• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

వంటనూనె ధరకు రెక్కలు.. సామాన్యుడికి చుక్కలు!

పశ్చిమాసియా యుద్ధం కారణంగా వంటనూనెల దిగుమతులు నిలిచిపోయి ధరలు భారీగా పెరిగాయి. పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్‌పై రూ. 15-20 వరకు అదనపు భారం పడింది. హర్మూజ్ జలసంధి మూసివేతతో సరఫరా ఆలస్యమవుతోంది. అర్జెంటీనా, ఉక్రెయిన్ వంటి దేశాల నుంచి దిగుమతులు తగ్గడంతో రాబోయే రోజుల్లో నిత్యవసరాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

March 13, 2026 / 02:25 PM IST

హౌరా వరకు కొత్త రైలును మంజూరు చేయాలని వినతి

ASF: సిర్పూర్ MLA హరీశ్ బాబు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను శుక్రవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. చర్లపల్లి-కాగజ్ నగర్ -నాగపూర్ మీదుగా హౌరా వరకు కొత్త రైలును మంజూరు చేయాలని కోరారు. కాగజ్ నగర్, చంద్రాపూర్ ప్రాంతాల్లోని బెంగాలీ ప్రజలకు ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. రైల్వే బోర్డు ఛైర్మన్ సతీశ్ కుమార్‌కు ప్రతిపాదనలు అందజేశారు.

March 13, 2026 / 02:02 PM IST

త్వరలో 17 వేల పోలీస్ ఉద్యోగాలు!

TG: పోలీసు శాఖలో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి సుమారు 17 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,369 మంది పోలీసులు పనిచేస్తుండగా, మంజూరైన పోస్టులు 95,361 ఉన్నాయి. ప్రతి ఏటా వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అవుతుండటంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. వీటి భర్తీకి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికను పంపించినట్లు సమాచారం.

March 13, 2026 / 11:22 AM IST

రికార్డ్‌ స్థాయిలో పతనమైన రూపాయి విలువ..!

భారత కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న చమురు సంక్షోభం ప్రభావంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో రూ.92.42కు చేరింది. ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో డాలర్‌కు డిమాండ్ పెరిగి, రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. విదేశీ పెట్టుబడులు తరలిపోవడం కూడా ఈ పతనానికి కారణమైంది.

March 13, 2026 / 11:13 AM IST

టెన్త్ అర్హతతో IOCLలో 473 ఉద్యోగాలు

ప్రభుత్వ రంగ సంస్థ ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)’వెస్ట్రన్ రీజియన్ పరిధిలో 473 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉండగా.. టెన్త్/ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ పాసైనవారు ఈ నెల 26 వరకు అప్లై చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సైట్: https://www.iocl.com/apprenticeships

March 13, 2026 / 08:53 AM IST

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్

ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(AAI) 133 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్/IT, మెకానికల్/ఆటోమొబైల్, BCA, స్టెనో, కోపా విభాగాల్లో ఖాళీలు ఉండగా.. డిప్లొమా, డిగ్రీ, ITIలో పాసైనవారు ఈ నెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18-26 మధ్య ఉండాలి. అర్హత పరీక్షల్లో సాధించే మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

March 13, 2026 / 07:07 AM IST

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(AAI) 133 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్/IT, మెకానికల్/ఆటోమొబైల్, BCA, స్టెనో, కోపా విభాగాల్లో ఖాళీలు ఉండగా.. డిప్లొమా, డిగ్రీ, ITIలో పాసైనవారు ఈ నెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18-26 మధ్య ఉండాలి. అర్హత పరీక్షల్లో సాధించే మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

March 13, 2026 / 07:07 AM IST

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు

TG: పదో తరగతి పరీక్షలు రేపటి(శనివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 16వ తేదీతో పరీక్షలు పూర్తి అవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

March 13, 2026 / 06:38 AM IST

రైల్వే అభ్యర్థులకు ముఖ్య గమనిక

NLR: బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్-D పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిణి పి. వెంకట లక్ష్మి తెలిపారు. BC, SC, ST అభ్యర్థులు ఈనెల 23వ తేదీలోగా అప్లికేషన్లను తమ ఆఫీసులో ఇవ్వాలని సూచించారు. మెరిట్ ఆధారంగా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ఈనెల 25 నుంచి 2 నెలలపాటు శిక్షణ ఇస్తామన్నారు.

March 13, 2026 / 06:20 AM IST

స్కూల్ టైమింగ్స్ మార్చాలా..?

టీనేజర్లు ఉదయాన్నే నిద్రకళ్లతో స్కూల్ వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇది వారి తప్పు కాదని, వారి శరీరంలో జరిగే మార్పుల వల్ల రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతారని ఓ అధ్యయనంలో తేలింది. అయితే స్కూలు సమయం గంట ఆలస్యంగా మారడం వల్ల విద్యార్థులు రోజుకు అదనంగా 45ని. పాటు ఎక్కువ నిద్రపోగలిగారు. ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల విద్యార్థుల్లో ఒత్తిడి, అలసట తగ్గి ఉత్సాహంగా కనిపించారు. 

March 12, 2026 / 07:12 PM IST

ఎల్లుండి నుంచి పదో తరగతి పరీక్షలు

TG: రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే వారిని అస్సలు అనుమతించరు. కానీ విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 5,17,727 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

March 12, 2026 / 05:04 PM IST

కవిత ఇంటికి సీబీఐ అధికారులు

NZB: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇంటికి గురువారం సీబీఐ అధికారులు వచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో హైకోర్టు నోటీసులు ఇవ్వడానికి ఆమె ఇంటికి అధికారులు చేరుకున్నారు. దీంతో ఈ వార్త సర్వత్రా చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్​ స్కామ్ కేసును ఇటీవల ఢిల్లీలోని రౌస్​ అవెన్యూ కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. కవిత సహా 23 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.

March 12, 2026 / 04:08 PM IST

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 829.29 పాయింట్లు నష్టపోయి 76034.42 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 227.70 పాయింట్ల నష్టంతో 23639.15 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.21గా ఉంది.

March 12, 2026 / 03:40 PM IST

పిల్లల కోసం వాట్సప్ సరికొత్త ఫీచర్!

13 ఏళ్లలోపు పిల్లల కోసం వాట్సప్ పేరెంట్-మేనేజ్డ్ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. దీని ద్వారా పిల్లల అకౌంట్లను తల్లిదండ్రులు తమ ఫోన్ల నుంచే నియంత్రించవచ్చు. తనకు ఎవరు మెసేజ్ చేయాలి, ఏ గ్రూపుల్లో ఉండాలనేది పెద్దలే నిర్ణయిస్తారు. అయితే, ప్రైవసీ దెబ్బతినకుండా మెసేజ్‌లు మాత్రం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ పద్ధతిలోనే సురక్షితంగా ఉంటాయి.

March 12, 2026 / 03:27 PM IST

ఒంటిపూట బడులు.. షెడ్యూల్ విడుదల

TG: రాష్ట్రంలో పాఠశాలలకు హాఫ్ డే స్కూల్స్ షెడ్యూల్‌ను విద్యాశాఖ ప్రకటించింది. మార్చి16నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. 8AM నుంచి 12.30PM వరకు స్కూల్స్ నడపనున్నారు. మధ్యాహ్న భోజనం 12.30కు వడ్డించి.. ఆ తర్వాత విద్యార్థులను ఇంటికి పంపించేస్తారు. పదవ తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో 1PM గంట నుంచి 5PM వరకూ ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు.

March 12, 2026 / 02:49 PM IST