• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో బి. కొత్తకోట యువకుడు మృతి

అన్నమయ్య: కర్ణాటకలోని హోస్కోట వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగుట్లపల్లికి చెందిన శ్రీహరి (27) దుర్మరణం చెందారు. బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న శ్రీహరి, స్వగ్రామంలో పనులు ముగించుకుని బైక్‌పై బెంగళూరుకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కొడుకు మృతితో నల్లగుట్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

February 27, 2026 / 05:10 AM IST

సీఐ, అడ్వకేట్ మధ్య వార్ ముగింపు

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరాకు అడ్వకేట్ పవన్ కుమార్ వినతి పత్రం అందజేశారు. ఫిబ్రవరి 21న 4వ పట్టణ సీఐ విక్రమ సింహాతో జరిగిన వివాదాన్ని పరస్పర చర్చలతో సఖ్యంగా పరిష్కరించుకున్నామని, ఎవరి ప్రమేయం లేదని, ఎవరిపై చర్యలు తీసుకోవద్దని లిఖితపూర్వకంగా కోరారు. ఈ అంశం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

February 27, 2026 / 04:35 AM IST

వెలుగోడులో పుచ్చకాయలకు పెరిగిన డిమాండ్

NDL: ఎండాకాలం వచ్చిందంటే పుచ్చకాయల అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే వెలుగోడులో వేసవికి కొన్ని రోజుల ముందే పుచ్చకాయలు వచ్చినప్పటికీ వాటికి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఒక్కొక్క పుచ్చకాయ ధర రూ.160 నుంచి రూ.240 వరకు ఉండటంతో ప్రజలు కొనుగోలు చేయడానికి బెంబేలెత్తి పోతున్నారు.

February 27, 2026 / 04:13 AM IST

ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ: కలెక్టర్

ELR: మార్చి నెల పెన్షన్‌ను ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 28వ తారీఖున పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ వెట్రి సెల్వి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,57,658 మంది పింఛన్ దారులకు 113.09 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 28వ తేదీన తీసుకోని వారికి 2న పంపిణీ చేస్తారన్నారు.

February 26, 2026 / 09:50 PM IST

చిందేపల్లిలో ఘనంగా రక్తదాన శిబిరం

TPT: ఏర్పేడు మండలం చిందేపల్లి గ్రామంలో గురువారం రక్తదాన శిబిరం ఉత్సాహంగా నిర్వహించారు. డా. గంగలపూడి గిరిధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ శిబిరంలో తిరుపతి రక్షణ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు రక్తాన్ని సేకరించారు. గ్రామానికి చెందిన సుమారు 35 మంది యువకులు, పెద్దలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

February 26, 2026 / 09:34 PM IST

ఇంటి పన్ను వసూళ్లను పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో

ELR: ఉంగుటూరు(మం) రాచూరులో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి ఇంటి పన్ను, కుళాయి పనులు వసూళ్లు చేస్తున్నారు. డిప్యూటీ ఎంపీడీవో జీ. రమేష్ బాబు పన్ను వసూళ్లను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలములో ఇంటి పన్ను వసూళ్లు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. పంచాయతీ కార్యదర్శి సుజాత, సచివాలయ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

February 26, 2026 / 09:33 PM IST

రైతులకు ఈ-నామ్ 2.0 రిజిస్ట్రేషన్ తప్పనిసరి

KRNL:: వ్యవసాయ మార్కెట్ యార్డులో పంటలు విక్రయించే రైతులు ఈ-నామ్ 2.0 పోర్టల్లో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని కార్యదర్శి గోవిందు ఇవాళ స్పష్టం చేశారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ అమలులో భాగంగా తెచ్చిన ఈ కొత్త నిబంధన వల్ల రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని వెల్లడించారు. మార్చి నుంచి రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.

February 26, 2026 / 09:31 PM IST

పుంగనూరులో బ్రహ్మోత్సవాల సందడి

అన్నమయ్య: పుంగనూరు టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు యోగ నరసింహ స్వామి అలంకారంలో సింహ వాహనంపై పుర వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. మంగళ వాయిద్యాలు, భజన కోలాటాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయంలో విశేష హోమాలు, అన్నప్రసాద వితరణ కొనసాగుతున్నాయి.

February 26, 2026 / 09:23 PM IST

మార్చి 8న ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం: సత్యం

కోనసీమ: మార్చి 8న ద్రాక్షారామంలో జరిగే ఏఎంసీ ఛైర్మన్‌గా అక్కల రిశ్వంతరాయ్, డైరెక్టర్లు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం పిలుపునిచ్చారు. గురువారం ద్రాక్షారామంలో వాసవి కళ్యాణ మండపంలో కూటమి నాయకులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆరోజు ముఖ్య అతిథిగా మంత్రి సుభాష్ పాల్గొంటారన్నారు.

February 26, 2026 / 08:59 PM IST

వీ.కోట మార్కెట్‌లో క్రేట్ల దొంగలు..!

CTR: వీ.కోట మార్కెట్‌లోని మండీల వద్ద ఉంచిన క్రేట్లను కొంతమంది తరచూ దొంగలించుకుపోతున్నారు. దీంతో అనుమానం వచ్చిన యజమానులు స్క్రాప్ దుకాణాల్లో విచారించారు. ఓ దుకాణంలో సుమారు 500 క్రేట్ల దాకా కనుగొని యజమానిని నిలదీశారు. ప్రతి రోజు ఎవరో ఒకరు 5, 10 క్రేట్లు తెచ్చి విక్రయిస్తుంటారని సమాదానం ఇచ్చాడు.

February 26, 2026 / 08:49 PM IST

భాస్కర్‌ను పరామర్శించిన ఎమ్మార్పీఎస్ నేతలు

KRNL: వెల్దుర్తి(మం) కలుగొట్ల గ్రామానికి ఎమ్మిగనూరు ఎమ్మార్పీఎస్ నేతలు వెళ్లి జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు భాస్కర్‌ను పరామర్శించారు. ఇటీవల ఆయనపై జరిగిన హత్యాయత్నం నుంచి ప్రాణాపాయం తప్పించుకున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఘటనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

February 26, 2026 / 08:45 PM IST

జనార్ధన స్వామి వారిని దర్శించిన రాజానగరం ఎమ్మెల్యే

తూ.గో: నవ జనార్ధన ఆలయాల్లో ప్రముఖమైన ఆలమూరు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి వారి ఆలయాన్ని గురువారం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ పాలకమండలి ఛైర్మన్ బైరిశెట్టి రాంబాబు స్వాగతం పలికారు. స్వామి వారిని ఎమ్మెల్యే బత్తుల దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 26, 2026 / 08:45 PM IST

‘ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోండి’

SKLM: నిరుద్యోగులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎచ్చెర్ల గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో పీఎం ఉపాధి కల్పన పథకం, సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల పథకం లబ్ధిదారులకు నుంచి శిక్షణ ప్రారంభమైంది. ఈ శిక్షణను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 26, 2026 / 08:44 PM IST

వీపీఆర్ దంపతులను కలిసిన మేయర్

నెల్లూరు: నగర కార్పొరేషన్‌ మేయర్‌‌గా నూతనంగా ఎన్నికైన దేవరకొండ సుజాత దంపతులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె వారిని శాలువాతో సత్కరించి ఆశీసులు అందుకున్నారు. ఈ సందర్భంగా మేయర్‌కు వీపీఆర్‌ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని సూచించారు.

February 26, 2026 / 08:44 PM IST

డయేరియా కట్టడికి కఠిన చర్యలు: జేసీ

SKLM: డయేరియాను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోందని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలలో ఫాస్ట్ ఫుడ్, మాంసం దుకాణాల తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. పరిశుభ్రత పాటించడం ద్వారా పరిస్థితిని వేగంగా అదుపులోకి తేవచ్చని తెలిపారు.

February 26, 2026 / 08:43 PM IST