• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గుంతలమయంగా రోడ్డు.. వాహనదారుల ఇక్కట్లు

NLR: కొండాపురం మండలంలోని ఆదిమూర్తిపురం నుంచి తూర్పు ఎర్రబల్లి వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి గత కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకోక గుంతలమయంగా మారిందని బీజేపీ నేతలు, స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. రాళ్లు తేలి ప్రయాణానికి వీలులేకుండా ఉన్న ఈ దారి వల్ల విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు.

March 2, 2026 / 04:20 PM IST

నూకాలమ్మ ఆలయం వద్ద వేలంపాట

AKP: గొలుగొండ మండలం లింగంపేట నూకాలమ్మ అమ్మవారి కొత్త అమావాస్య జాతర సందర్భంగా తలనీలాలు, కొబ్బరి ముక్కలు పోగు చేసుకునే హక్కుకు సంబంధించి సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు. దేవాదాయశాఖ పర్యవేక్షణ అధికారి డి ఉమాదేవి, ఈవో సాంబశివరావు సమక్షంలో ఈ బహిరంగ పాట జరిగింది. సిహెచ్. శ్రీను రూ.66వేలకు పాటను ఖరారు చేసుకున్నారు.

March 2, 2026 / 04:18 PM IST

ఈనెల 4న బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో గోవుల వేలం

KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో ఈనెల 4న ఉదయం 10:30 గంటలకు పశువుల వేలం నిర్వహిస్తామని ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రాఘవేంద్ర చౌదరి, పశు విభాగ శాస్త్రవేత్త ఎంవీ నిరంజన్ రెడ్డి ఇవాళ తెలిపారు. 3 ఆవులు, ఒక ఎద్దు వేలం వేస్తున్నామని చెప్పారు. ఆసక్తి కలిగిన రైతులు వేలం పాటలో పాల్గొనాలన్నారు.

March 2, 2026 / 04:17 PM IST

‘అర్హులైన పాత్రికేయులంద‌రికీ అక్రిడేష‌న్లు’

VZM: అర్హులైన పాత్రికేయులంద‌రికీ అక్రిడేష‌న్ల‌ను మంజూరు చేస్తామ‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి అన్నారు. మొద‌టి విడ‌త మంజూరు చేసిన అక్రిడేష‌న్ కార్డుల‌ను త‌మ ఛాంబ‌ర్లో అక్రిడేష‌న్ క‌మిటీ స‌భ్యుల‌కు సోమ‌వారం ఆయన అంద‌జేశారు. మిగిలిపోయిన పాత్రికేయుల‌కు రెండో విడ‌త‌లో అక్రిడేష&zwn...

March 2, 2026 / 04:13 PM IST

‘జిల్లాలో 438 మంది గైర్హాజరు’

TPT: జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం జరిగాయి. జిల్లా 98 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 21,693 మంది విద్యార్థులకు గాను 21,255 మంది హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 438 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదని చెప్పారు.

March 2, 2026 / 04:13 PM IST

ఆలయ పునః నిర్మాణానికి రూ.1,16,222 విరాళం

కోనసీమ: పి.గన్నవరం మండలంలోని లంకల గన్నవరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునః నిర్మాణానికి గ్రామానికి చెందిన దివంగత పంతాల భాస్కరరావు కుటుంబ సభ్యులు రూ.1,16,222 విరాళాన్ని సోమవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం దాత కుటుంబ సభ్యులను ఆలయ పునః నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సత్కరించారు.

March 2, 2026 / 04:13 PM IST

అంబటి రాంబాబు కలిసిన వైసీపీ నేతలు

ELR: చింతలపూడి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ విజయరాజు ఆధ్వర్యంలో పలువురు నేతలు గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును సోమవారం కలిశారు. ఇటీవల వివిధ కేసులలో అరెస్టు విడుదలైన రాంబాబును పలువురు నేతలు పరామర్శించారు. ప్రజా పరిపరిపాలనను గాలికొదిలేసి ప్రజలను డైవర్ట్ చేయడం కోసం కొత్త కొత్త డ్రామాలను తెరపైకి తెస్తున్నారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

March 2, 2026 / 04:06 PM IST

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతుల స్వీకరణ

KRNL: కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇవాళ జిల్లా కలెక్టర్ ఏ.సిరి, JC నూరుల్ కమర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. వివిధశాఖలకు చెందిన అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి, నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కారం చూపాలన్నారు.

March 2, 2026 / 04:06 PM IST

దుష్ప్రచారం చేయడం అనైతికం: టీడీపీ

CTR: టీడీపీ నేతలపై డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేయడం అనైతికం, దారుణమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ ఖండించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పారదర్శకంగా విధులు నిర్వహిస్తుండటంతో కక్ష సాధింపుల రాజకీయాలకు దిగుతున్నారని విమర్శించారు. డీప్ ఫేక్ దుష్ప్రచారాలతో వ్యక్తిత్వ హననం చేయాలనే ప్రయత్నాలు ఫలించవన్నారు.

March 2, 2026 / 04:04 PM IST

‘డయేరియాను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలం’

SKLM: డయేరియా అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు అన్నారు. సోమవారం జిల్లా సీపీఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నగరంలోని మురికి నీరు, సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు, ఆస్పత్రి వ్యర్థాలను శుద్ధి చేయకుండా నాగావళి నదులలో కలపడం వల్ల ప్రజలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు.

March 2, 2026 / 04:04 PM IST

ఘనంగా వికసిత్ భారత్ యువజన పార్లమెంట్

VZM: JNTU–గురజాడ విజయనగరం విశ్వవిద్యాలయంలో మెరా యువ భారత్ సహకారంతో జిల్లా స్థాయి ‘వికసిత్ భారత్ యువజన పార్లమెంట్–2026’ సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరై యువతకు క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు. యువతే దేశానికి ప్రధాన శక్తి అని, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి వినియోగించాలన్నారు. నేటి యువతే రేపటి నాయకులన్నారు.

March 2, 2026 / 04:02 PM IST

పెనుకొండ–ధర్మవరం డబ్లింగ్ పనుల పూర్తి

సత్యసాయి: రాయలసీమ అభివృద్ధికి ఊతమిచ్చేలా పెనుకొండ–ధర్మవరం మధ్య 42 కిలోమీటర్ల రైల్వే డబ్లింగ్ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రాజెక్ట్‌లో కీలకమైన మక్కజిపల్లి–ధర్మవరం మధ్య 30.04 కిలోమీటర్ల సెక్షన్ పనులు పూర్తి కావడంతో ఈ మార్గం అందుబాటులోకి వచ్చింది. పెనుకొండ–ధర్మవరం మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

March 2, 2026 / 04:00 PM IST

ములకలూరు మైనార్టీ కాలేజీపై కలెక్టర్‌కు గోపిరెడ్డి వినతి

PLD: నరసరావుపేట మండలం ములకలూరులోని ముస్లిం మైనార్టీ కళాశాల, హాస్టళ్లను వెంటనే ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ భవనాలను ఇతర విభాగాలకు అప్పగించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, మైనార్టీ విద్యార్థుల ప్రయోజనాల కోసం వీటిని వారికే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

March 2, 2026 / 04:00 PM IST

హనుమంతరాయ చౌదరి ఆరోగ్యంపై పల్లా ఆందోళన

ATP: మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అనారోగ్యంతో అనంతపురంలోని సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకుని పూర్వ వైభవంతో ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు.

March 2, 2026 / 04:00 PM IST

కర్లపాలెంలో గొలుసు దొంగల అరెస్ట్

BPT: వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలను కర్లపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఎస్పీ ఉమామహేశ్వర్ ఈ వివరాలను వెల్లడించారు. 2025లో కర్లపాలెం అయ్యప్ప స్వామి గుడి వద్ద జరిగిన చోరీ కేసులో గుంటూరుకు చెందిన అఖిల్, రాజాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి బంగారం, బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

March 2, 2026 / 04:00 PM IST