• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

లాయర్ హత్య కేసులో కానిస్టేబుళ్ల అరెస్ట్

పల్నాడు: జిల్లాలో లాయర్ హరిప్రసాద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ ఆఫీసులో పనిచేసే కానిస్టేబుళ్లు వెంకట కోటయ్య, శ్రీనివాసరావులను అరెస్ట్ చేశారు. మృతుడి భార్యతో కోటయ్యకున్న వివాహేతర సంబంధమే ఈ దారుణానికి కారణమని డీఎస్పీ తెలిపారు. శుక్రవారం యడవల్లి వద్ద ఇనుప రాడ్, బండరాయితో దాడి చేసి హరిప్రసాద్‌ను వీరు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

April 13, 2026 / 07:18 AM IST

క్రికెట్ బెట్టింగ్‌ను అరికట్టేందుకు పోలీసుల తనిఖీలు

NLR: కందుకూరు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్‌ను అరికట్టేందుకు ఆదివారం రాత్రి పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పామూరు రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల మొబైల్ ఫోన్లను పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ పులి శివ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

April 13, 2026 / 07:16 AM IST

ఈ నెల 15 నుంచి వేసవి క్రీడలు

VZM: చీపురుపల్లిలో ఈ నెల 15 నుంచి వేసవి క్రీడలు ప్రారంభం కానున్నాయి. TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ మల్లిక్‌ నాయుడు క్రీడలకు సంభందించిన షెడ్యూల్‌ను ఆదివారం విడుదల చేశారు. ఇందులో MPL పేరుతో క్రికెట్‌ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెల 1 వరకు జరిగే పోటీలలో విజేతలకు రూ. 60,000 విలువ గల బహుమతులు అందించనున్నామని తెలిపారు.

April 13, 2026 / 07:15 AM IST

వారసత్వంగా రూ.14 లక్షల కోట్లు అప్పు: మంత్రి

W.G: వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా రూ.14 లక్షల కోట్లు అప్పు ఇచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. ఆదివారం తణుకు మండలం ముద్దాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి నిమ్మల మాట్లాడారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వేసిన ఓటు విధ్వంసానికి దారి తీసిందని చెప్పారు.

April 13, 2026 / 07:12 AM IST

ఆలయ కుంభవిషేకం వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి

CTR: నగరి మున్సిపల్‌ పరిధి కరకంఠాపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ విజయగణపతి ఆలయం మహా కుంభాభిషేక వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పూర్ణాహుతి పూజలు, కలశపూజల్లో ఆమె పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

April 13, 2026 / 07:10 AM IST

రాప్తాడులో రాక్షస పాలన సాగుతోంది: తోపుదుర్తి

ATP: ఆత్మకూరు మండలం వడ్డిపల్లిలో జరిగిన సర్పంచ్, వార్డు సభ్యుల పదవీ విరమణ సన్మాన సభలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం రాప్తాడులో రాక్షస పాలన సాగుతోందని ఆయన మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో పేరూరు డ్యాంకు నీరు అందించి రైతులను ఆదుకున్నామని, MLA సునీత మాత్రం నియోజకవర్గానికి కరువును కానుకగా ఇచ్చారని విమర్శించారు.

April 13, 2026 / 07:09 AM IST

‘విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరాలి’

AKP: విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ఎలమంచిలి మండలం పెద్దపల్లి జడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఉమామహేశ్వరి విజ్ఞప్తి చేశారు. ఆదివారం స్థానిక జడ్పీ హైస్కూల్లో ఆకర్ష్ ఖేల్ కూద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వారికి వివరించారు.

April 13, 2026 / 07:08 AM IST

బ్యాట్ పట్టి క్రికెట్ ఆడిన కేంద్ర మంత్రి

SKLM: శ్రీకాకుళం జెమ్స్ గ్రౌండ్స్‌లో సిక్కోలు సోషల్ మీడియా అసోసియేషన్ సిక్కోలు క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ ముగింపు పోటీలలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా ఖ్యాతిని వివరిస్తూ, సానుకూల కథనాలను ప్రచారం చేయాలని కేంద్రమంత్రి అన్నారు కేంద్ర మంత్రి కాసేపు బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు.

April 13, 2026 / 07:05 AM IST

నేడు డయల్ యువర్ సీఎండి

KDP: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు నేడు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు APSPDCL CMD శివశంకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. నేడు ఉదయం 10 నుంచి 12 వరకు తిరుపతి సంస్థ కార్పొరేట్ కార్యాలయం నుంచి కార్యక్రమం ఉంటుందన్నారు. వినియోగదారులు ఈ సమయంలో 8977716661 నెంబరుకు ఫోన్ చేసుకోవచ్చు అన్నారు.

April 13, 2026 / 07:03 AM IST

పెరిగిన కోడి గుడ్డు ధర.. రైతుల హర్షం

కోనసీమ: కోడిగుడ్డు ధర రూ.5.10 చేరింది. ఈ నెల 7వ తేదీన రూ.4.35 ఉన్న కోడిగుడ్డు రోజు రోజుకి పెరుగుతూ ఈ ధరకు చేరింది. ఉమ్మడి గోదావరి జిల్లాలో నెల రోజుల కిందట కోడిగుడ్డు ధర రూ.3.80పైసలకు దిగజారడంతో రైతులు నష్టాలు చెవిచూశారు. ప్రస్తుతం కోడిగుడ్లకు డిమాండ్ నెల కొనడంతో ధర పెరుగుతోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు .

April 13, 2026 / 07:00 AM IST

పశ్చిమలో పెళ్లి సందడి.. మే 9వరకు లగ్గాలు

పశ్చిమ గోదావరి జిల్లాలో పెళ్లి సందడి మొదలైంది. గత రెండు నెలలుగా శుక్ర మౌడ్యమి కారణంగా ఆలస్యం ఆయన వివాహాలు ఆదివారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఆదివారం రాత్రి తాడేపల్లిగూడెంలో వివాహాలు భారీగా జరిగాయి. కళ్యాణ మండపంలు దొరకని పరిస్థితో హడావుడిగా చేశారు. మే 9వరకు లగ్గాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

April 13, 2026 / 06:59 AM IST

‘రోడ్డుపై నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు’

NLR: ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు నిబంధనల అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఉదయగిరి సీఐ వెంకట్రావు తెలిపారు. ఆదివారం రాత్రి ఉదయగిరిలో ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ట్రావెల్స్ పత్రాలను పరిశీలించి సేఫ్టీ మెజర్‌మెంట్స్ పాటిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు.

April 13, 2026 / 06:56 AM IST

నేడు ఆక్వా చెరువులకు కరెంట్ కట్

W.G: కోళ్లపర్రు 33/11 KV విద్యుత్ ఉపకేంద్రంలోని 11KV కోళ్లపర్రు ఫీడర్ వార్షిక మరమ్మతుల్లో భాగంగా చెట్లు ఆకులు తొలగించనున్నారని ఈఈ వెంకటేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగా నేడు ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు కోళ్లపర్రు, ఆకివీడు, నక్కలపుంత పరిధిలోని ఆక్వా చెరువుల లైన్‌లలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందన్నారు. 

April 13, 2026 / 06:50 AM IST

కొమ్మలకే కాదు.. కాండానికి కూడా కాయలే..!

KKD: యు. కొత్తపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉన్న ఓ పనస చెట్టు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా చెట్టు కొమ్మల వద్ద మాత్రమే కాయలు కాస్తాయి. అయితే ఈ చెట్టు మాత్రం నేల నుంచి చెట్టు చివరి వరకు వందల సంఖ్యలో పనసకాయలు కాసి అరుదైన దృశ్యంగా మారింది. ఈ విశేషాన్ని చూసేందుకు ఎంపీడీవో కార్యాలయానికి ప్రజలు చేరుకుంటున్నారు

April 13, 2026 / 06:50 AM IST

రౌడీ షీటర్లు పద్ధతి మార్చుకోవాలి: డీఎస్పీ

KDP: నేర ప్రవృత్తిని వీడి, సమాజంలో సత్‌ప్రవర్తనతో మెలగాలని DSP వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం JMD పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై PD యాక్ట్ నమోదు చేస్తామని, అలాగే బైండోవర్ వంటి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని DSP స్పష్టం చేశారు. ఇందులో అర్బన్ సీఐ నరేశ్ బాబు, ఎస్ఐ రామకృష్ణ పాల్గొన్నారు.

April 13, 2026 / 06:49 AM IST