• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

IRCONలో ఉద్యోగాలు.. గడువు ముగుస్తోంది

ప్రభుత్వరంగ సంస్థ IRCONలో 13 వర్క్స్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఎల్లుండి(MAR 13)తో ముగియనుంది. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ గల 30 ఏళ్లలోపువారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ వివరాలతో నింపి, గెజిటెడ్ సంతకం ఉన్న ధ్రువపత్రాల కాపీలను జతచేసి ఢిల్లీలోని ICRON కార్యాలయానికి ఈ నెల 20 లోపు పోస్ట్ చేయాలి. ప్రారంభ జీతం రూ.36 వేలు(ఏటా 5% ఇంక్రిమెంట్.

March 11, 2026 / 02:34 PM IST

RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. రేపే లాస్ట్

ప్రభుత్వ రంగ సంస్థ RITES లిమిటెడ్‌లో 3 డైనమిక్ ప్రొఫెషనల్స్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి గడువు రేపటితో ముగియనుది. డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభం గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 ఏళ్లు కాగా నెలకు రూ.40,000-1,40,000 జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

March 11, 2026 / 01:39 PM IST

6 దశాబ్ధాలలో 100 రెట్లు పెరిగిన ధరలు!

దేశంలో డొమెస్టిక్ LPG సిలిండర్ ధరలు 60 ఏళ్లలో భారీగా పెరిగాయి. 1960లో కేవలం రూ.7 నుంచి రూ.10 మధ్య ఉన్న ధర 2026 నాటికి ఢిల్లీలో రూ.913కు చేరింది. 1990లో రూ.120, 2010లో రూ.400గా ఉన్న ధర ఇవాళ సామాన్యుడిపై భారంగా మారింది. అంతర్జాతీయ ఇంధన ధరల మార్పులు, మారుతున్న సబ్సిడీ విధానాలు, ద్రవ్యోల్బణం కారణంగానే ఈ పెరుగుదల కనిపిస్తోంది.

March 11, 2026 / 10:45 AM IST

నల్గొండ GMCలో ఫ్యాకల్టీ పోస్టులు.. అప్లై చేశారా?

నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీ(GMC)లో 62 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఫ్రొఫెసర్, అసిస్టెంట్ ఫ్రొఫెసర్ తదితర పోస్టులు ఉండగా.. MD/MS/DNB/NMC రూల్స్ ప్రకారం అర్హత, TG మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ గలవారు అర్హులు. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఎంపికైన వారంలోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ నెల 16న ప్రిన్సిపాల్ ఛాంబర్‌లో ఇంటర్వ్యూ ఉంటుంది.

March 11, 2026 / 09:58 AM IST

BREAKING: పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.930 పెరిగి రూ.1,63,310కు చేరగా.. ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.850 పెరిగి రూ.1,49,700గా పలుకుతోంది. మరోవైపు వెండి ధర కిలోపై రూ.100 పెరిగి రూ.3,00,100కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

March 11, 2026 / 09:36 AM IST

ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం!

TG: ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దందా అరికట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. దీని కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ఈనెల 16 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసింది. అందులో ప్రధానంగా ఫీజుల నియంత్రణపై ఉన్నట్లు సమాచారం.

March 11, 2026 / 08:55 AM IST

భారీ జీతంలో NHAI ఉద్యోగాలు.. అప్లై చేశారా?

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో 3 జాయింట్ అడ్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి ఇవాళే ఆఖరు రోజు. డిగ్రీ ఉత్తీర్ణత, పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 65 ఏళ్లు కాగా ఎంపికైనవారికి నెలకు రూ.1,75,000 జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

March 11, 2026 / 07:45 AM IST

గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

సత్యసాయి: పరిగి మండలంలోని కొడిగెనహళ్లి గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ నరేంద్ర తెలిపారు. 5వ తరగతి, ఇంటర్‌లో చేరాలనుకునే విద్యార్థులు ఈనెల 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 24న నిర్వహించే ప్రవేశ పరీక్ష మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు.

March 11, 2026 / 07:30 AM IST

APPLY NOW: SBIలో 116 ఉద్యోగాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లోని ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(IS) ఆడిట్ ఇంటర్నల్ ఆడిట్ విభాగాల్లో 116 పోస్టులకు అప్లికేషన్ గడువు ఈ రోజుతో ముగియనుంది. 12 అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, 104 డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఉండగా.. BE/BTech/CAలో ఉత్తీర్ణత, ఉద్యోగానుభవం గలవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. UR/EW/OBCలకు పరీక్ష ఫీజు రూ.750. SC/ST/PwBDలకు ఫీజు లేదు.

March 11, 2026 / 06:54 AM IST

సత్తా చాటిన టీవీఎస్, బజాజ్

ఈవీ స్కూటర్ల మార్కెట్‌లో టీవీఎస్, బజాజ్ సత్తా చాటాయి. ఫిబ్రవరి నెలలో టీవీఎస్ మోటార్స్ 31,600 యునిట్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ సంఖ్య 67 శాతం అధికం. అలాగే గత నెలలో బజాజ్ ఆటోకి చెందిన 25,323 యూనిట్లు, ఏథర్ ఎనర్జీకి చెందిన 20,581 యూనిట్లు, మోటోకార్ప్‌కు చెందిన 12,512 యూనిట్లు, గ్రీవ్స్ ఎలక్ట్రిక్‌కి చెందిన 4,725 యూనిట్లు అమ్ముడయ్యాయి.

March 11, 2026 / 04:55 AM IST

6,300mAh బ్యాటరీతో పోకో ఫోన్

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ పోకో.. సీ85x 5G పేరిట స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత  హైపర్ ఓఎస్ 3, 6.9 అంగుళాల డిస్ ప్లే, 120Hz, వెనక వైపు 32 MP డ్యుయెల్ కెమెరా, 08 MP సెల్ఫీ కెమెరా, 6,300mah బ్యాటరీ, IP52 రేటింగ్‌తో వస్తుంది. 4GB+64GB వేరియంట్ ధరను రూ.10,999గా కంపెనీ నిర్ణయించింది.

March 11, 2026 / 04:40 AM IST

LPG కొర‌త‌…ఉపాధి కోల్పోనున్న‌ ఫుడ్ డెలివ‌రీ బాయ్స్ !

దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ కొరతతో బెంగళూరులో హోటల్స్, రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. దీంతో స్విగ్గీ, జొమాటోలకు నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తుంది. హోటల్స్ మూసివేయడంతో ఆయా ప్లాట్ ఫామ్స్‌లకు ఆర్డర్లు తగ్గే అవకాశం ఉంది. తద్వారా పని చేసే ఫుడ్ డెలివరీ బాయ్స్ ఉపాధి తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 11, 2026 / 04:10 AM IST

మ్యూచువల్‌ ఫండ్లలోకి పెరిగిన పెట్టుబడులు

యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నా.. భారత మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడులు కొనసాగుతున్నాయి. FEBలో ఈక్విటీ ఫండ్లలోకి నికరంగా రూ.25,978 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జనవరితో పోలిస్తే ఈ మొత్తం 8 శాతం అధికమని భారతీయ మ్యూచువల్ ఫండ్ల సంఘం తెలిపింది. అదే సమయంలో SIPలో జనవరిలో రూ.31 వేల కోట్ల పెట్టుబడులు రాగా.. ఫిబ్రవరిలో రూ.29,845 కోట్లకే పరిమితమయ్యాయి.

March 11, 2026 / 03:55 AM IST

LPG కొరత.. మొబైల్స్, ఇంటర్నెట్ సేవలపై ప్రభావం!

LPG కొరత మొబైల్స్, ఇంటర్నెట్ సేవలపై కూడా తీవ్ర ప్రమాదం పడనుంది. టెలికాం టవర్ తయారీ సంస్థలకు గ్యాస్ సప్లై ఆగిపోవడమే ఇందుకు కారణమని సమాచారం. టెలికాం టవర్లు తుప్పు పట్టకుండా తయారీ సమయంలో జింక్‌తో వేసే రక్షణ పొరకోసం LPGని వాడతారు. అయితే LPG కొరతతో ఈ ఆపరేషన్స్ నిలిపివేయాలని ప్రొడక్షన్ కంపెనీలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే నెట్ వర్క్ కనెక్టివిటీ తగ్గే ప్రమాదం ఉంది.

March 11, 2026 / 03:10 AM IST

FDIల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

సరిహద్దు దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సహా మిగిలిన సరిహద్దు దేశాల FDIల విషయంలో ఉన్న నిబంధనలను సులభతరం చేసింది. ఇప్పటివరకు ఉన్న ‘ముందస్తు అనుమతి’ నిబంధనను తొలగించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఏ రంగంలో పెట్టుబడులు పెట్టాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి. తాజాగా దీన్ని తొలగించారు.

March 10, 2026 / 10:22 PM IST