• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

ఏసీబీకి పట్టుబడిన మున్సిపల్ సర్వేయర్

AP: తాడేపల్లిగూడెంలో మున్సిపల్ సర్వేయర్ రౌతు రామకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్థలం సర్వే రిపోర్టుకు యజమాని వద్ద రూ.50 వేలు డిమాండ్ చేయగా.. యజమాని నగదు ఇస్తుండగా రామకృష్ణ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో సర్వేయర్, సర్వే సిబ్బంది, కుటుంబసభ్యులను విచారిస్తున్నారు. రామకృష్ణ మున్సిపల్ సర్వేయర్, ఇన్‌ఛార్జి డివిజినల్ సర్వేయర్‌గా పనిచేస్తున్నారు.

March 17, 2026 / 12:32 PM IST

విద్యార్థి ఆత్మహత్య.. వెలుగులోకి కీలక అంశాలు

TG: కేయూ పీజీ విద్యార్థిని శ్రీవిద్య చనిపోయే ముందు వాంగ్మూలం ఇచ్చింది. ఆరుగురు కలిసి తనను కొట్టినందుకే ఎలుకల మందు తాగనని వెల్లడించింది. రమ్య, శ్రీజ, కీర్తితో పాటు మరో ముగ్గురు తనపై దాడి చేశారని తెలిపింది. దొంగతనం చేశానని చాలాసార్లు కొట్టారని పేర్కొంది. కాగా, సీనియర్ల వేధింపులతో ఈనెల 7న శ్రీవిద్య ఎలుకల మందు తాగిన విషయం తెలిసిందే.

March 17, 2026 / 11:24 AM IST

దారుణం.. గర్భిణిని హతమార్చిన భర్త

TG: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌లో ఓ భర్త కట్టుకున్న భార్యను హతమార్చాడు. 8 నెలల క్రితం హరిబాబు వైష్ణవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో.. భార్య నాలుగు నెలల గర్భిణి అని కూడా చూడకుండా కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

March 17, 2026 / 11:21 AM IST

సీనియర్ల ఆరోపణలు..యువతి మృతి

TG: వరంగల్ కేయూలో పీజీ విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. సీనియర్లు దొంగతనం నెపం మోపారని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నెల 7న ఆత్మహత్యాయత్నం చేయగా.. నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. శ్రీవిద్య స్వస్థలం ఖమ్మం జిల్లా బనిగండ్లపాడుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

March 17, 2026 / 10:26 AM IST

రూ.కోటితో పరార్.. నిందితులు అరెస్ట్

TG: కూకట్‌పల్లిలో హవాలా నగదు దోపిడీ కేసు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. శంషాబాద్ నుంచి లక్నో వెళ్లేందుకు నిందితులు యత్నించినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, హవాలా నగదు రూ.కోటితో దుండగులు పరారయ్యారు.

March 17, 2026 / 10:21 AM IST

కొండచరియలు విరిగిపడి.. నలుగురు మృతి

అరుణాచల్‌ప్రదేశ్ ఇటానగర్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి నిర్మాణంలో ఉన్న భవన రక్షణ గోడ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడి గోడ కూలడంతో వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు. మృతులను చోకి తసర్(23), గోడక్ రాజా(30), గోడక్ తబిన్(35), రతన్ బర్మన్ (26)గా పోలీసులు గుర్తించారు.

March 17, 2026 / 09:47 AM IST

ప్రమాదం.. దంపతులు మృతి

TG: పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో దంపతులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు మంచిర్యాలకు చెందిన ఎడ్ల శ్రీనివాస్, రజితగా గుర్తించారు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టంకి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

March 17, 2026 / 08:45 AM IST

కళ్లలో కారం చల్లి.. కోటి రూపాయలు దోపిడీ

TG: HYD కూకట్‌పల్లిలో భారీ దోపిడీ జరిగింది. డబ్బులు తీసుకెళ్తున్న వ్యక్తులపై దుండగులు కారం చల్లి కోటి రూపాయలతో పరారయ్యారు. బహదూర్‌పురాకు చెందిన కుస్రు, అజీముద్దీన్ డబ్బు తీసుకుని వెళ్తుండగా.. నలుగురు వ్యక్తులు బైకులపై వచ్చి కళ్లలో కారం చల్లి నగదుతో పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

March 17, 2026 / 08:44 AM IST

లైంగిక దాడి కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష

TG: లైంగిక దాడి కేసులో మెదక్ పోక్సో కోర్టు సంచలన తీర్పునిస్తూ అటెండర్ సారా జైపాల్‌కు 20 ఏళ్ల కఠిన శిక్ష విధించింది. 2019లో పాఠశాల బాలికపై అతడు లైంగిక దాడి చేసినందుకు ఈ తీర్పు ఇచ్చింది. శిక్షతో పాటు బాధితురాలికి లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే చట్టం కఠినంగా ఉంటుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

March 16, 2026 / 10:10 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

AP: ప్రకాశం జిల్లా తిప్పాయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్, లారీ ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు కర్ణాటకకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

March 16, 2026 / 09:44 PM IST

రోడ్డు ప్రమాదం.. నలుగురు స్నేహితులు మృతి

యూపీ మొరాదాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లక్నో-ఢిల్లీ హైవేపై ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని వేగంగా వచ్చి ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా మొరాదాబాద్ నివాసితులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

March 16, 2026 / 03:42 PM IST

ఆదివాసి యువతి దారుణ హత్య

TG: ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికలపేట మండలం కొండపల్లిలో దారుణ హత్య జరిగింది. సలుగుపల్లి అటవీ ప్రాంతంలో ఆదివాసి యువతి సమ్మక్క (25)ను దారుణంగా హత్య చేశారు. ఆమెను ప్రియుడే గొంతు నులిమి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 16, 2026 / 03:26 PM IST

గండిపేట చెరువులో ముగ్గురు యువకులు గల్లంతు

TG: హైదరాబాద్‌ గండిపేట చెరువులో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. నార్సింగి PS పరిధిలోని ఇస్తానా విల్లాస్ దగ్గర నీళ్లలో పడి ముగ్గురు మృతిచెందినట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం, పోలీసులు మృతదేహాలను తీసే ప్రయత్నం చేస్తున్నారు. చేపలు పట్టేందుకు వచ్చి చెరువులో పడినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 16, 2026 / 11:08 AM IST

గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య

VZM: మానసిక స్థితితో బాధపడుతూ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎస్.కోటలో చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ త్రిమూర్తులు వివరాల మేరకు తలారి గ్రామానికి చెందిన చొప్ప నందు(19) స్థానిక ఐటీఐ చదువుతున్నాడు. ఈ నెల 12 సాయంత్రం బయటకు వెళ్తానని చెప్పి ఇంట్లోంచి వెళ్ళాడు. శివాలయం వద్ద గడ్డిమందు తాగాడు. విశాఖ తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

March 16, 2026 / 08:19 AM IST

టిప్పర్ ఢీ.. యువకుడు మృతి

SKLM: బూర్జ మండలం ఉప్పిని వలస గ్రామానికి చెందిన కపీరు జీవన్ కుమార్ (32) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఉప్పిని వలస నుంచి వస్తుండగా సింగన్న పాలెం కూడలి వద్ద టిప్పర్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 16, 2026 / 08:10 AM IST