W.G: కోళ్లపర్రు 33/11 KV విద్యుత్ ఉపకేంద్రంలోని 11KV కోళ్లపర్రు ఫీడర్ వార్షిక మరమ్మతుల్లో భాగంగా చెట్లు ఆకులు తొలగించనున్నారని ఈఈ వెంకటేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగా నేడు ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు కోళ్లపర్రు, ఆకివీడు, నక్కలపుంత పరిధిలోని ఆక్వా చెరువుల లైన్లలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందన్నారు.