• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రాయదుర్గంలో వివాహిత ఆత్మహత్య

ATP: రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గంగాధర్ భార్య 50ఏళ్ల మద్దానమ్మ శనివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మద్దానేశ్వర స్వామి ఆలయం వద్ద బైలాటం ఆడుతుండగా భార్య ఉరివేసుకుందన్న సమాచారంతో హుటాహుటిన వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 21, 2026 / 09:43 AM IST

అదనపు కట్నం కోసం వేధించిన వ్యక్తికి రెండేళ్లు జైళ్లు శిక్ష

VSP: అదనపు కట్నం కోసం వేధిస్తున్న వ్యక్తికి భీమిలి 15వ అదనపు మెట్రోపాలిటీన్ న్యాయమూర్తి స్వాతి శుక్రవారం రెండేళ్లు జైళ్లు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. 2012వ సంవత్సరంలో ఆనందంపురం ఎన్టీఆర్ కాలనీకి చెందిన నీలావతిని అదే ప్రాంతానికి చెందిన గౌరి వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తూ 2021లో ఆమెపై దాడి చేశాడు.

February 21, 2026 / 09:40 AM IST

కోదండరామయ్యకు స్నపన తిరుమంజన సేవ

KDP: ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి దేవస్థానంలో శనివారం శాస్త్రోక్త స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించబడింది. గర్భాలయంలోని మూలవిరాట్‌కి పంచామృతాభిషేకం చేసిన తరువాత, టీటీడీ అధికారులు సమర్పించిన కొత్త పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో ఆలంకరించారు. అనంతరం అర్చకులు పూజలు నిర్వహించగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

February 21, 2026 / 09:40 AM IST

‘ప్రభుత్వం ఆదాని సంస్థకు వేలకోట్లను దోచిపెడుతుంది’

కృష్ణా: గుడివాడ సుందరయ్య భవన్‌లో సీపీఎం పట్టణ కార్యదర్శి ఆర్ సీపీ రెడ్డి నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను అమర్చి, ఆదాని సంస్థకు వేలకోట్లు సొమ్మును దోచిపెడుతుందని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల వల్ల యూనిట్ కి ఉదయం ఒక రేటు, సాయంత్రానికి రేటు నిర్ణయిస్తారని దీనివల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.

February 21, 2026 / 09:38 AM IST

ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధుడు మృతి

PLD: శావల్యాపురం మండలం వేల్పూరులో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యద్దనపూడి రామకోటయ్య (77) బహిర్భూమికి వెళ్లిన సమయంలో రైల్వేస్టేషన్ సమీపంలోని చెరువులో కాలుజారి పడిపోయారు. గమనించిన స్థానికులు ఆయనను బయటకు తీసేలోపే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 21, 2026 / 09:37 AM IST

మండలంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు

PPM: జియ్యమ్మవలస మండలం పెదమేరంగి, సుభద్రవలన ప్రాంతాల పరిసరాల్లో ఏనుగుల గుంపు తిరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు ఇవాళ వెల్లడించారు. సమీపంలోని పామాయిల్ తోటల్లో ఏనుగులు తిష్ట వేసి ఉన్నాయని తెలిపారు. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాలకు వెళ్లే సమయంలో ఏనుగుల కదలికలను గమనించాలని సూచించారు. ఏనుగులు ఎదురైతే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.

February 21, 2026 / 09:35 AM IST

‘ఈనెల 23 నుంచి దరఖాస్తులు చేసుకోండి’

TPT: వెంకటగిరి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తులసి జ్యోతి ఆహ్వానించారు. ఈనెల 23వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 12న నిర్వహించనుండగా, మెరిట్ జాబితాను ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

February 21, 2026 / 09:34 AM IST

‘శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు’

KKDP: గండేపల్లి మండలంలో ఆకతాయిగా తిరుగుతూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న 11 మంది వ్యక్తులకు జగ్గంపేట CI శ్రీనివాస్ కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారిని గండేపల్లి మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌లో హాజరపరచి, సత్ప్రవర్తన కొరకు బైండోవర్ చేశామని సీఐ తెలిపారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా CI హెచ్చరించారు.

February 21, 2026 / 09:34 AM IST

జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 39,838 మంది

శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కాగా మార్చి 20 తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రధమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు కలిపి 39,838 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. దీనికోసం మొత్తం 70కి పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

February 21, 2026 / 09:32 AM IST

మహిళలపై అత్యాచారాలను ఖండిస్తూ.. ఐద్వా నిరసన

అన్నమయ్య: మదనపల్లెలో రుషికప్రియపై జరిగిన అత్యాచార ఘటన నేపథ్యంలో, రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ శుక్రవారం మదనపల్లిలోని స్థానిక విజయనగర్ కాలనీలో ఐద్వా జిల్లా కన్వీనర్ భాగ్యమ్మ నేతృత్వంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా మహిళలకు రక్షణ కల్పించాలని, వారికి సామాజిక మద్దతు అందించాల్సిన అవసరాన్ని నిరసనకారులు నొక్కి చెప్పారు.

February 21, 2026 / 09:31 AM IST

రేపు కేంద్ర మంత్రి మంత్రాలయం రాక

KRNL: కేంద్ర భారీ పరిశ్రమలు, స్టీలు శాఖ మంత్రి హెచ్ ఢీ కుమారస్వామి రేపు మంత్రాలయం రానున్నారు. ఆయన రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. 23వ తేదీన గద్వాల జిల్లా జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటునట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

February 21, 2026 / 09:31 AM IST

రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు

కోనసీమ: ఆత్రేయపురం మండలం పూడింది గ్రామం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న పాసింజర్ ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో ముందు భాగం నుజ్జునుజ్జయింది. స్థానికులు బాధితులను ఆసుపత్రికి తరలించారు.

February 21, 2026 / 09:30 AM IST

విద్యార్థుల కోసం ఇంటి తలుపు తట్టిన ఉపాధ్యాయులు

VZM: పెదబంటుపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఇవాళ 10వ తరగతి విద్యార్థుల గృహాలకు వెళ్లి పరామర్శించారు. త్వరలో జరగనున్న పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ప్రస్తుత చదువు స్థాయిని పరిశీలించి, వారికి అవసరమైన సలహాలు, దిశానిర్దేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతోనూ చర్చించి, పిల్లలు నిరంతరంగా చదువుకునేలా అనుకూలమైన వాతావరణం కల్పించాలని సూచించారు.

February 21, 2026 / 09:30 AM IST

ఏలూరు ప్రజలకు గమనిక

ఏలూరు: నగరంలోని డివిజన్ 27, 28లలో ఈ-వేస్ట్ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శనివారం తంగెళ్ళమూడి-1 సచివాలయం వద్ద, FCI గోడౌన్స్ సమీపంలోని ఏటిగట్టు ప్రాంతంలో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రజల వద్ద ఉన్న ఈ- వేస్ట్ ను అందజేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

February 21, 2026 / 09:28 AM IST

పదో తరగతి విద్యార్థుల వివరాల సవరణకు నేడే ఆఖరు

గుంటూరు: మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల నామినల్ రోల్స్‌లో తప్పుల సవరణకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. గుంటూరు జోన్-3 పరిధిలోని ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్ లింక్ ద్వారా వీటిని సరిచేయాలి. యూడైస్ కోడ్ ఆధారంగా విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్, మతం తదితర వివరాలను శనివారం సాయంత్రం 5 గంటల్లోపు సవరించాలని కోరారు.

February 21, 2026 / 09:22 AM IST