KMM: సత్తుపల్లి మండలం సదాశివునిపేట శివాలయం సమీపంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. బైక్ పై వెళ్తూ రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వేగంగా ఢీకొట్టారు. దీంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు సిద్ధారం గ్రామానికి చెందిన గద్దల మనోజ్(18), గంధం కార్తీక్ (20)గా గుర్తించారు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
MDK: అంత్యక్రియలకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన నెలకొంది. రామాయంపేటకు చెందిన గాయంతి మల్లేశం(45) బందువుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లారు. అనంతరం స్థానిక కొత్తచెరువులో స్నానం చేసేందుకు దిగారు. ప్రమాదవశాత్తు లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లి నీటిలో గల్లంతయ్యారు. దీంతో వారి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.
MHBD: తొర్రూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రామచందర్, మరొక హెడ్ కానిస్టేబుల్ బజ్జలాల్ గురువారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, పట్టణ శివారులో లారీ ఢీకొనడంతో కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. లారీని స్వాధీనం చేసుకొని డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.
MDK: రామాయంపేటలో గాంధీ రోడ్డు దగ్గర ఉన్న పాలకేంద్రంలో రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో మంటలను అదుపు చేశారు. పాలకేంద్రంలో ఫర్నిచర్, రెండు ఫ్రిజ్‌లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.1,50,000 నష్టం జరిగినట్లు తెలిపారు.
SDPT: పట్టణంలోని నాగదేవత ఆలయ సమీపంలో డివైడర్‌ను ఢీకొని యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మృతుడు దుబ్బాకకు చెందిన మాడబోయిన రాంచరణ్ గా గుర్తించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బైక్‌పై ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
AP: విజయవాడలోని విద్యాధరపురం నేషనల్ స్కూల్‌లో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ పోశారు. అనంతరం బాత్‌రూమ్‌లో పడిపోయిందని పేరెంట్స్‌కి ఫోన్ చేశారు. చిన్నారి ప్రైవేట్ పార్ట్స్‌పై తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా యాసిడ్ పోసినట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
AP: తిరుపతిలోని చంద్రగిరి బైపాస్‌రోడ్డులో ప్రమాదం జరిగింది. ఆటోను స్కూల్ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SDPT: హుస్నాబాద్ కస్తూరిబా కాలనీ సమీపంలో బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిగురుమామిడి మండలం కొండాపూర్‌కి చెందిన జంగాపల్లి సాంబరాజు(35) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
E.G: నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న వ్యాన్ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
KKD: గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలు సేరికల్చర్ షెడ్ వెనుక పాడుబడిన షెడ్లో అక్రమంగా నిల్వ చేసిన దీపావళి పేలుడు సామాగ్రిని అధికారులు నిర్వీర్యం చేశారు. అక్రమంగా నిల్వ చేసిన మందుగుండు సామాగ్రిని పోలీసులు గురువారం రాత్రి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రూ.89 వేల విలువ గల పేలుడు పదార్థాలను డంపింగ్ యార్డ్‌లో నిర్వీర్యం చేశారు.
అనంతపురంలో తల్లీకూతుళ్ల మధ్య జరిగిన గొడవలో యువతి మృతి చెందింది. ఉరవకొండ మండలం మైలారంపల్లికి చెందిన హారతి(21) ప్రేమ వ్యవహారంపై తల్లి జయలక్ష్మితో వివాదం జరిగింది. బుధవారం రాత్రి ఇద్దరూ పురుగు మందు తాగగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హారతి గురువారం మృతి చెందింది. జయలక్ష్మికి చికిత్స కొనసాగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ATP: బుక్కరాయసముద్రం పంచాయతీ పరిధిలోని దేవరకొండ వద్ద దుండగులు గృహిణి మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును అపహరించారు. బాధితురాలు ప్రమీల తన భర్త శివయ్యతో కలిసి ద్విచక్రవాహనంలో పి.కొత్తపల్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దారిలో ఇద్దరు వ్యక్తులు చిరునామా అడుగుతున్నట్లు నటించి వాహనాన్ని ఆపారు. అదును చూసి ప్రమీల మెడలోని గొలుసు తెంచుకుని పరారయ్యారు.
KKD: పిఠాపురం మండలం పి.దొంతమూరు గ్రామ శివారు పామాయిల్ తోటలో అక్రమంగా నిల్వ ఉంచిన 92 కేజీల గంజాయిని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. పక్కా ప్రణాళికతో నిఘా పెట్టి గంజాయిని పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ATP: పామిడి మండలం జి. కొట్టాల గ్రామంలోని శ్రీనివాస్ ఆచారికి చెందిన వేరుశనగ, వరి గడ్డి వాములు గురువారం అగ్నికి ఆహుతయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించి గడ్డి, డ్రిప్, స్ప్రిం క్లర్లు కాలిపోయాయని బాధితుడు తెలిపాడు. దీంతో రూ.2.50 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు.
ఒమన్ పోర్టుపై ఇరాన్ సైన్యం దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతులు ఆశిష్ కుమార్, దిలీప్ సింగ్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.