పార్వతీపురం పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని నిర్వహించారు. డీఎస్పీ థామస్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి, భారతీయులకు అండగా నిలిచిన మహనీయుడిగా ఆయనను స్మరించారు.
PLD: మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మద్దినగర్‌లో రూ. 30 లక్షలతో నిర్మించనున్న ముస్లిం కమ్యూనిటీ హాల్‌కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మైనారిటీల ప్రయోజనాల కోసం ఈ భవన నిర్మాణాన్ని చేపట్టామన్నారు. గత పాలకులు ముస్లింలకు ఏమీ చేయలేదని అన్నారు.
VZM: రేపటి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్న జామి శ్రీ ఎల్లారమ్మ తల్లి అమ్మవారి జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్ల వద్ద పక్కా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
SKLM: పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల పవిత్రతను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసే విధంగా రాజకీయాలు చేయడం అనర్థకమని అన్నారు. తిరుమలలో జరిగిన ఘటనలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ విశ్వాసాలు ,సంప్రదాయాలు వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతిన్నాయని ఆరోపించారు.
AKP: ఎస్.రాయవరం మండలం జేవీపాలెం వద్ద ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహనాలు తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. రహదారి నిబంధనలు పాటించని వారికి అపరాధ రుసుం విధించారు. ప్రమాదాల జరగకుండా చూసేందుకు వాహనాల తనిఖీలు చేపడుతున్నామని ఎస్సై విభీషణరావు తెలిపారు. పరిమిత వేగంతో వాహనాలు నడపాలన్నారు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించాలని సూచించారు.
ATP: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని, పాత దరఖాస్తుదారులు రసీదులు తీసుకురావాలని సూచించారు. పరిష్కారం కాని ఫిర్యాదుల కోసం 1100 కాల్ సెంటర్ లేదా ఆన్‌లైన్ వెబ్‌సైట్ సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ATP: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని, పాత దరఖాస్తుదారులు రసీదులు తీసుకురావాలని సూచించారు. పరిష్కారం కాని ఫిర్యాదుల కోసం 1100 కాల్ సెంటర్ లేదా ఆన్‌లైన్ వెబ్‌సైట్ సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
కృష్ణా: గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామ శివారులో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీస్ సిబ్బందితో కలిసి కోడిపందాల స్థావరంపై ఎస్సై సత్యనారాయణ ఈరోజు దాడి చేశారు. కోడి పందాలు నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3,150 నగదు, 6 సెల్ ఫోన్లు, ఒక కోడిపుంజు, 5 కోడి కత్తులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
KRNL: పత్తికొండలో బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో, న్యూఢిల్లీలో జరిగిన ఇండియా AI ఎక్స్‌పో సందర్భంగా భారతమండపంపై దాడిని ఇవాళ మండల అధ్యక్షుడు కరణం నరేష్ తీవ్రంగా ఖండించారు. దేశ గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సత్యసాయి: రేపటి నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని PDSU జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ డిమాండ్ చేశారు. కనేకల్ అంబేద్కర్ పాఠశాల వద్ద ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక బస్సులు నడపాలని, వాహనదారులు విద్యార్థులకు లిఫ్ట్ ఇచ్చి పరీక్షా కేంద్రాలకు చేర్చి సహకరించాలని కోరారు.
W.G: బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని ఉమ్మడి గోదావరి జిల్లాల రెడ్డి సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి కృష్ణారెడ్డి కొనియాడారు. ఆదివారం మార్టేరులో ఆయన వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసిన ధీరుడు నరసింహారెడ్డి అని కొనియాడారు.
కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ షెల్కే నచికేత్ ఆదేశాల మేరకు ఏఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించి, బ్రిటిష్ వారిపై పోరాడిన గొప్ప యోధుడని కొనియాడారు.
E.G: రాజమండ్రిలోని దానవాయిపేట మదీనా మసీదు అభివృద్ధికి కృషి చేయాలని నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. కమిటీ సభ్యులు మహమ్మద్ అబ్దుల్లా ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని డీడీ శోభారాణి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను ఆమె పరిశీలించారు. ఇంటర్, పదవ తరగతి విద్యార్థులు ఎలా చదువుతున్నారని ఆరా తీశారు. విద్యార్థులకు పెట్టే భోజనాన్ని స్వయంగా రుచి చూసి, సంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహంలో సౌకర్యాలు బాగున్నాయని విద్యార్థులు చెప్పినట్లు పేర్కొన్నారు.
KKD: పిఠాపురంలో SFI ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఆల్ ది బెస్ట్’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ పోస్టర్‌ను పిఠాపురం CI శ్రీనివాస్, SFI లోవరాజు, సిద్దు చేతుల మీదుగా ఆవిష్కరించారు. రేపు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ‘ALL The Best’ చెప్తూ ధైర్యంగా పరీక్షలు రాసి తల్లిదండ్రులకు, విద్యా సంస్థలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.