శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో నైట్ వాచ్‌మెన్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పోలినాయుడు తెలిపారు. పార్ట్‌టైమ్ విధానంలో నియమించనున్నట్లు పేర్కొన్నారు. వేతనం నెలకు రూ.6వేల నుంచి రూ.7వేల వరకు ఉంటుందన్నారు. వయసు 18 నుంచి 62 ఏళ్ల లోపు ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చన్నారు. ఈనెల 30న సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు.
ATP: గుత్తి మండలం, బాచుపల్లి గ్రామంలో “రెన్యూ సౌర విద్యుత్” కు, భూములు ఇచ్చిన రైతులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, బుధవారం సాయంత్రం చెక్కులను పంపిణీ చేశారు. 20మంది రైతులకు రూ. 70లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా: ఉంగుటూరు మండలం మానికొండలో నిన్న ‘రైతన్న మీ కోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్ రావు పాల్గొన్నారు. రైతులను కలసి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. గ్రామ అభివృద్ధికి రూ.3.45 కోట్లు కేటాయించినట్లు, మానికొండ-తరిగొప్పల రోడ్డు పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో బీపీఈడీ, డీపీఈడీ చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 6, 7, 8, 9వ తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 70 మార్కులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధికారులు తెలిపారు. సబ్జెక్టులవారీగా పూర్తి వివరాలకు https://kru.ac.in/ను సందర్శించాలని సూచించారు.
E.G: CM క్యాంప్ కార్యాలయంలో పర్యాటక శాఖపై నిర్వహించిన కీలక సమీక్షా సమావేశంలో మంత్రి కందుల దుర్గేశ్, తదితరులు పాల్గొన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్, చారిత్రాత్మక హావ్‌లాక్ బ్రిడ్జ్ పునరుద్ధరణ పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం సూచించినట్లు మంత్రి తెలిపారు.
CTR: జీడీ నెల్లూరు గ్రామ పంచాయతీ వారపు సంతను ఇవాళ బహిరంగ వేలం వేయనున్నట్లు ఎంపీడీవో మనోహర్ గౌడ్ తెలిపారు. ఉదయం 11 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో డీపీవో సమక్షంలో వారపు సంత, షాపింగ్ కాంప్లెక్స్ మొదలైన వాటిని బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. ఈ వేలం పాటలో పాల్గొనే వారు గ్రామ పంచాయతీ నిబంధనల మేరకు ప్రాథమిక చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎన్టీఆర్: నందిగామ మండలం చందాపురంలో బుధవారం రాత్రి ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. రైతుల సమస్యలు, పంటల పరిస్థితులు, సాగు సౌకర్యాలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై ఎమ్మెల్యే ప్రత్యక్షంగా రైతులతో చర్చించారు. ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని ఆమె వెల్లడించారు.
కోనసీమ: యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ కొరత ఉండడంతో సిలిండర్ కోసం జనం ఎగబడుతున్నారు. ఆలమూరు మండలం మూలస్తానంలో బుధవారం సాయంత్రం గ్యాస్ వ్యాన్ రాగానే ఒక్కసారిగా జనం సిలిండర్ కోసం ఎగబడడంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ సరఫరా చేసే వ్యాన్ డ్రైవర్‌లు తమకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే గ్యాస్ ఇస్తున్నారని జనం ఆరోపించారు.
PPM: ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దేవత మక్కువ శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి హుండీ ఆదాయం గురువారం10 గంటలకు లెక్కిస్తున్నట్లు ఆలయ EO శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవదాయశాఖ అధికారులు, గ్రామస్థులు సమక్షంలో హుండీ లెక్కించుటకు నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే హుండీ లెక్కింపు సమయానికి దేవాలయం వద్దకు హాజరుకావాలని సూచించారు.
ప్రకాశం: టంగుటూరు మండలంకొణిజేడులో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మోజస్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలలో ఉన్న సమస్యలను అధ్యయనం చేసే కార్యక్రమంలో భాగంగా బుధవారం సందర్శించారు. ఇప్పటికీ ఈ కాలనీలు అభివృద్ధి కాలేదని, 30 ఎస్టీ కుటుంబాలకు పక్కా గృహాలు సైతం లేవన్నారు. గ్రామంలోని రెండు దళిత కాలనీలకు స్మశాన స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించామన్నారు.
కాకినాడ: సామర్లకోట మండలం హుస్సేన్ పురంలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసి పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మార్ని చిలకమ్మ అనే ఒక మహిళకు చెందిన పూరిపాక అగ్ని ప్రమాదానికి గురైనట్లు స్థానికులు వివరించారు. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
KDP: VN పల్లె మండలంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు గురువారం పెరటి కోళ్ల పంపిణీ చేయనున్నట్లు DRDA. APM భాగ్యమ్మ బుధవారం తెలిపారు. మండలానికి 30 యూనిట్లు మంజూరు అయ్యాయని, ఒక్కో యూనిట్ విలువ రూ.3,700 అని ఆమె తెలిపారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇవాళ VN పల్లె, ఉరుటూరు గ్రామాలలో పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.
TPT: శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ (SPMVV)లో 2026-27 విద్యా సంవత్సరానికి యోగ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. ఒక ఏడాది కాలపరిమితి ఉండే డిప్లొమా ఇన్ యోగ, పీజీ డిప్లొమా ఇన్ యోగ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. వివరాలకు https://www.spmvv.ac.in వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ మే 10 అని పేర్కొన్నారు.
కోనసీమ: జిల్లాలో ఎక్కడా కూడా పెట్రోల్, డీజిల్‌కి ఏ విధమైన కొరత లేదని, గతంలో మన జిల్లా వినియోగం ఎంతైతే ఉందో అంత పెట్రోల్, డీజిల్ స్టాక్‌లు బంక్‌లకు వస్తున్నాయని జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై కంగారుపడి ఎక్కువ ఆయిల్ తీసుకొని కృత్రిమ కొరత సృష్టించవద్దని కోరారు.
KRNL: 2026-27 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ టారిఫ్ పెంపు ఉండదని ఏపీఈఆర్సీ ఛైర్మన్ పీవీఆర్ రెడ్డి తెలిపారు. కర్నూలులో APERC విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పంపిణీ సంస్థలు సూచించిన లోటును తగ్గించి, భారం ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. గృహ,వ్యవసాయ వినియోగదారులకు ఎలాంటి అదనపు భారం లేదన్నారు.