BHNG: 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఇక్కడ ఇప్పటివరకు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన హన్మంతరావు దేవదాయ శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
MLG: ఇందిరమ్మ ఇళ్లును త్వరగా పూర్తిచేయాలని మంత్రి సీతక్క అన్నారు. మేడారంలో పలు అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లును పూర్తి చేసి లబ్దిదారులతో గృహ ప్రవేశాలు నిర్వహించాలని, నిర్మాణం పూర్తయిన ఇళ్లుకు డబ్బులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.
ADB: బోథ్ మండల కేంద్రంలో మహిళా సమైక్య గోడౌన్ నిర్మాణానికి MLA అనిల్ జాదవ్ గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని అన్నారు. ప్రభుత్వ పథకాలను మహిళా సమైక్య సంఘాలు సభ్యులు తీసుకోవాలని కోరారు.
KNR: కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై హుజూరాబాద్ కేసీ క్యాంపు సమీపంలో గురువారం పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా నుంచి బల్లార్షాకు కర్రల లోడ్‌తో వెళ్తున్న లారీ డ్రైవర్‌కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో వాహనం అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టును, బైక్‌ను ఢీకొంటూ నేరుగా ఫర్నిచర్ షాపులోకి దూసుకెళ్లింది. ఇందులో ఎవరికి గాయాలు కాలేదు.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో ఉగాండా మాజీ హెడ్ కోచ్ అభయ్ శర్మను LSG నియమించుకుంది. అభయ్ శర్మ 2018లో భారత అండర్-19 జట్టుతో కలిసి పనిచేశాడు. భారత్ తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 89 మ్యాచ్‌లు ఆడి 4105 పరుగులు చేశాడు.
ASR: అమరావతిలో GCC ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిను కలిసి సంస్థలో సిబ్బంది కొరత, పరిపాలనా సమస్యలపై ఇవాళ వినతిపత్రం సమర్పించారు. మార్కెటింగ్, ట్రాన్స్‌పోర్ట్, ఇంజినీరింగ్, ఫైనాన్స్ విభాగాల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. గిరిజన రైతుల నుంచి కాఫీ కొనుగోలుకు అదనపు నిధులు మంజూరు చేయాలని కోరారు.
MDK: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోగొట్టుకున్న ఫోన్‌ను టేక్మాల్ పోలీసులు రికవరీ చేసి బాధితుడికి అందజేశారు. మండల పరిధిలో ఓ వ్యక్తి తన ఫోన్ పోగొట్టుకోగా, బాధితుడు ఇచ్చిన IMEI నంబర్, CEIR పోర్టల్ ఆధారంగా పోలీసులు ఫోన్ ఆచూకీని ట్రేస్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఫోన్‌ను రికార్డుల పరిశీలన అనంతరం యజమానికి అప్పగించారు.
MDK: నర్సాపూర్ బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గడ్డం రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై నీలం మధు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీలు మారుతూ నీలం మధు బీసీలకు అన్యాయం చేశారని ఆరోపించారు. రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎంపీకి మద్దతు ప్రకటించారు.
BHPL: మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, తరగతి గదుల సౌకర్యాలు, భోజన వసతులు, ఆరోగ్యం, శుభ్రత వంటి అంశాలను సమీక్షించారు. తనిఖీ అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారితో సంభాషించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు.
TG: ఖమ్మం భూదాన్ భూముల్లో కూల్చివేతలు అన్యాయం అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చడమే తప్ప పేదలకు గజం భూమి ఇవ్వలేదన్నారు. మూసీ సుందరీకరణ పేరిట అపార్ట్ మెంట్లు కూల్చొద్దని డిమాండ్ చేశారు.
W.G: తణుకులోని పాల కేంద్రాలతోపాటు డైరీ ఫార్మ్స్‌పై గురువారం అధికారులు దాడులు నిర్వహించారు. ఇటీవల రాజమహేంద్రవరంలో కల్తీ పాలు కారణంగా ఆరుగురు మృతి చెందటంతో జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీధర్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి శంకర్, తణుకు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తనిఖీలు చేసి నమూనాలు సేకరించారు.
JN: పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో సీఎస్ఆర్ నిధులతో కంప్యూటర్లను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఎంపీ కడియం కావ్య పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. విద్యారంగ బలోపేతానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తుందని, విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
AP: ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షం క్రెడిట్ చోరీ చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘గతంలో నీళ్లు రాకుండా రిబ్బన్ కట్ చేశారు. మా కుప్పంకు కూడా నీళ్లు ఇస్తామన్నారు. పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు దేశంలో మరెక్కడా ఉండదు. పుష్కరాల ముందే పోలవరాన్ని పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్రలో అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలో చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేస్తాం’ అని తెలిపారు.
AKP: వరదలు వస్తే పంట పొలాలకు నష్టం కలగకుండా రాంబిల్లి మండలంలో శారదా నది గుట్లును పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ విజ్ఞప్తి చేశారు. గురువారం శాసనసభలో మాట్లాడుతూ.. అల్లూరి జిల్లా, ఒడిస్సాలో ఎక్కడ వర్షం పడినా శారదా నది ఉధృతంగా ప్రవహిస్తూ రాంబిల్లి సముద్రంలో కలుసుకుందన్నారు. దీనివల్ల వరద ముప్పు ఏర్పడుతుందన్నారు.
RR: చంపాపేట్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న మీటర్ రీడర్లు 30 రోజుల పూర్తి పని కల్పించాలని డిమాండ్ చేశారు. రీడింగ్ అనంతరం పని దినాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు తక్షణం స్పందించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. సమస్యలపై స్పందన రాకపోతే ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.