన్న స్వామి ఆలయానికి చెన్నారెడ్డి అనే భక్తుడు రూ.51,116 విరాళంగా అందజేశారు. హిందూ సంప్రదాయాల పరిరక్షణకు ఆలయాల అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
JGL: ధర్మపురి నియోజకవర్గంలోని కిష్టంపేట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో నూతన అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సీడీపీవో మమత, ఎంపీడీవో చిరంజీవి, ఎంపీ ఓ సుష్మ, ఏఈ ప్రసాద్, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల రూరల్ మండలం తక్కలపల్లిలో శ్రీ రేణుకా ఎల్లమ్మ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన, బోనాల పండుగ, పట్నాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. గౌడ సంఘం సభ్యులు, గ్రామ నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. మహిళలు బోనాలు సమర్పించారు.
TG: మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావుకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రూ. 150 కోట్ల విలువైన కోకాపేట్ భూములను.. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రూపాయికే శారదా పీఠానికి ఇచ్చారన్నారు. కోర్ అర్బన్ ఏరియాలో మెట్రో, మూసీ అభివృద్ధి జరగకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
HYD: రేంజ్ మారిపోతోంది బాబోయ్! 765 చదరపు కిలోమీటర్ల భారీ విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ‘ఫ్యూచర్ సిటీʼకి సర్కార్ డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. కేవలం 9 నెలల్లోనే పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని టెండర్‌లో స్పష్టం చేసింది. 56 గ్రామాలను కలుపుతూ గ్లోబల్ కంపెనీలు, యూనివర్సిటీలే లక్ష్యంగా ఈ నగరం నిర్మిస్తున్నారు.
SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఫూట్ బాల్ ఆడటానికి, విలాసవంతమైన కార్యాలయం కట్టుకోవడానికి పైసలు ఉంటాయి కానీ, రైతులకు రైతుబంధు ఇవ్వడానికి డబ్బులు లేవా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
హిందీ నిర్మాత దీపక్ ముకుత్ త్వరలో ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. బాబీ డియోల్, అభిషేక్ బచ్చన్ కాంబోలో ‘దో ఔర్ దో పాంచ్’ సినిమాను రీమేక్ చేయాలని ఆయన పదేళ్లుగా భావిస్తున్నాడట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ ఇద్దరు హీరోల క్రేజీ కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
NGKL: ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. జాతీయ స్థాయిలో పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి ఆయనకు అవకాశం ఇవ్వాలని పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. త్వరలో రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఖమ్మం జిల్లాలో ఉన్న గిరిజన అభివృద్ధి శాఖ (ఏటీడీవో) కార్యాలయాలను తక్షణమే కలెక్టరేట్ కార్యాలయంలోకి మార్చాలని PDSU జిల్లా అధ్యక్షులు గోకినపల్లి మస్తాన్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం ఆ శాఖ డిడి విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో 30 వసతిగృహాలు ఉండగా, ఏటీడీవోలు హాస్టళ్లను సందర్శించకుండా కేవలం కార్యాలయాలకే పరిమితమవుతున్నారని వివరించారు.
BDK: అశ్వాపురం మండలం, ఆనందపురం గ్రామంలో గిరిజనులకు చెందిన 4 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని సర్పంచ్ ముర్రం సమ్మయ్య ఆరోపించారు. భూములపై ప్రశ్నించినందుకు తమపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఉన్నతాధికారులను కలిసి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
HNK: పరకాల మున్సిపాలిటీ 20వ వార్డుకు చెందిన జీత్ కౌర్ ఇటీవల మరణించగా నేడు వారి కుటుంబ సభ్యులను బీజేపీ పరకాల పట్టణ కార్యదర్శి పాలకుర్తి తిరుపతి పరామర్శించి బియ్యం అందజేశారు. 20వ వార్డు పరిధిలోని ప్రజలకు అనునిత్యం అండగా ఉంటూ.. వారి సమస్యల పరిష్కారమే ప్రార్థన లక్ష్యంగా పనిచేస్తానని తిరుపతి తెలిపారు
VKB: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తహశీల్దార్ వెంకటేశ్ ప్రసాద్ ఆదేశించారు. శనివారం పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో మర్యాదగా నడుచుకుంటూ వైద్య సేవలు అందించాలని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా సేవలందించాలని సూచించారు.