• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జనగణన శిక్షణ ముగింపు.. సమర్థ నిర్వహణపై కలెక్టర్ దృష్టి

CTR: జనగణన కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. కుప్పం, పలమనేరు, నగరి డివిజన్లకు చెందిన ఫీల్డ్ ట్రైనర్లు పాల్గొన్నారు. ఈ జనగణన ఫలితాలు రాబోయే 15 సంవత్సరాల అభివృద్ధిపై ప్రభావం చూపుతాయని కలెక్టర్ తెలిపారు.

March 26, 2026 / 08:03 AM IST

గ్రామస్థులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించిన సీఐ

VZM: సంతకవిటి మండలం పొనుగుటివలసలో స్దానిక యువత ఏర్పాటు చేసిన CC కెమెరాలను బుధవారం సాయంత్రం CI ఉపేంద్ర ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న యువతను అభినందించారు. గ్రామంలోని ప్రధాన ప్రాంతాలను కవర్‌ చేస్తూ ఐదు కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

March 26, 2026 / 08:03 AM IST

బస్సు ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి

మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో రోడ్డు ప్రమాదంపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 10 మంది సజీవ దహనం కావడం తీవ్ర ఆవేదన గురి చేసిందని, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులకు ఆయన ఆదేశించారు.

March 26, 2026 / 08:03 AM IST

వైభవంగా మరిడిమాంబ ఆలయం ప్రారంభం

AKP: కసింకోట మండలం తాళ్లపాలెం గ్రామంలో కొత్తగా నిర్మించిన మరిడిమాంబ అమ్మవారి ఆలయాన్ని బుధవారం వైభవంగా ప్రారంభించారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, హోమం, తదితర కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించారు. భక్తులు పలువురు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. జనసేన నియోజకవర్గం ఇంఛార్జ్ రాంకి అమ్మవారిని దర్శించుకున్నారు.

March 26, 2026 / 08:01 AM IST

ఏప్రిల్ 2తో ముగియనున్న సర్పంచుల పదవీకాలం

ఉమ్మడి E.G జిల్లాలోని 1,069 గ్రామపంచాయతీల సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. గడువు ముందు ప్రభుత్వం సర్పంచుల ఆర్థిక అధికారాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ అధికారాలను డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్లకు అప్పగించనుంది. కాకినాడ (385), తూర్పుగోదావరి (342), కోనసీమ(342) జిల్లాల్లో త్వరలో ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు పంచాయతీ వర్గాలు తెలిపాయి.

March 26, 2026 / 08:01 AM IST

ఈనెల 31న మెగా జాబ్ మేళా

శ్రీకాకుళం నగరంలో ఈనెల 31న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అభ్యుదయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి మేళా నిర్వహిస్తారు. 15 ప్రైవేటు సంస్థలు పాల్గొని 500 పైగా నియా మకాలు చేపట్టనున్నారు. వివరాలకు 9550967353, 8985675886 నంబర్లను సంప్రదించాలన్నారు.

March 26, 2026 / 08:00 AM IST

ఎస్టీ ఛైర్మన్‌తో స్దానిక ఎమ్మెల్యే భేటీ

PPM: జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎస్‌.బొజ్జిరెడ్డిని బుధవారం స్దానిక MLA బోనెల విజయ్‌ చంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఛైర్మన్‌ని శాలువాతో సత్కరించి, పూలబొకే అందజేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం పార్వతీపురంలో గిరిజనుల సమస్యలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ఇరువురు చర్చలు జరిపారు.

March 26, 2026 / 08:00 AM IST

బీటెక్ విద్యార్థినిపై ఫిర్యాదు.. కోర్టులో ప్రేమ వివాహం

GNTR: అమరావతిలో బీటెక్ చదువుతున్న యువతిని అక్రమంగా నిర్బంధించారని తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణలో ఆమె స్వచ్ఛందంగా ఆనంద్‌ను పెళ్లి చేసుకున్నానని వెల్లడించింది. తల్లిదండ్రులతో వెళ్లనని, భర్తతోనే ఉంటానని చెప్పడంతో, ఆమె మేజర్ కావడంతో కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.

March 26, 2026 / 07:46 AM IST

వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో తనిఖీలు

CTR: వీకోట వ్యవసాయ మార్కెట్ యార్డులో దుకాణాల వద్ద ఉన్న తూనికల యంత్రాల్లో తేడా వస్తే కేసులు తప్పవని జిల్లా తూనికల కొలతల శాఖ అసిస్టెంట్ కమిషనర్ స్వామి హెచ్చరించారు. మార్కెట్ యార్డ్‌లోని మండీలను ఆయన తనిఖీ చేశారు. తూనికలు శాఖ ప్రమాణాలను నిర్ధారిస్తూ యంత్రాలకు సీలు వేస్తామని, వాటిని తొలగించి మోసం చేసి పట్టుబడితే కేసు నమోదు చేస్తామన్నారు.

March 26, 2026 / 07:43 AM IST

మాతృ, శిశు మరణాలు జరగకుండా చూడాలి: కలెక్టర్

VZM: జిల్లాలో మాతృ, శిశు మ‌ర‌ణాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. మ‌ర‌ణాలు సంభవించకుండా ప్ర‌జ‌ల ప్రాణాల ర‌క్ష‌ణ కోస‌మే వైద్య అధికారులు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. మీటర్నల్ చైల్డ్ డెత్ సర్వేలెన్స్ రెస్పాన్స్ కమిటీ మూడు, నాలుగు క్వార్టర్లుకు సంబంధించి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు .

March 26, 2026 / 07:40 AM IST

వన్నె చింతలపూడిలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం

కోనసీమ: అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి గ్రామంలో బుధవారం రాత్రి అమలాపురం రూరల్ ఎస్సై శేఖర్ బాబు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామస్తులతో వివిధ సమస్యలపై చర్చించారు. సోషల్ మీడియా గ్రూపులను బాధ్యతాయుతంగా ఉపయోగించడం, మాదకద్రవ్యాలకు నిర్మూలన, మోటారు వాహన నియమాల ప్రాముఖ్యత, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి అవగాహన కల్పించారు.

March 26, 2026 / 07:34 AM IST

మొక్కజొన్న పంటలను పరిశీలన

NDL:  పాములపాడు మండలంలోని రుద్రవరంలో మొక్కజొన్న పంటలను వ్యవసాయ శాస్త్రవేత్తలు బుధవారం పరిశీలించారు. మొక్కజొన్న పంటకు కంకులు రావడం లేదని ఫిర్యాదులు రావడంతో వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశీలించినట్లు సమాచారం. రైతుల నుంచి శాస్త్రవేత్తలు పలు రకాల సమాచారాన్ని సేకరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

March 26, 2026 / 07:34 AM IST

కర్నూలు మెడికల్ కాలేజీకి అరుదైన గౌరవం

KRNL: పుదుచ్చేరిలోని నిర్వహించిన అంతర్జాతీయ వైద్య సదస్సు ‘కోయిసైన్సెస్ 8.0’లో కర్నూలు మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రతిభ చాటారు. కఠినమైన డిబేట్ పోటీల్లో ఫైనల్‌కు చేరిన KMC ఫైనల్ ఇయర్ విద్యార్థి కార్తీక్ అంతర్జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. ఈ విజయంతో కర్నూలు మెడికల్ కాలేజీకి ‘సర్టిఫికెట్ ఆఫ్ హానర్స్’ ప్రదానం చేసింది.

March 26, 2026 / 07:30 AM IST

కూర్మనాథ ఆలయ ఆదాయం ఎంతంటే..?

SKLM: గార మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో బుధవారం హుండీలు తెరిచి కానుకలు లెక్కించారు. ఈవోలు వాసుదేవరావు, గుర్నాథరావు పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది, భక్తులు లెక్కించారు. 98 రోజులకు రూ.19.76 లక్షలు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, వైదిక సిబ్బంది, సాధారణ దుస్తులు ధరించిన భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

March 26, 2026 / 07:30 AM IST

పూర్తిస్థాయి రైళ్ల ప్రతిపాదనలో తాత్కాలిక వాయిదా

VSP: విశాఖ- ఎస్ఎంవీ బెంగళూరు (08581/08582) మే మొదటి వారం వరకు ప్రత్యేక సర్వీసులుగానే నడుస్తాయని వాల్తేర్ సీనియర్ డీసీఎం పవన్ తెలిపారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సర్వీసులను పూర్తిస్థాయి వారాంతపు రైళ్లుగా మార్పు చేసే ప్రతిపాదన వాయిదా వేసినట్లు చెప్పారు. పూర్తిస్థాయి ప్రతిపాదనలు వాయిదా పడిన విషయాలు ప్రయాణికులు గమనించాలన్నారు.

March 26, 2026 / 07:30 AM IST