TG: హైదరాబాద్ గోల్కొండ రిసాలబజార్‌లో దారుణం జరిగింది. 14 నెలల శిశువును దిండుతో ఊపిరాడకుండా చేసి తల్లి గౌసియా బేగం చంపింది. అనంతరం తల్లి గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. దంపతుల మధ్య వివాదమే కారణమని పోలీసులు వెల్లడించారు.
AP: ఏలూరు జిల్లా దొరమామిడి డ్యామ్‌లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకులు తూ.గో.జిల్లా యదవోలుకు చెందిన రమణ, నాగరాజుగా పోలీసులు గుర్తించారు. యదవోలు నుంచి గుబ్బలమంగమ్మ ఆలయాకి 10 మంది యువకులు వచ్చారు. తిరిగి వస్తుండగా డ్యామ్‌లో స్నానానికి దిగారు. ఈ క్రమంలో గల్లంతైన ఇద్దరి యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
AP: విశాఖ గోపాలపట్నం చంద్రనగర్‌లో బాణాసంచా పేలింది. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి, మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. అపార్ట్‌మెంట్ రెండో అంతస్తులో బాణాసంచా నిల్వలు ఉన్నాయి. దీంతో స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెస్తున్నారు.
TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రమాదం జరిగింది. వలిగొండ మండలం అరూరు వద్ద బైకును లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: కృష్ణా జిల్లా గన్నవరంలో ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కేసరపల్లి దగ్గర ఓ కానిస్టేబుల్ బైక్ ఆపడానికి ప్రయత్నించగా.. బైక్ అదుపుతప్పి బొలెరోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణయ్ అనే యువకుడు మృతి చెందగా.. సోదరుడికి గాయాలయ్యాయి. ఈ ప్రమాద దృశ్యాలు CCTVలో రికార్డు అయ్యాయి. పోలీసుల వల్లే ప్రణయ్ చనిపోయాడంటూ బంధువులు ఆరోపిస్తున్నారు.
TG: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం దేవతపల్లి గేట్ వద్ద ప్రమాదం జరిగింది. ఆటో, లారీ ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో HYDకి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గోర్ఖా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయ యాత్రికులు మృతిచెందారు. ప్రసిద్ధ మనకమాన ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న మినీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు అక్కడి పోలుసులు వెల్లడించారు.
AP: విజయనగరం జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. బొండపల్లి మండల కేంద్రంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. ఓ బొలేరోలో 650 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే బొలేరో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని గంజాయి సీజ్ చేశారు. ఒడిశా నుంచి విజయనగరానికి తరలిస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్ నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
సత్యసాయి: జిల్లా మహమ్మదాబాద్ సమీపంలో ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో చౌడమ్మ (50) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె సోదరుడు శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. అమడగూరు మండలం తనకంటివారిపల్లికి చెందిన చౌడమ్మ కూరగాయల వ్యాపారం కోసం గోరంట్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
AP: విశాఖపట్నంలో లారీ బీభత్సం సృష్టించింది. గాజువాక బీహెచ్‌పీవీ కూడలిలో రెండు కార్లు, మూడు బైకులను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
AP: అన్నమయ్య జిల్లా పుంగనూరు త్యాగరాజవీధిలో విషాదం చోటుచేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఊపిరాడక నలుగురు మృతిచెందారు. మృతుల్లో వృద్ధుడు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. బైక్ సర్వీసింగ్ చేసి రాత్రంతా ఇంజిన్ ఆన్‌లో ఉంచడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇంట్లో బైక్ ఉంచిన గదిలోనే అందరూ నిద్రించడంతో విషాదం జరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తుక్కపురం గ్రామంలో నీలిమ అనే మహిళ తన కుమారుడు, కుమార్తెపై కత్తితో దాడి చేసి అనంతరం ఆత్మహత్యకు యత్నించింది. తన భర్తతో కొన్ని రోజులుగా కుటుంబ కలహాలు ఉండటంతో తన తల్లి ఇంటికి చేరుకున్న నీలిమ తెల్లవారుజామున పిల్లలపై దాడి చేసింది. గొంతు కోయడంతో కుమార్తె (13) అక్కడికక్కడే మృతిచెందింది. కుమారుడికి గాయాలయ్యాయి.
TG: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. తాము పనిచేస్తున్న ఇంట్లోనే నేపాల్‌కు చెందిన దంపతులు దొంగతనానికి పాల్పడ్డారు. రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, రోలెక్స్ వాచీలు చోరీ చేశారు. 45 రోజుల క్రితమే వ్యాపారి ఇంట్లో వారు పనిలో చేరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కోనసీమ: రాయవరంలో లారీ పైనుంచి ప్రమాదవ శాత్తు జారిపడి గుంటూరుకి చెందిన లారీ క్లీనర్ చింతల నరేష్ కుమార్ మృతి చెందాడు. శనివారం ధాన్యం లోడు అన్‌లోడ్ చేసే క్రమంలో తాడు విప్పుతుండగా పైనుంచి కింద పడటంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అతనిని స్థానికులు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG: యాదాద్రి జిల్లా తక్కపురంలో ఓ తల్లి కుమార్తె, కుమారుడిని కత్తితో పొడిచింది. కుమార్తె క్రితిరెడ్డి(14) మృతిచెందగా, కుమారుడు అశాంత్ రెడ్డి(11)కి గాయాలయ్యాయి. పుట్టింటి నుంచి వచ్చిన నీలిమ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కొంతకాలంగా భర్త నరేందర్ రెడ్డి, నీలిమ మధ్య గొడవలు ఉన్నాయి. కుటుంబ తగాదాలతో పిల్లలను నీలిమ పొడిచినట్లు తెలుస్తోంది.