NDL: నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో అయ్యలూరు మెట్ట సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్ఐ గంగయ్య తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉండగా, చేతిపై ‘సద్దాం, సిద్ధం’ అనే టాటూ ఉందని చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు తాలూకా పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు.