• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మిరప సస్యరక్షణపై రైతులకు అవగాహన

GNTR: ఫిరంగిపురం మండలంలోని పొనుగుపాడు, యర్రగుంట్ల పాడు గ్రామాల్లో శనివారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మిరప పంటపై సమగ్ర సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేవీకే శాస్త్రవేత్త డా. సి.హెచ్. అనిల్‌కుమార్ మిరపలో కనిపించే నల్ల తామర పురుగు, బొబ్బర తెగులు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను వివరించారు.

February 28, 2026 / 02:50 PM IST

పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CTR: ఐరాల మండలం తిరుమలయ్య గారి పల్లెలో శనివారం ఎమ్మెల్యే మురళీమోహన్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెలా లబ్ధిదారులకు పెంచిన మొత్తంతో పింఛన్లు అందిస్తున్నామన్నారు.

February 28, 2026 / 02:47 PM IST

జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్‌కు ఘన స్వాగతం

TPT: జిల్లా పర్యటన నిమిత్తం శనివారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్‌కు ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, అదనపు జిల్లా జడ్జి గురునాథం, శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి తదితరులు ప్రధాన న్యాయమూర్తికి సాదరంగా స్వాగతం పలికారు.

February 28, 2026 / 02:40 PM IST

హెచ్ పీవీ వాక్సినేషన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి

VZM: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. చీపురుపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల వయసు బాలికలకు అందించే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించారు.

February 28, 2026 / 02:38 PM IST

ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వండి: కలెక్టర్

శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. విశాఖ బి, ఇందిరానగర్ కాలనీలలో శనివారం పారి శుద్ధ్యాన్ని, కాలువలు పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో చెత్త వేయకుండా, అక్కడ నిర్వాసితులకు నోటీసులు జారీ చేయాలని అధికారులు ఆదేశించారు.

February 28, 2026 / 02:35 PM IST

పాఠశాలలో సైన్స్ ప్రదర్శన కనబరిచిన వారికి బహుమతులు

NLR: ఉదయగిరి దళితవాడ మండల పరిషత్ పాఠశాలలో శనివారం సైన్స్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు MPD0 బి.శ్రీనివాసులు, HM షబ్బీర్ బహుమతులు అందజేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు సైన్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సైన్స్ విజ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా ముందుకు సాగాలని కోరారు.

February 28, 2026 / 02:35 PM IST

కొల్లూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

BPT: కొల్లూరు మండలం, కొల్లూరు గ్రామం గాంధీనగర్ ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. పెన్షన్ పంపిణీని ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షిస్తూ, పెన్షనర్ల అనుభవాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

February 28, 2026 / 02:33 PM IST

పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ప్రభుత్వ విప్ కాల్వ

ATP: రాయదుర్గం మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. సామాజిక పెన్షన్ సాయం కాదని ఓ ఆర్థిక భరోసా అని ఆయన పేర్కొన్నారు. పెన్షన్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పంపిణీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

February 28, 2026 / 02:32 PM IST

మేకల చోరీ.. కేసు నమోదు చేసిన పోలీసులు

CTR: పుంగనూరు మండలం చండ్ర మాకులపల్లి పంచాయతీ కృష్ణాపురానికి చెందిన రైతు దేవేంద్ర నాయుడుకి చెందిన నాలుగు మేకలను గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. ఈ ఘటనపై బాధితుడు పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఏఎస్సై అశ్వత్ నారాయణ ఇవాళ మధ్యాహ్నం తెలిపారు.

February 28, 2026 / 02:30 PM IST

మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన ఎంఈవో

AKP: కోటవురట్ల మండలం కొడవటిపూడి జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం మండల విద్యాశాఖ అధికారి రామారావు తనిఖీ చేశారు. భోజనం కూరలు సాంబారు పరిశీలించారు. భోజనాన్ని రుచి చూశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలన్నారు. ముఖ్యంగా పరిశుభ్రత పాటించాలన్నారు. ఉపాధ్యాయులు ఈ పథకాన్ని పర్యవేక్షించాలని అన్నారు. హెచ్ఎం ప్రతాప్ కుమార్ పాల్గొన్నారు.

February 28, 2026 / 02:30 PM IST

మార్చి 4న ‘చలో విజయవాడ’కు జర్నలిస్టుల పిలుపు

VSP: వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం మార్చి 4న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. విశాఖ‌ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టుల 11 డిమాండ్ల సాధన కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు.

February 28, 2026 / 02:30 PM IST

జిల్లాలో 191 మంది విద్యార్థులు గైర్హాజరు

PPM: మన్యం జిల్లాలో శనివారం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం హిస్టరీ, బోటనీ పరీక్షకు 191 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు DIEO నాగేశ్వరరావు తెలిపారు. జనరల్ విద్యార్థులు 2,682 మందికి 67 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,575 మందికి 124 మంది పరీక్ష రాయలేదని వెల్లడించారు. మొత్తం 5,257 మంది విద్యార్థులకు 5,066 మంది హాజరు కాగా 191 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు.

February 28, 2026 / 02:30 PM IST

పెన్షన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

ASR: జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దనే పింఛను అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. పాడేరు మండలంలోని మోదాపల్లి గ్రామంలో శనివారం పర్యటించారు. గ్రామంలోని పలువురు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వారి నివాసాల వద్దకే కలెక్టర్ వెళ్లి నేరుగా పింఛన్లను పంపిణీ చేశారు. పెన్షన్ సొమ్ము సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 28, 2026 / 02:30 PM IST

‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

బాపట్ల పట్టణంలోని 22వ వార్డు సంజీవ్ గాంధీ కాలనీ, 23వ వార్డు ఉమ్మారెడ్డి సరోజిని దేవి కాలనీలలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ నగదు అందజేసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 02:29 PM IST

చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

NDL: నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో అయ్యలూరు మెట్ట సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్ఐ గంగయ్య తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉండగా, చేతిపై ‘సద్దాం, సిద్ధం’ అనే టాటూ ఉందని చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు తాలూకా పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

February 28, 2026 / 02:28 PM IST