PLD: నకరికల్లు మండలం అడ్డరోడ్డు వారిగూడెం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజారావు అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. గుండుపల్లి గ్రామంలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్న ఆయన, విధులకు వెళ్తుండగా బైక్ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. రాజారావు మరణవార్తతో నకరికల్లు విద్యుత్ శాఖలో మరియు ఆయన స్వగ్రామంలో విషాదం నెలకొంది.