• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వంతెన నిర్మాణానికి మంత్రికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే

NTR: జి.కొండూరు(M) వెలగలేరులో పోలవరం కుడి ప్రధాన కాలువపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడుకు, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గురువారం విజ్ఞప్తి చేశారు. ఏపీ సచివాలయంలో మంత్రిని, ఎమ్మెల్యే రైతు సోదరులతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇక్కడ వంతెన లేకపోవడంతో స్థానిక రైతుల సమస్యలను వివరించారు.

March 26, 2026 / 09:10 PM IST

గ్యాస్ సరఫరా‌పై అసత్య ప్రచారాలు చేయొద్దు: DSO

కోనసీమ: జిల్లాలో గ్యాస్ సరఫరాపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్‌వో ఉదయ భాస్కర్ హెచ్చరించారు. గురువారం గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించవద్దని తెలిపారు. వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ఏజెన్సీల వద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. 

March 26, 2026 / 09:08 PM IST

కూలీలకు బిల్లులు విడుదల చేయాలి: సీపీఐ

NDL: ఉపాధి హామీ కార్మికులకు 3 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ బనగానపల్లె మండల కార్యదర్శి శివయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పండుగలపై ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు కూలీల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే బిల్లులు విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

March 26, 2026 / 09:01 PM IST

శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి మండిపల్లి

అన్నమయ్య: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు చూపిన ధర్మ మార్గాన్ని అనుసరించాలని సూచిస్తూ, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు పాత్ర పోషించాలని సూచించారు.

March 26, 2026 / 09:01 PM IST

భూ సమస్యల పరిష్కారంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి

ATP: జిల్లాలో నిషేధిత జాబితాలో ఉన్న 22ఏ, డాటెడ్ ల్యాండ్స్ సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, DRO మాలోలతో కలిసి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వందలాది క్లెయిమ్స్ పరిశీలించి, అర్జీలను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

March 26, 2026 / 09:00 PM IST

‘ఎల్ఆర్ఎస్ ఫైళ్లకు స్పెషల్ డ్రైవ్’

TPT: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. అవసరమైతే ‘స్పెషల్ డ్రైవ్’ నిర్వహించి ఫైళ్లను క్లియర్ చేయాలని సూచించారు. పూర్తి డాక్యుమెంట్లు ఉన్న ఫైళ్లను వెంటనే ఆమోదించి, చిన్న కారణాలతో పెండింగ్‌లో ఉన్నవాటిని తొందరగా పరిష్కరించాలని పేర్కొన్నారు.

March 26, 2026 / 09:00 PM IST

ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు: ఎస్పీ

సత్యసాయి: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు విరాజిల్లాలని ఆకాంక్షించారు. శ్రీరామనవమి వేడుకలను భక్తి శ్రద్దలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

March 26, 2026 / 08:53 PM IST

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే బత్తుల సమీక్ష

KKD: రాజానగరం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి సంబంధించి సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు తయారు చేయాలని MLA బత్తుల బలరామకృష్ణ ఆదేశించారు. గురువారం రాజానగరంలో పంచాయతీరాజ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో MLA సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

March 26, 2026 / 08:47 PM IST

గన్నవరంలో రూ.25 కోట్ల రుణాల పంపిణీ

కృష్ణా: గన్నవరంలో KDCC బ్యాంక్ ఆధ్వర్యంలో రైతులు, డ్వాక్రా మహిళలు, గృహ రుణాల కోసం రూ.25 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు గురువారం చెక్కులు అందజేశారు. గ్రామీణ ఆర్థికాభివృద్ధికి సహకార వ్యవస్థ బలోపేతం చేస్తున్నామని రఘురాం తెలిపారు.

March 26, 2026 / 08:45 PM IST

‘టీబీ నిర్మూళన’ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

NLR: 100 రోజుల ఇంటెన్సిఫైడ్ టీబీ క్యాంపెయిన్ కార్యక్రమం పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా వైద్యాధికారి సుజాత కలిసి గురువారం ఆవిష్కరించారు. 100 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లా ప్రజలు ఉచితంగా ఎక్స్‌రే పరీక్షలు చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బంది 100 రోజుల్లో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు.

March 26, 2026 / 08:40 PM IST

విగ్రహాల ఏర్పాటుకు సన్నాహాలు

ATP: కళ్యాణదుర్గం వాల్మీకి సర్కిల్‌లో వాల్మీకి మహర్షి, డా. అంబేడ్కర్ విగ్రహాల ఏర్పాటుకు MLA సురేంద్రబాబు శ్రీకారం చుట్టారు.రూ.50 లక్షలు తన సొంత నిధులు వెచ్చించి సర్కిల్ అభివృద్ధి, విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఈ విగ్రహాలు గురువారం కళ్యాణదుర్గం ప్రజా వేదికకు చేరుకున్నాయి. త్వరలోనే వీటిని ప్రతిష్ఠించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

March 26, 2026 / 08:39 PM IST

ఏనుగుల గుంపు హల్ చల్

PPM: భామిని మండలంలోని నేరడు గ్రామానికి సమీపంలో ఏనుగుల గుంపు గురువారం హల్ చల్ చేశాయి. నాలుగు ఏనుగులు పొలాల్లోకి ప్రవేశించి పంటలు నాశనం చేశాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏనుగుల గుంపు వరి మొక్కజొన్న పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగులను దారి మళ్లించి అటవీ ప్రాంతానికి తరలించాలన్నారు.

March 26, 2026 / 08:36 PM IST

భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

E.G: శ్రీరామ నవమి సందర్భంగా రాజమండ్రి డిపో మేనేజర్ కె. మాధవ్ ఈ నెల 27న రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. రాజమండ్రి నుంచి ప్రతి గంటకు ఒక బస్సు నడుపుతామని , ముందస్తు రిజర్వేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 26, 2026 / 08:35 PM IST

‘దళితుల రక్షణపై ప్రభుత్వం స్పందించాలి’

KRNL: దళితులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాలని దళిత హక్కుల పోరాట సమితి DHPS జిల్లా కార్యదర్శి మహేశ్ డిమాండ్ చేశారు. ఆదోనిలో ఇవాళ జరిగిన DHPS పట్టణ సమితి సదస్సులో ఆదోని నియోజకవర్గ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దళితులపై కుల వివక్షను సహించబోమని హెచ్చరించారు. దళితులపై దాడులు జరిగితే వెంటనే కేసులు నమోదు చేయాలని కోరారు.

March 26, 2026 / 08:34 PM IST

నంద్యాల పాలిటెక్నిక్‌లో ఉచిత శిక్షణ

NDL: నంద్యాలలోని ESC ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో POLYCET-2026 ఉచిత శిక్షణ తరగతులు వచ్చే నెల 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ గురువారం తెలిపారు. SSC లేదా సమాన పరీక్ష రాసిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఏప్రిల్ 2లోపు దరఖాస్తులు సమర్పించాలి. విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందిస్తామని చెప్పుకొచ్చారు.

March 26, 2026 / 08:33 PM IST