ASR: సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అరకు వ్యాలీలో ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొర ‘ప్రజా వేదిక’ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
VZM: గుర్ల మండలం గరికివలస అంగన్వాడీ సెంటర్లో శుక్రవారం ఐసీడీఎస్ సూపర్వైజర్ శకుంతల ‘మిషన్ శక్తి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా PMMVY స్కీమ్ పై గర్భిణీ, బాలింతలకు అవగాహన కలిగించారు. రక్తహీనత లేకుండా సరైన ఆహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వగలరని తెలిపారు. లైంగిక వేధింపులు నుండి రక్షణ పొందేందుకు తల్లిదండ్రులు ధైర్యాన్ని నింపాలన్నారు.
ప్రకాశం: పీసీపల్లి మండలంలోని విఠలాపురం గ్రామంలో వైసీపీ నాయకుడు భోగాల మాలకొండారెడ్డి కుమారుడు ప్రభాకర్ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ శుక్రవారం ప్రభాకర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఏలూరు: మండుటెండలను లెక్కచేయకుండా శుక్రవారం ఉంగుటూరు మండలంలో మండల స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. ఉంగుటూరు, బొమ్మిడి, కాగుపాడు గ్రామాలలో ఎంపీడీవో మనోజ్, మండల పరిషత్ సూపరిండెంట్ ఆంజనేయులు, డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబులు ఇంటింటికి వెళ్లి ఇంటి పన్ను, కుళాయి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
కోనసీమ తిరుమల వాడపల్లి సన్నిధిలో తణుకు వాస్తవ్యులు పుణ్యమూర్తుల రామచంద్ర స్వామీ, శసావిత్రి దంపతులు వేంకటేశ్వర స్వామి వారికి 350 గ్రాముల బంగారంతో సుమారు రూ. 60 లక్షల విలువగల మఖర తోరణం తయారు చేయించి ఇవాళ అందజేశారు. ఈ మఖర తోరణమునకు అర్చకులు సంప్రోక్షణ స్వామి వారికి అలంకరించారు. అనంతరం దాతలను ఆలయ సిబ్బంది అభినందించారు.
అన్నమయ్య: పీలేరు మండలంలోని దేవేంద్ర గోడౌన్‌లో ఇవాళ కడప విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 150 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ATP: గుత్తి మండలం తొండపాడు బొల్లికొండ రంగనాథ స్వామిని ఇవాళ టీడీపీ గుత్తి, పామిడి మండల ఇంఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. అనంతరం అతని కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.
E.G: గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులకు ఇవాళ శంకుస్థాపన జరిగింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన నిధుల నుంచి రూ. 30 లక్షలు కేటాయించగా, సూరంపాలెం ప్రాజెక్టు ఛైర్మన్ ఉంగరాల రాము కొబ్బరికాయ కొట్టి ఈ పనులను అధికారికంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.
ప్రకాశం: యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు హాజరై ప్రజా సమస్యలను అర్జీల రూపంలో అర్జీదారుల నుంచి తీసుకున్నారు. ప్రతి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా: మచిలీపట్నం మండలం కరగ్రహారం గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని డీహెచ్ఎంవో యుగంధర్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. రక్తపోటు, మధుమేహం, జ్వరాలు తదితర సాధారణ వ్యాధులపై పరీక్షలు చేసి, వైద్య సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
TPT: రాష్ట్ర గవర్నర్ శుక్రవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి సాదరంగా స్వాగతం పలికారు. గవర్నర్ రాక సందర్భంగా విమానాశ్రయంలో అధికారులు తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. పలువురు జిల్లా అధికారులు కూడా అక్కడికి చేరుకుని గవర్నర్‌కు స్వాగతం పలికారు.
W.G: నరసాపురం పాతబజార్ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద, గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
BPT: కర్లపాలెం మండలం ఎట్రావారిపాలెం పంచాయతీలో జరుగుతున్న ఇంటి పన్నుల వసూళ్ల కార్యక్రమాన్ని శుక్రవారం ఎంపీడీఓ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇంటి పన్నులు నూరుశాతం వసూలు చేయాలని సూచించారు. షాపులకు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ పన్నులు కూడా స్వర్ణ పంచాయతీ యాప్ ద్వారా చెల్లించేలా సచివాలయ సిబ్బంది చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఏలూరు: నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు నిర్వహించే ప్రజాదర్బార్‌లో అందిన వినతులు నిర్దేశించిన సమయంలోగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ప్రతీ దశలోనూ సంబంధిత సిబ్బందితో నియోజకవర్గ యూనిట్ కార్యాలయ సిబ్బంది పరిశీలించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న 10 సూత్రాల కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు.
SKLM: గొట్టా బ్యారేజీ వద్ద వంశధార ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేసి, ఏప్రిల్ నాటికి పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. హీరమండలం మండలంలో శుక్రవారం ఆయన పర్యటించి, జలాశయానికి నీటిని తరలించే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.