• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

BIG NEWS: విద్యార్థులకు గుడ్‌న్యూస్

TG: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈనెల 16 నుంచి వచ్చే నెల 23వ తేదీ వరకు హాఫ్ డే స్కూల్స్ నిర్వహించాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. రోజురోజుకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు హాఫ్ డే స్కూల్స్ పెట్టాలని నిర్ణయించింది.

March 12, 2026 / 01:53 PM IST

7,200mAh బ్యాటరీతో ఐకూ Z11x 5G

చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ వివో సబ్ బ్రాండ్ ఐకూ దేశీయ మార్కెట్‌లో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఐకూ Z11కు కొనసాగింపుగా iQOO Z11x 5G పేరిట విడుదల చేసింది. ఐకూ Z11x 5G మూడు వేరియంట్లలో లభిస్తుంది. బేస్‌ వేరియంట్‌ 6GB+128GB ధర రూ.18,999, 8GB+128GB వేరియంట్‌ ధర రూ.20,999, 8GB+256GB వేరియంట్‌ ధర రూ.22,999గా కంపెనీ నిర్ణయించింది.

March 12, 2026 / 01:48 PM IST

బామర్ లారీలో ఉద్యోగాలు.. రేపే లాస్ట్

బామర్ లారీ అండ్ కో లిమిటెడ్‌లో 28 పోస్టులకు అప్లికేషన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. మేనేజర్, ఆఫీసర్ పోస్టులు ఉండగా.. MTM/MBA/ఇంజినీరింగ్ డిగ్రీ, MCA/BCA/BTech/డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు దరఖాస్తుకు అర్హులు. స్క్రీనింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. సైట్: balmerlawrie.com

March 12, 2026 / 12:38 PM IST

ALERT: బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా 124 ఖాళీలు భర్తీ కానున్నాయి. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి మార్చి 15 వరకు గడువు ఉంది.

March 12, 2026 / 11:51 AM IST

ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి రూపాయి విలువ

భారత కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న చమురు సంక్షోభం ప్రభావంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో రూ.92.35కు చేరింది. ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో డాలర్‌కు డిమాండ్ పెరిగి, రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. విదేశీ పెట్టుబడులు తరలిపోవడం కూడా ఈ పతనానికి కారణమైంది.

March 12, 2026 / 10:56 AM IST

రూ.6 వేల లోపు బెస్ట్ ఎయిర్ కూలర్లు ఇవే!

వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి ఏసీనే అక్కర్లేదు. రూ.6 వేల బడ్జెట్‌లోనే బెస్ట్ ఎయిర్ కూలర్లు లభిస్తున్నాయి. బజాజ్ PX 97 టార్క్, క్రాంప్టన్ జెనీ నియో తక్కువ విద్యుత్తును వాడుతూ చిన్న గదులను చల్లబరుస్తాయి. సింఫనీ ఐస్ క్యూబ్ 27 లీటర్ల ట్యాంక్‌తో వస్తుంది. ఓరియంట్ స్మార్ట్‌కూల్ Dx, హావెల్స్ ఫ్రెడ్డో ఐ మోడళ్లు హనీకోంబ్ ప్యాడ్‌లతో అద్భుతమైన కూలింగ్ ఇస్తాయి.

March 12, 2026 / 10:00 AM IST

BREAKING: రూ. 10 వేలు తగ్గిన ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,090 తగ్గి రూ.1,62,220కు చేరగా, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.1,000 తగ్గి రూ.1,48,700గా నమోదైంది. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.10,000 తగ్గి రూ.2,90,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

March 12, 2026 / 09:51 AM IST

ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

TG: ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 10 లోపు ఫలితాలను విడుదల చేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. వీలైతే ఏప్రిల్ 4, 5 తేదీల్లోనే ప్రకటించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాల్యుయేషన్‌లో ఏవైనా సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైతే మరో 2 నుంచి 3 రోజులు పట్టే అవకాశం ఉంది.

March 12, 2026 / 08:09 AM IST

ALERT: నేడే ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

గుంటూరు ANUలో ఇవాళ AP, ఈనెల 15న TG అభ్యర్థులకు ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయులో ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. 2005 జూలై 2 నుంచి 2009 JAN 2 మధ్య జన్మించిన యువకులు అర్హులు. ఇంటర్/రెండేళ్ల ఒకేషనల్ కోర్సు లేదా మూడేళ్ల డిప్లొమా ఇంజినీరింగ్ పాసై ఉండాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు, 6 జిరాక్స్ కాపీలు, ఆధార్, 10 పాస్ పోర్టు ఫొటోలతో ANUకు చేరుకోవాలి.

March 12, 2026 / 07:26 AM IST

IIT మద్రాస్‌లో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్

ఒప్పంద ప్రాతిపదికన IIT మద్రాస్‌లో 3 సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇవాళ్టితో ముగియనుంది. BE/BTechలో ఉత్తీర్ణతతో పాటు సప్లై డిజైన్, మాగ్నెటిక్ కాంపోనెంట్ డిజైన్ PCB లేఔట్ తయారీలో నైపుణ్యం గలవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు కనీస జీతం రూ.లక్ష.  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

March 12, 2026 / 07:17 AM IST

AIIMSలో 64 ఫ్యాకల్టీ పోస్టులు.. అప్లై చేశారా?

AIIMS గువహటి 64 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఫ్రొఫెసర్, అడిషనల్ ఫ్రొఫెసర్, అసోసియేట్ ఫ్రొఫెసర్, అసిస్టెంట్ ఫ్రొఫెసర్ పోస్టులు ఉండగా.. MD/MS/DM/MChలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు ఈ నెల 23 వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ.1,01,500-1,68,900 జీతం ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.1500. SC/ST/PwBD/మహిళలకు ఫీజు లేదు.

March 12, 2026 / 06:36 AM IST

ఇకపై ఇంటర్నెట్ లేకపోయినా చెల్లింపులు

TG: హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం ఫిన్‌టెక్ సంస్థ ఫోన్ పే రూపే ఆన్-ది-గో కార్డును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కార్డు ద్వారా ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా.. ఎలాంటి ఆటంకాలు లేకుండా చెల్లింపులు చేసుకోవచ్చు. దీనిని హైదరాబాద్ మెట్రో టికెట్ కౌంటర్ల వద్ద విక్రయించవచ్చు. ఈ కార్డులో గరిష్టంగా రూ.2000 వరకు బ్యాలెన్స్ వేసుకోవచ్చు. ఒకేసారి రూ.500 వరకు లావాదేవీలు చేసుకోవచ్చు.

March 12, 2026 / 03:45 AM IST

అమెరికాలో రిలయన్స్‌ తొలి రిఫైనరీ

అమెరికాలో రిలయన్స్ తన తొలి రిఫైనరీని నిర్మించనుంది. ఈ మేరకు US ప్రభుత్వంతో రిలయన్స్ ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ ప్రకారం 125 బిలయన్ డాలర్ల విలువైన 1.2 మిలియన్ బ్యారెళ్ల అమెరికా లైట్ షెల్ చమురును కొనుగోలు చేసి ప్రాసెస్ చేయనుంది. రోజుకు 18.4 మి బ్యారెళ్లను ప్రాసెస్ చేసేలా రిఫైనరీని నిర్మించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

March 12, 2026 / 03:30 AM IST

ఐటెల్ జెనో 100 లాంచ్

టెక్ బ్రాండ్ ఐటెల్  కొత్త బడ్జెట్ ఫోన్ ఐటెల్ జెనో 100ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ మిలిటరీ-గ్రేడ్ ఫోన్ 1.2 మీటర్ల ఎత్తు నుండి కిందపడ్డ పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. అంతేకాదు నెట్‌వర్క్ లేకుండా కూడా కాల్స్ చేయవచ్చు. కంపెనీ ఈ ఫోన్లో 5000mAh బ్యాటరీ అందించింది. Itel Zeno 100 భారతదేశంలో 2 వేరియంట్లలో వస్తుంది.

March 11, 2026 / 06:59 PM IST

‘కవచ్‌’ యాక్టివేషన్ ఎలాగంటే? 

* 18001801503 లేదా 1500 నంబర్‌కు కాల్‌ చేయండి.* కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ను కవచ్‌ ఫీచర్‌ యాక్టివేట్‌ చేయాలని అడగండి.* వారు మీకు 10 అంకెల తాత్కాలిక నంబర్‌ ఇస్తారు.* మీఫోన్‌ రీఛార్జి కోసం ఈ తాత్కాలిక నంబర్‌ను వాడండి.* BSNL సెల్ఫ్‌ కేర్‌ యాప్‌ ద్వారా కూడా పొందవచ్చు.

March 11, 2026 / 06:14 PM IST