• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వంలో పల్లెలు అభివృద్ధి: ఎమ్మెల్యే

కృష్ణా: కూటమి ప్రభుత్వంలో పల్లెలు అభివృద్ధి వెలుగుల్లో వెలుగుతున్నాయని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ఉయ్యూరు మండలం సాయిపురం, ముదునూరు జాగర్లపూడి పల్లెల్లో ఎమ్మెల్యే కూటమి నాయకులతో కలిసి బుధవారం పర్యటించారు. గ్రామంలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంచినీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

March 26, 2026 / 07:29 AM IST

మాజీ సీఎంను కలిసిన ఎమ్మెల్సీ

కోనసీమ: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కలిసి ప్రజా సమస్యలపై సమిష్టిగా పోరాటం చేయాలని జగన్ సూచించారని ఇజ్రాయిల్ తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు.

March 26, 2026 / 07:27 AM IST

పెద్దమండ్యంలో నాటు సారా విక్రేత అరెస్టు : SI

అన్నమయ్య: జిల్లా పెద్దమండ్యం మండలంలో నాటు సారా విక్రయిస్తున్న బుక్కే రవి నాయక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం రామానాయక్ తండాలో పోలీసులు దాడులు నిర్వహించి, 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శ్రావణి రెడ్డి తెలిపారు.

March 26, 2026 / 07:26 AM IST

‘గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు’

ప్రకాశం: బేస్తవారిపేటలోని గ్యాస్ గోడౌన్‌లో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా నిబంధనలు, అగ్నిమాపక సదుపాయాలు, సిలిండర్ల నిల్వ, రవాణా విధానాలను పరిశీలించారు. గోడౌన్ యజమానులు అన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. గ్యాస్ కొరతను సృష్టిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లికార్జున, ఎస్సై రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.

March 26, 2026 / 07:26 AM IST

బీ-ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఏలూరు: నగరంలోని సీఆర్ రెడ్డి ఫార్మసీ కళాశాలలో బీ-ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న చిలుకూరి సువర్షినీ హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గమనించిన హాస్టల్ వార్డెన్, ఆమెను ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగని వైద్యం కోసం విజయవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

March 26, 2026 / 07:25 AM IST

తిరుమల వెళ్లే వారికి గమనిక

తిరుమలలో ఇవాళ టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం మొత్తం 73,411 మంది శ్రీవారిని దర్శించుకోగా, 30,474 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.43 కోట్లుగా నమోదైంది.

March 26, 2026 / 07:22 AM IST

నేడు జి.కొండూరులో ఎమ్మెల్యే ప్రజాదర్బార్

ఎన్టీఆర్: జి.కొండూరులోని హైస్కూల్‌కు వెళ్లే మార్గంలో కమ్యూనిటీ హాల్ వద్ద గురువారం ఎమ్మెల్యే ‘ప్రజాదర్బార్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొని, ప్రజల వద్ద స్వీకరిస్తారని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం కోరింది.

March 26, 2026 / 07:20 AM IST

భద్రాచలానికి డైరెక్ట్ బస్సులు..!

WG: ఇవాళ నుంచి జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం డిపోల నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ RM గిరిధర్ కుమార్ తెలిపారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎప్పుడైనా వెళ్లడానికి వీలుగా బస్సులు అన్ని వేళలా అందుబాటులో ఉంటాయన్నారు. ఆన్‌లైన్ రిజర్వేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామని RM తెలిపారు.

March 26, 2026 / 07:20 AM IST

సైబర్ క్రైమ్‌లపై అవగాహన కల్పించిన ఎస్సై

VZM: వంగర గ్రామస్థులకు SI షేక్ శంకర్ బుధవారం రాత్రి వేసవికాలంలో జరిగే దొంగతనాల పట్ల అవగాహన కల్పించారు. చైన్‌ స్నాచింగ్‌, సైబర్‌ క్రైమ్‌, క్రికెట్‌ బెట్టింగ్‌,యాక్సిడెంట్లపై జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇంట్లో విలువైన ఆభరణాలు, నగదు ఉండి ఊరికి వెళ్లేటప్పుడు తమకు సమాచారం అందించాలన్నారు. రోడ్డు భద్రతా నియమావళి పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు.

March 26, 2026 / 07:20 AM IST

పెనుమూరులో పులి సంచారం..?

CTR: పెనుమూరు (M) కత్తిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి మేకలు మేపేవాడు. రోజులా బుధవారం తాతిరెడ్డిపల్లి, సీఎస్ అగ్రహారం అడవిలో మేకలు మేపుతుంటే మధ్యాహ్నం 3 గంటలకు ఓ మేకను పులి ఎత్తుకెల్లిందని వాపోయాడు. దీంతో ఫారెస్ట్ అధికారి వందన్ తమ బృందంతో సీస్ అగ్రహారం యువకులు 40 మంది కలిసి ఘటనా స్థలంలో గాలింపు చర్యలు చేపట్టారు.

March 26, 2026 / 07:14 AM IST

శ్రీరామనవమి సందర్భంగా రేపు పాఠశాలలకు సెలవు: DEO

ATP: శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని ఈ నెల 27న జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సాధారణ సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) ఎం.ప్రసాద్ బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ ఈ ఉత్తర్వులను పాటించాలని సూచించారు.

March 26, 2026 / 07:12 AM IST

ఏకలవ్య పాఠశాల ఏర్పాటుకు కేంద్రమంత్రికి వినతి

సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. ఢిల్లీలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరంను కలిసి ఈ మేరకు విన్నవించారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఈ పాఠశాల అవసరమని మంత్రి సత్యకుమార్ వివరించారు.

March 26, 2026 / 07:12 AM IST

జిల్లాలో రేషన్ బియ్యం స్వాధీనం

KDP: దువ్వూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, ఇరువురిపై కేసు నమోదు చేసి బొలెరో వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై ధనుంజయుడు తెలిపారు. బుధవారం మండలంలోని జొన్నవరం వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న 25 బస్తాల రేషన్ బియ్యంతోపాటు బొలెరో వాహనాన్ని సీజ్ చేశామన్నారు.

March 26, 2026 / 07:10 AM IST

డివైడర్‌ను పగలగొట్టిన ఆకతాయిలు

ప్రకాశం: సింగరాయకొండ పట్టణంలో కూరగాయల మార్కెట్ సెంటర్ సమీపంలో ప్రధాన రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌ను కొందరు బుధవారం రాత్రిపూట ధ్వంసం చేశారు. ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు అనువుగా చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. రోడ్డు భద్రత నిబంధనలను పాటించకుండా ఇలా చేసిన వారుపై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

March 26, 2026 / 07:10 AM IST

‘మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి’

KRNL: సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని టీడీపీ మంత్రాలయం ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి అన్నారు. నిన్న రంగాపురంలో రైతన్న సేవలో మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి అన్నదాత సుఖీభవ పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు.

March 26, 2026 / 07:08 AM IST