• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

WNP: జిల్లాలోని అన్ని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవసరమైన అన్ని సౌకర్యాలను విద్యార్థులకు కల్పించాలని అధికారులకు సూచించారు.

February 25, 2026 / 12:43 PM IST

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు: కలెక్టర్ రాజర్షి షా

ADB: ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ కలిసి సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును, గదుల్లో సౌకర్యాలను వారు స్వయంగా పరిశీలించారు.

February 25, 2026 / 12:43 PM IST

HPCLలో భారీగా ఉద్యోగాలు

ప్రముఖ ప్రభుత్వ సంస్థ HPCLలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ (ఇంజినీరింగ్ స్ట్రీమ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 250 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.hindustanpetroleum.comను సంప్రదించండి.

February 25, 2026 / 12:42 PM IST

‘జనసేన సభ్యత్వం విజయవంత చేయాలి’

 ప్రకాశం: రేపటి నుంచి 12 రోజులపాటు జరిగే జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎర్రగొండపాలెం జనసేన నాయకుడు పాకనాటి పృథ్వీరాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలకు అండగా ఉండడమే పవన్ ఆశయమని, సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు పార్టీ తరఫున ప్రమాద బీమా రక్షణగా ఉంటుందన్నారు.

February 25, 2026 / 12:42 PM IST

ఒక్క గైర్హాజరు లేకుండా ఇంటర్ పరీక్షలు పూర్తి

JN: కొడకండ్ల మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 244 మంది విద్యార్థులు నమోదు కాగా, అందరూ హాజరయ్యారు. ఒక్క విద్యార్థి కూడా గైర్హాజరు కాలేదు. పరీక్షా కేంద్రంలో కట్టుదిట్టమైన పర్యవేక్షణతో పాటు అవసరమైన సౌకర్యాలు అధికారులు ఏర్పాటు చేశారు.

February 25, 2026 / 12:42 PM IST

BREAKING: హైకోర్టుకు బాంబు బెదిరింపు

TG: రాష్ట్ర హైకోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన హెచ్చరికతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సాయంతో కోర్టు ప్రాంగణంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. నాంపల్లి సీబీఐ కోర్టుకు కూడా ఇలాంటి బెదిరింపు రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటీవల వరుసగా వస్తున్న ఈ నకిలీ బాంబు బెదిరింపులు న్యాయవాదులు, సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

February 25, 2026 / 12:38 PM IST

ఇంటర్ పరీక్షలకు 197 మంది విద్యార్థులు హాజరు

NRPT: మరికల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 204 మంది విద్యార్థులకు గాను 197 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 7 మంది విద్యార్థులు పరీక్షకు గైహాజరైనట్టు ప్రిన్సిపల్ నాగమణి మాల తెలిపారు. పరీక్షల సందర్భంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు.

February 25, 2026 / 12:38 PM IST

సర్వేలను వేగవంతం చేయాలి: ఎంపీడీవో

బాపట్ల: కర్లపాలెం మండలంలోని అన్ని గ్రామాల్లో జరుగుతున్న సర్వేలను వేగవంతం చేయాలని ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు ఆదేశించారు. ఆయన చింతాయపాలెం, కర్లపాలెం పంచాయతీల్లో బుధవారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న సర్వేల తీరును పరిశీలించారు. సర్వేల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా పంచాయతీ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.

February 25, 2026 / 12:37 PM IST

రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖ లైన్‌మెన్ మృతి

PLD: నకరికల్లు మండలం అడ్డరోడ్డు వారిగూడెం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజారావు అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. గుండుపల్లి గ్రామంలో జూనియర్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న ఆయన, విధులకు వెళ్తుండగా బైక్ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. రాజారావు మరణవార్తతో నకరికల్లు విద్యుత్ శాఖలో మరియు ఆయన స్వగ్రామంలో విషాదం నెలకొంది.

February 25, 2026 / 12:36 PM IST

ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన ప్రదీప్!

దర్శకుడిగా, హీరోగా సత్తా చాటిన తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. తాజాగా ఆయన సొంత ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసినట్లు సమాచారం. తన బ్యానర్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాను రూపొందించనున్నాడట. ఇందులో నటి మమితా బైజు ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

February 25, 2026 / 12:36 PM IST

‘విద్యార్థుల కోసం ఎక్కడైనా బస్సు నిలపాలి’

KMR: ఇంటర్, పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కామారెడ్డి, బాన్సువాడ డిపోల పరిధిలో విద్యార్థులు చెయ్యి ఎత్తిన చోట బస్సు ఆపాలని డిపో మేనేజర్లు డ్రైవర్లను ఆదేశించారు. మార్చి 16 వరకు ఇంటర్, ఏప్రిల్ 7 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ఈ వెసులుబాటు కల్పించారు.

February 25, 2026 / 12:35 PM IST

‘ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి’

PPM: పార్వతీపురం మన్యం జిల్లాను విశాఖ ఎకనామిక్ కారిడార్‌లో కలపడం అత్యంత ఆనందదాయకమని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర హర్షం వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. పార్వతీపురంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతుల అభివృద్ధికి దోహదపడాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. పార్వతీపురంలో వ్యవసాయ ఉత్పత్తులకు అనేక అవకాశాలు ఉన్నాయన్నారు.

February 25, 2026 / 12:35 PM IST

గ్రీన్ టీతో బెల్లీ ఫ్యాట్‌ తగ్గుతుందా?

గ్రీన్ టీ బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే కాటెచిన్స్, కెఫీన్ మెటబాలిజంను వేగవంతం చేసి, కొవ్వును కరిగించడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, కేవలం గ్రీన్ టీ తాగడం వల్ల మాత్రమే బరువు తగ్గరు. దీంతో పాటు సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

February 25, 2026 / 12:34 PM IST

MCA మొదటి సెమిస్టర్ పరీక్షలు రీషెడ్యూల్

WGL: కాకతీయ యూనివర్సిటీలో వాయిదా పడిన MCA మొదటి సెమిస్టర్ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్ వెల్లడించారు. మొదటి పేపర్ మార్చి 6న, రెండవ పేపర్ మార్చి 9న, మూడవ పేపర్ మార్చి 11న, నాలుగవ పేపర్ మార్చి 13న, ఐదవ పేపర్ మార్చి 17న నిర్వహించనున్నారు. పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి.

February 25, 2026 / 12:33 PM IST

మహిళా సమైక్య భవనానికి భూమిపూజ

MDK: నర్సాపూర్ ఇన్‌ఛార్జి ఆవుల రాజిరెడ్డి బుధవారం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సికింద్లాపూర్ గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఆయన మహిళల సాధికారత, ఆర్థిక స్వాలంబన కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

February 25, 2026 / 12:33 PM IST