AP: నెల్లూరు జిల్లా అల్లూరు TDP కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టీడీపీ ఆఫీసు పూర్తి కాలి బూడిదైంది. పార్టీ ఆఫీసులో అగ్నిప్రమాదంపై TDP నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మరోచోట పార్టీ ఆఫీసును MLA అనుచరులు ప్రారంభించారు. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ లేదా ఎవరైనా నిప్పంటించారా అన్న కోణంలో అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
TG: సికింద్రాబాద్ బేగంపేటలోని అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్‌మెంట్ రెండో అంతస్తులోని ఫ్లాట్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే రెండో అంతస్తు నుంచి మూడో అంతస్తుకు మంటలు వ్యాపిస్తున్నాయి. ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మాంటలార్పుతున్నారు.
చెన్నైలోని కరూర్‌లో రైలు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ కాలేజ్ బస్సును గూడ్స్ రైలు ఢీకొట్టింది. దీంతో 18 మందికి గాయాలు కాగా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
AP: విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం చేపలుప్పాడలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ విఫలమైందనే బాధతో అప్పలరాజు (29) అనే యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని KGHకి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG: మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మృతులు హవేలీఘనపూర్ మండలం బూరుపల్లి వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
TG: భూపాలపల్లిలోని మొగుళ్లపల్లి మండలం కొరికిశాలలో ఘోర ప్రమాదం జరిగింది. బావి పూడిక తీస్తుండగా క్రేన్ వైర్ తెగి ముగ్గురు మృతి చెందారు. మృతులు దేవరావు, అభిలాష్, పైడిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: మంచిర్యాలలోని కవ్వాల్ టైగర్ ఫారెస్ట్‌లో చిరుత మృతి చెందింది. ముగ్గురు నిందితులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఉచ్చులో చిక్కిన చిరుతను కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు. చిరుత గోళ్లు, కళేబరం తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.
TG: హైదరాబాద్‌లోని ఉప్పుగూడలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను రీఫిల్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో 22 సిలిండర్లను సీజ్ చేశారు. గ్యాస్ సిలిండర్ల కొరత ఉండటంతో ఇతరుల అవసరాన్ని కొందరు క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు.
TG: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. బోరబండలో తన ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె గొంతు నులిమి అనంతరం తల్లి సత్యవాణి ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా.. కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.
KDP: దువ్వూరు మండలం గుడిపాడు సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, క్షతగాత్రుడి పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉంది.
TG: సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరులో జంట హత్యల కలకలం రేగింది. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని సిటీజెన్ కాలనీలో ఈ ఘటన జరిగింది. భార్య, భర్తలను దుండగులు దారుణంగా కొట్టి చంపారు. భర్త సోమ్లా నాయక్, భార్య మాన్యమ్మ చనిపోయారు. నిర్మాణంలో ఉన్న భవనానికి వాచ్ మెన్‌గా సోమ్లానాయక్ పనిచేస్తున్నారు. మృతులను మహబూబాబాద్ జిల్లా గురుడు మండలం దొంగచింతతాండకు చెందిన వారిగా గుర్తించారు.
AP: కర్నూలు సమీపంలోని గార్గేయపురంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో నాగేశ్వరమ్మ(5) అనే మహిళ తన ఇద్దరు పిల్లలు సుకుమార్(6) అబ్రహం(30)తో పాటు ఆత్మహత్య చేసుకుంది. ముందుగా పిల్లలను చెరువులోకి తోసి, ఆపై తానూ దూకింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AP: ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన జాఫర్, భద్రాద్రి జిల్లాకు చెందిన ఖతిజాలకు 13 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరు ప్రస్తుతం చింతలపూడిలో ఉంటున్నారు. అయితే ఖతిజాకు వివాహేతర సంబంధంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో తమ బంధానికి అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను ఖతిజా చంపేసింది. మొదట సహజ మరణంగా చిత్రీకరించినా.. అసలు విషయాన్ని ఖతిజా కుమార్తె బయటపెట్టింది.
అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లిలో ఇన్నోవా కార్ టైరు పగిలి అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం కడపకు రిఫర్ చేశారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.