కృష్ణా: గుడివాడ టీడీపీ కార్యాలయం ఎమ్మెల్యే రాము సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయనకొడాలి నాని త్వరలో తాను జైలుకు వెళుతున్నానని అర్థమయిందేమోనని, ఏ జైలు అయితే బాగుంటుందో చూసుకోవడానికి గుంటూరుకి వెళ్లారని అన్నారు. కొడాలి నానిని ప్రజలు మర్చిపోయారని, ఆయన గురించి మాట్లాడుకునేది ఏమీ లేదని తెలిపారు.
W.G: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షడు ప్రధాన కార్యదర్శులు విజయరామరాజు, పీ. క్రాంతి కుమార్ తెలిపారు. సోమవారం వీరవాసరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ‘ఊరి బడిని బతికించుకుందాం’ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామానుజరావు, తదితరులు పాల్గొన్నారు.
E.G: రాజమహేంద్రవరం బర్మా కాలనీ శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఆధ్వర్యంలో సోమవారం పుష్కరాల రేవులో సలాలా పండుగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాజమహేంద్రవరం సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాలను వడ్డించారు.
PLD: వినుకొండ శివారు పసుపులేరు బ్రిడ్జి వద్ద సోమవారం వేగంగా వచ్చిన కారు, బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
ASR: ఉపాధి హామీ పథకం కింద వెంటనే ఉపాధి పనులు కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. డుంబ్రిగుడ మండలం తూటంగి పంచాయతీ లాసేరు, బల్డ్‌గడ్డ గ్రామాల్లో సోమవారం సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీలకు రోజుకు రూ.600 కనీస వేతనం చెల్లించాలని, ఏడాదికి 200 పనిదినాలు కల్పించాలని కోరారు.
TPT: నాయుడుపేట డీఎస్పీ పర్యవేక్షణలో వెంకటగిరి పట్టణంలోని టిడ్కో హౌసెస్, ఎన్‌టీఆర్ కాలనీలో విస్తృత స్థాయిలో కార్డన్ & సెర్చ్ నిర్వహించారు. మొత్తం 112 ఇళ్లను తనిఖీ చేసి అనుమానితుల వేలిముద్రలు సేకరించి, ఆధార్ వివరాలు పరిశీలించారు. సరైన పత్రాలు లేని 17 మోటార్ సైకిళ్లు, ఒక ఆటో, 18 వాహనాలను సీజ్ చేశారు. నేర నియంత్రణలో భాగంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు.
ATP: జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కు 140 పిటిషన్లు అందాయి. జిల్లా ఎస్పీ పి. జగదీష్ బాధితులతో ముఖాముఖి మాట్లాడి కుటుంబ కలహాలు, రస్తా వివాదాల వంటి సమస్యలను స్వయంగా విన్నారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
NLR: మర్రిపాడు మండలం నందవరం ఆదర్శ పాఠశాల నందు 2026-27 విద్యా సంవత్సరంలో 6వ తరగతి చేరబోవు విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సోమవారం ప్రిన్సిపల్ పి.లక్ష్మీ నారాయణ తెలియజేశారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో చదివిన విద్యార్థులు మార్చి 31 లోపు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
PPM: ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా జిల్లా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ మందిరంలో స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ దిలీప్ చక్రవర్తితో కలిసి కలెక్టర్ అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసమే మండల కేంద్రాల్లో ఏర్పాటు చేశామన్నారు.
BPT: బాపట్ల రైలుపేట సమీపంలో జూదం ఆడుతున్న తొమ్మిది మందిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,10,300 నగదును స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ సీఐ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పోలీసులు, సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 112కి కాల్ చేయాలని ప్రజలను కోరారు.
KRNL: కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పసుపల గ్రామంలోని తన నివాసం నుంచి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఉల్సాల పావని, బురాన్ దొడ్డి నాగమ్మ, మధు కృష్ణ, భూషణం లకు రూ.2,26,249 విలువైన చెక్కులు సోమవారం అందజేశారు. ఈ సహాయానికి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, విష్ణువర్ధన్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
NDL: బనగానపల్లె ఆర్డీవో నరేంద్ర కుమార్ రెడ్డిని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కేడం సుబ్బరాయుడు కలిశారు. రైతుల రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. పేదలకు నివేశన స్థలాల పంపిణీకి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆర్డీవోకు ఇవాళ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు.
CTR: కుప్పం అర్బన్ పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. సుమారు రూ.20 లక్షల విలువ గల 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, వెస్ట్ బెంగాల్‌కు చెందిన 8 మందిని అరెస్ట్ చేశారు. నిందితులపై Narcotic Drugs and Psychotropic Substances Act, 1985 ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు అన్నారు.
CTR: కుప్పం అర్బన్ పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. సుమారు రూ.20 లక్షల విలువ గల 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, వెస్ట్ బెంగాల్‌కు చెందిన 8 మందిని అరెస్ట్ చేశారు. నిందితులపై Narcotic Drugs and Psychotropic Substances Act, 1985 ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు అన్నారు.
సత్యసాయి: కొత్తచెరువు మండలం నారేపల్లికి చెందిన నారాయణ ప్రమాదవశాత్తు గాయపడిన విషయం తెలుసుకున్న పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లారు. బాధితుడిని పరామర్శించి ఆరోగ్య స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. నారాయణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.