• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

దివాన్ చెరువు ఫారెస్ట్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి

E.G: దివాన్ చెరువులోని ఫారెస్ట్ ఏరియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఒక వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం కనుగొన్నారు. బొమ్మూరు ఎస్సై రమేష్ తెలిపిన వివరాలు.. ‘మృతదేహం ఉన్న స్థితిని బట్టి చనిపోయి నాలుగైదు రోజులు అయి ఉండవచ్చు. అక్కడ లభించిన సెల్ ఫోన్ ఆధారంగా మృతుడు రాజవోలుకు చెందిన మాండ్రు ప్రశాంత్ కుమార్ (43)గా గుర్తించాం’ అని పేర్కొన్నారు.

March 14, 2026 / 09:10 AM IST

గొర్రెల మందను ఢీకొన్న డీసీఎం వ్యాన్

ELR: ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున గొర్రెల మందను డీసీఎం వాహనం ఢీకొంది. గొర్రెల కాపరి గొర్రెలను ఏలూరు నుండి గుడివాడ వైపు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఐదు గొర్రెలు మృతి చెందగా మరికొన్ని గొర్రెలు గాయాల పాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న త్రీ టౌన్ ఎస్ఐ రాంబాబు వివరాలు సేకరిస్తున్నారు.

March 14, 2026 / 08:43 AM IST

మెట్రో స్టేషన్ నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

TG: హైద‌రాబాద్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ రెండవ అంతస్తుపై నుంచి బీటెక్ విద్యార్థి నిత్యతేజ్ దూకాడు. ఈ త‌రుణంలోనే అతణ్ని 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. కానీ ఆసుపత్రికి చేరుకునేలోపే నిత్యతేజ్ మృతి చెందాడు.

March 14, 2026 / 06:37 AM IST

అక్రమంగా తరలిస్తున్న డీజిల్ పట్టివేత

KKD: యానం డీజిల్‌ను గొల్లలమామిడాడకు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు కరప ఎస్సై సునీత బృందం శుక్రవారం పెనుగుదురు వద్ద వాహనాలు తనిఖీ చేశారు. కాకినాడ మీదుగా వెళ్తున్న బొలెరో ట్రక్కును తనిఖీ చేయగా అందులో 2 వేల లీటర్ల డీజిల్ పట్టుబడిందని ఎస్సై తెలిపారు. ఈ తనిఖీలలో సివిల్ సప్లై, రవాణా, తూనికలు కొలతలు, వాణిజ్య పన్నుల అధికారులు పాల్గొనట్లు ఎస్సై వెల్లడించారు.

March 14, 2026 / 06:00 AM IST

ప్రిన్సిపల్ వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య

TG: కొత్తగూడెం జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. టేకులపల్లి మండలం కోయగూడానికి చెందిన నితీష్ ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. అయితే ప్రిన్సిపల్ వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి ఆరోపిస్తోంది. నితీష్ అల్లరి చేస్తున్నాడని.. ప్రిన్సిపల్ మానసిక వేధింపులకు గురిచేశాడని వాపోయింది.

March 13, 2026 / 09:25 PM IST

భారీగా గ్యాస్‌ సిలిండర్ల అక్రమ నిల్వలు

AP: రాష్ట్రంలో భారీగా గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు బయటపడ్డాయి. తిరుపతి నగర శివారులోని అవిలాల పంచాయతీ పరిధిలో సుమారు 400 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శేషాచలరాజు గో గ్యాస్ పేరుతో ఉన్న వీటిని సీజ్ చేశారు.

March 13, 2026 / 07:25 PM IST

రక్తమోడిన రోడ్లు.. నలుగురు మృతి

AP: వేర్వేరు ప్రమాద ఘటనల్లో సీమకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువు హైవే గోడ్డావుల కోట వల్ల బొలేరో వాహనాన్ని కారు ఢీకొనగా.. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అటు కర్ణాటక బళ్లారి సమీపంలో ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సు-కారు ఢీకొనగా.. కర్నూలు జిల్లా అదోనికి చెందిన అనురాగ్-ఐశ్వర్య దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

March 13, 2026 / 11:13 AM IST

మరో ఇద్దరు బాలికలు అదృశ్యం

TG: కామారెడ్డిలో మరో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. బాలసదన్ భవన్ నుంచి ఉదయం 6 గంటల సమయంలో కనిపించకుండాపోయారు. ఈ క్రమంలో బాలసదన్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లాలో ఇది మూడో ఘటన.

March 13, 2026 / 10:59 AM IST

శ్రీశైలంలో ప్రమాదం.. 10 మందికి గాయాలు

AP: శ్రీశైలంలో వాహన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది భక్తులు గాయపడ్డారు. ఆలయ టోల్‌గేట్ వద్ద వాహనం బ్రేక్‌ ఫెయిలై కూడలి వద్ద కొందరు కన్నడ భక్తులను ఢీకొడుతూ ముందుకు దూసుకెళ్లింది. గాయపడిన వారిని స్థానికులు శ్రీశైలం దేవస్థానం ఆస్ప్రతికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

March 13, 2026 / 10:44 AM IST

కల్తీ పాలు.. పెరిగిన మృతుల సంఖ్య

AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 14 మంది మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు విడిచారు. దీంతో కల్తీ పాలు తాగి మరణించివారి సంఖ్య 15కు చేరింది. కల్తీ పాల వల్ల కిడ్నీతో పాటు ఇతర శరీర భాగాలు దెబ్బతిని చనిపోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

March 13, 2026 / 10:42 AM IST

భారీగా అల్ప్రాజోలం పట్టివేత

AP: NTR జిల్లాలో పోలీసులు భారీగా అల్ఫ్రాజోలంను సీజ్ చేశారు. కొండపల్లిలో అల్ఫ్రాజోలం తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బొల్లారానికి చెందిన సాయి త్రిభువన్ వర్మ, సౌరబ్ కుమార్‌ను అరెస్ట్ చేసి 200 కేజీల అల్ఫ్రాజోలం‌ను స్వాధీనం చేసుకున్నారు.

March 13, 2026 / 09:42 AM IST

విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

TG: భద్రాద్రి కొత్తగూడెంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. దమ్మపేట మండలం గండుగలపల్లి ఏకలవ్య హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది. నిన్న మధ్యాహ్నం విద్యార్థులు చికెన్ తినగా అర్ధరాత్రి నుంచి 27 మందికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. అయితే సిబ్బంది ఈ విషయాన్ని దాచి పెట్టి వైద్యం చేయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 13, 2026 / 08:22 AM IST

కల్తీ పెరుగు తయారీ.. ఇద్దరు అరెస్ట్

TG: హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని రహత్‌నగర్‌లో పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. 2,500 కేజీల కల్తీ పెరుగుతో పాటు.. పెరుగు తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలు సీజ్ చేశారు. NR ఎంటర్‌ప్రైజెస్ పేరుతో 6 నెలలుగా కల్తీ పెరుగు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో నరేష్, రాఘవేంద్ర అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

March 13, 2026 / 07:40 AM IST

BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం

TG: నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి- గన్నారం మధ్య ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

March 13, 2026 / 07:24 AM IST

బాలుడి హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష

ATP: శెట్టూరు మండలం తిప్పనపల్లిలో 2022లో జరిగిన బాలుడి హత్య కేసులో ముగ్గురు నిందితులకు జిల్లా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. భూ తగాదాల నేపథ్యంలో విష్ణువర్ధన్ అనే 11 ఏళ్ల బాలుడిని చిత్తప్ప, ఈరన్న, మురుకుందప్ప కలిసి హత్య చేశారు. కేసును విచారించిన జిల్లా జడ్జి భీమారావు నిందితులకు జీవితఖైదుతో పాటు జరిమానా విధిస్తూ గురువారం సంచలన తీర్పు ఇచ్చారు.

March 13, 2026 / 06:00 AM IST