• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి జిల్లాలో పర్యటించనున్న మంత్రి

నెల్లూరు జిల్లాలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రెండు రోజుల పర్యటన ఖరారైంది. రేపు (ఏప్రిల్ 17) ఉదయం పెంచలకోన చేరుకోనున్నారు. అక్కడ జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం 18వ తేదీన శనివారం నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగే సాగునీటి సలహా మండలి (IAB) సమావేశంలో పాల్గొన్నారు.

April 17, 2026 / 08:40 AM IST

ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్

PLD: రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఇసుక కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు జిల్లాలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ ఉంచేలా పక్కా కార్యాచరణ సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

April 17, 2026 / 08:39 AM IST

మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన

ATP: రాప్తాడు మైనార్టీ కాలనీలో మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు స్త్రీరక్ష పోర్టల్, శక్తి యాప్ వినియోగం గురించి వివరించారు. గృహ హింస, సైబర్ నేరాలు, వేధింపుల నుంచి చట్టపరమైన రక్షణ ఎలా పొందాలో మహిళలకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

April 17, 2026 / 08:36 AM IST

గిరిజన సంప్రదాయానికి జేసీ గౌరవం

ASR: బూరుగ గ్రామంలో సంయుక్త కలెక్టర్ శ్రీపూజ పర్యటన సందర్భంగా ప్రత్యేక దృశ్యం కనిపించింది. గ్రామానికి వచ్చిన జేసీకి స్థానిక గిరిజనులు తమ సంప్రదాయం ప్రకారం మోకాళ్లపై నిల్చుని నమస్కరించారు. దీనికి స్పందించిన జేసీ కూడా మోకాళ్లపై నిల్చుని వారికి ప్రతినమస్కారం చేయడం విశేషంగా నిలిచింది. తమ ఆచారాన్ని గౌరవించిన అధికారిని చూసి గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు.

April 17, 2026 / 08:36 AM IST

అలర్ట్.. నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

E.G: రాజమండ్రి నగరంలోని మల్లయ్యపేట సబ్ స్టేషన్ పరిధిలో RDSS పనుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు EE నక్కపల్లి శామ్యూల్ గురువారం తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆనంద్ నగర్, పేపర్ మిల్ క్వార్టర్స్, రామకృష్ణ నగర్, ఇందిరానగర్, శానిటోరియం,వెంకటాపురం తదితర ప్రాంతాల్లో కోత ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. 

April 17, 2026 / 08:31 AM IST

కన్నీటిని దిగమింగి.. విజయానికి చేరిన సాయి వర్మ

కోనసీమ: ఇంటర్ ఫలితాల్లో పాసర్లపూడికి చెందిన ఆటో డ్రైవర్ కుమారుడు సాయివర్మ 981 మార్కులతో అద్భుత ప్రతిభ చాటాడు. ఏడాది క్రితం తల్లి పాముకాటుతో మరణించినా, ఆ విషాదాన్ని దిగమింగుకొని ప్రభుత్వ కళాశాలలో చదివి ఈ ఘనత సాధించాడు. గురువారం జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సాయివర్మను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. ఐఐటీలో చేరాలన్నదే తన ఆశయం అని విద్యార్థి అన్నారు.

April 17, 2026 / 08:30 AM IST

వినుకొండలో నేడు ప్రజా దర్బార్: జీవీ ఆంజనేయులు

పల్నాడు: వినుకొండ పట్టణం కొత్తపేటలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల వినతులను నేరుగా స్వీకరించనున్నారు. ప్రజలు తమ సమస్యలు, విజ్ఞప్తులను తెలియజేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యాలయం కోరింది.

April 17, 2026 / 08:29 AM IST

‘జనగణన గడువుకు ముందే విజయవంతం చేయాలి’

PPM: జనగణన 2027 ప్రక్రియలో ఖచ్చితమైన సమాచారంతో గడువుకు ముందే విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. దేశ సేవ అంటే కేవలం తుపాకీ పట్టడమే కాదని, ఇలాంటి జాతీయ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం కూడా దేశ సేవకు వస్తుందని గుర్తు చేశారు. సమావేశంలో సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, తదితరులు పాల్గొన్నారు.

April 17, 2026 / 08:28 AM IST

చైన్ స్నాచింగ్ పై అవగాహన కల్పించిన ఎస్సై

VZM: చైన్‌ స్నాచింగ్‌ విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని వంగర ఎస్సై షేక్ శంకర్ సూచించారు. గురువారం సాయంత్రం స్దానిక‌ మడ్డువలస జంక్షన్‌ వద్ద వైన్‌ స్నాచింగ్‌, రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు, వృద్ధులు బయటకు వెళ్లే సమయంలో బంగారు ఆభరణాలు బహిరంగంగా ధరించకుండా జాగ్రత్త వహించాలన్నారు.

April 17, 2026 / 08:22 AM IST

కడప జిల్లాకు రానున్న YS జగన్..?

KDP: ఖాజీపేటలోని అగ్రహారానికి చెందిన కీర్తన ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఈ నెల 19 మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఈ పర్యటన అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. అలాగే అలంఖాన్ పల్లెలో పెద్ద దస్తగిరి కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు.

April 17, 2026 / 08:20 AM IST

2029 నాటికి ప్రతి పేదవాడికీ సొంతిల్లు: మంత్రి

SKLM: ప్రతి పేదవాడికి 2029 నాటికి సొంతిల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రూ. 900 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించి, అర్హులందరికీ పారదర్శకంగా గృహాలను అందిస్తుంది అని అన్నారు.

April 17, 2026 / 08:20 AM IST

ముగిసిన నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు

AKP: అనకాపల్లి పట్టణం గవరపాలెంలో నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు గురువారం వైభవంగా ముగిసాయి. నెలరోజులపాటు జరిగిన ఉత్సవాల్లో లక్షలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 5,000 మంది మహిళలు అమ్మవారి ఘటాలతో పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

April 17, 2026 / 08:17 AM IST

తెనాలిలో న్యూడ్ కాల్స్ రాకెట్ బట్టబయలు

గుంటూరు: తెనాలి చెంచుపేటలో ఆన్‌లైన్ ద్వారా అసభ్య వీడియో కాల్స్ నిర్వహిస్తున్న రాకెట్ బయటపడింది. మహిళలను ఉపయోగించి డబ్బులు దోచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడైన మహిళ కుమారుడు పరారీలో ఉండగా గాలింపు కొనసాగుతోంది. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

April 17, 2026 / 08:15 AM IST

నేడు గుండ్లసముద్రంలో కలెక్టర్ పల్లె నిద్ర

ప్రకాశం: జిల్లా కలెక్టర్ రాజబాబు నేడు పల్లె నిద్రకు మర్రిపూడి మండలం గుండ్లసముద్రం వస్తున్నట్లు తహశీల్దార్ జనార్ధన్ తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో జిల్లా స్థాయి అధికారులు పల్లె నిద్రకు వస్తున్నారన్నారు. జువ్విగుంట విద్యుత్ శాఖ ఎస్.ఈ, అంకెపల్లి డ్వామా పీడీ, మర్రిపూడి డీఆర్డీఏ పీడీ, అధికారులు వస్తున్నట్లు తెలిపారు.

April 17, 2026 / 08:13 AM IST

స్విమ్స్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ నియామకం

తిరుపతి SVIMS శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల ఇంఛార్జ్ ప్రిన్సిపల్‌గా కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా. కొండగుంట నాగరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. డా. ఉషాకళావత్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆమె స్థానంలో నాగరాజును నియమించినట్లు స్విమ్స్ డైరెక్టర్ డా.ఆర్.వీ. కుమార్ తెలిపారు. నిబద్ధతతో పనిచేసి SVIMSకు ఆమె మంచి పేరు తెచ్చారని కొనియాడారు.

April 17, 2026 / 08:12 AM IST